ఎలనాగ


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
హైదరాబాదు
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఎలనాగ అన్న కలం పేరుతో రచించే డాక్టర్ సురేంద్ర నాగరాజు తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగంలో ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు. ఇప్పటివరకు వారు రచించిన 41 పుస్తకాల్లో అనువాదాలు కూడా ఉన్నాయి. లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మౌఘం కథలు, ప్రపంచ కథలు, సైరస్ మిస్త్రీ రాసిన క్రానికల్స్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్, పవన్ కె వర్మ రచించిన గాలిబ్: ది మ్యాన్, ది టైమ్స్, కె సచ్చిదానందన్ రచించిన నాట్ ఓన్లీ ది ఓషన్స్ వంటి పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు మొదలైన ప్రముఖ తెలుగు రచయితల రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. వారి ఆంగ్ల కవితా సంకలనం \”డాజ్లర్స్\” 25 విదేశీ భాషల్లోకి అనువదించబడింది.


 

సుమారు అన్ని కథల్లో జానపద గాథల సరళి, చిన్నపిల్లల ఊహల వైఖరి దర్శనమిస్తాయి. పిల్లలనూ పెద్దలనూ సమానంగా అలరించే కథలు ఇవి. అనువాదం అంత పరిపూర్ణంగా లేకపోయినా కథల బలం కారణంగా అంతగా అది ఇబ్బందిని కలిగించదు. బాలసాహిత్యాన్ని రాస్తున్న తెలుగు రచయితలు ఈ పుస్తకాన్ని చదవితే వారికి లాభం కలుగుతుందని ఈ సమీక్షకుని అభిప్రాయం. దీన్ని రాసిన పరేశ్ పట్నాయక్ అభినందనీయుడు.

ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.

ఎంత సొంతదైనా మూస మూసే
అది యెల్లకాలం రంజించాలని
ఆశిస్తే మిగిలేది అడియాసే!

సవ్యత లేని భాష నేడు హీరో
సరైన భాషకు ఆదరణ జీరో
ఈ సంకటస్థితిని చూసి
అభిజ్ఞులు ఏమంటారో!

ఆ వస్తువులన్నిటిని క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తార భర్త వాటన్నిటిని క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకొని భరించింది. ‘ఒకరోజున ఇవన్నీ సర్దుతాను అనుకుంటాం. కానీ, వాటిని అలాగే వదిలి ఎకాయెకిన చెప్పాపెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం.’ తార పార్థివశరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది.

క్రితం సంచికలోని గడినుడి-40కి మొదటి ఇరవై రోజుల్లో ఆరుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, జిబిటి సుందరి, అగడి ప్రతిభ, సరస్వతి పొన్నాడ, వైదేహి అక్కిపెద్ది, కన్యాకుమారి బయన. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-40 సమాధానాలు.

స్వాదుసౌందర్య దీప్తుల్ని వెలయించే
కళాకర్పూరగంధి కోసం కలవరిస్తే
నిత్యనిస్సారవికారాకారంతో
ప్రత్యక్షమైంది కవితాలలామ

నిర్దిష్టవాక్య నిర్మాణనైపుణ్య నిధి కోసం నిరంతర ప్రయాసను గునపం చేసి తవ్వుతూ పో రచనాకారుడా. చక్కని పదాల కాంతులు అల్లుకున్న చుక్కల పందిరికి లెక్కలేనన్ని భావవిద్యుద్దీపాల వెలుతురు గుత్తులు వేలాడనీ.

కనపడని ఒక విచ్ఛేదం
కడుపులో పొంచి వున్నట్టు
బద్దలవబోయే బాంబు ఒకటి
లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు
దేహం లోని అంతరింద్రియంపై
దాడి చేసేందుకు క్రూరమృగమొకటి

సూటిదనం మొహం చాటేసి
ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
జల్లెడ లోంచి జారిపోయే నీళ్ళు
అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్