క్రాంతి కుమార్ మలినేని


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

అనేక తెలుగు సాహిత్య వేదికలపై తన కవితలతో గుర్తింపు పొందిన కవి క్రాంతికుమార్ మలినేని. ఆయన “ఎన్నెన్ని వసంతాలో..”, “ఒంటరి ప్రపంచం”, “తెల్లని కాగితాలు” మొదలుకొని ఎన్నో కవితలు రచించారు. సృజనాత్మక కవిత్వానికి, ప్రశంసలు పొందారు. ‘వాకిలి’ సాహిత్య పత్రికలో ‘జయభేరి రెండవ భాగం’లో గొలుసు కవితలు రాశారు.


 

బంగారు గంగాళమేం కాదు
చిన్న మట్టి కుండ.
సంవత్సరాలు కుళ్ళబెట్టిన
ఖరీదైన మందూ కాదు
బాటిల్లో దాచితెచ్చిన
హిమాలయాల నీరూ కాదు.
మున్సిపాలిటీ కుళాయి నీరు.

అహం దెబ్బతిన్న పెద్దదేశం,
చిన్నదేశాన్ని కాలరాసింది.
శవాలన్నీ మట్టిలో కలిసినా
శిథిలాలు చరిత్ర సాక్ష్యాలుగా
మిగిల్చిన యుద్ధమక్కడ.

అహం తొడుకున్న మతం
గుడుల్నే కాదు, చరిత్రనీ చెరిపేసింది.