కల్పన రెంటాల


సొంత ఊరు:
విజయవాడ
ప్రస్తుత నివాసం:
పెన్సిల్వేనియా
వృత్తి:
రచయిత్రి, జర్నలిస్ట్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కల్పనా రెంటాల మొదటి కథ 1985-86లలో తన 20 ఏళ్ల వయస్సులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. మొదటి కవితా సంకలనం “నేను కనిపించే పదం” నకు అనంతా పురస్కారం లభించింది. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ఇతివృత్తాలతో కల్పనగారు అనేక కథలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు చేశారు. ‘తూర్పు-పడమర’ అనే వెబ్ పత్రికను నిర్వహిస్తున్నారు.


 

బైరాగి కవిత్వ తత్త్వం కథల్లో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక రకంగా అది ఆయన సాహిత్య తత్త్వం. తీవ్రమైన భావావేశం, మార్మిక పద చిత్రణ, ఆశానిరాశల ఊగిసలాట, మృత్యు స్పర్శ నీడలో దాక్కునే వాక్యాలు, అర్థమై కానట్లుండే కొన్ని ఇతివృత్తాలూ వెరసి బైరాగి కథలు.

ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?

ప్రవాసాంధ్ర సాహిత్యం ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత […]

అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.

ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.

ఎవరైనా ఇస్మాయిల్‌ గారిని ఎలా మరిచిపోగలరు? ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. […]

దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]