గిడుగు రామమూర్తి పంతులు


సొంత ఊరు:
పర్వతాలపేట
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

గిడుగు వెంకట రామమూర్తి (1863 – 1940) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.


 
  1. వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు (పీఠిక)
  2. జనవరి 2019 » వ్యాసాలు
  3. వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము
  4. జూన్ 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు
  5. విన్నపము
  6. జూన్ 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు
  7. గ్రామ్యభాష – శిష్టభాష
  8. జూన్ 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు