వాడ్రేవు చినవీరభద్రుడు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

కానీ ఒక్కసారి కృష్ణశాస్త్రి కవిత్వంలోనికి గాని మనం తొంగి చూసినట్లయితే అది నిత్యనవీనమని ఆ కవిత్వం నిత్యవసంతమని ఆ పువ్వులు ఎప్పటికీ వాడవని ఆ కవిత్వాన్ని మనం సమీపించకపోవడం ఒక్కటే మనం ఆ కవిత్వం తాలూకు వెలుగుకి దూరం కావడానికి కారణమని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారి ఆ కవిత్వాన్ని పునఃపరిశీలించడం ద్వారా, ఆ కవిత్వాన్ని చేరడం ద్వారా, ఆ కవిత్వానికి కైమోడ్చడం ద్వారా మనం మరొకసారి ఆ మహాకవికి నివాళిని అర్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాససమర్పణ.

ఒక భాష ఏళ్ళ తరబడి, శతాబ్దాల తరబడి చేసిన తపస్సు వల్ల బైరాగి వంటి కవి పుడతాడు. ఈ మాట మా మాష్టారు పోతన్న గురించి అన్నారు. నేను బైరాగి గురించి అంటున్నాను. బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.

పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, వినాశనం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం అడుగులు వేస్తున్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.

భారతీయ భక్తి సాహిత్యంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతిస్తోనో, ప్రేమిస్తోనో కవిత్వం చెప్పడం మొదలైన ఎంతో కాలానికిగాని శక్తిని ఆరాధిస్తూ చెప్పే కవిత్వం రాలేదు. వేదాల్లోని వాగ్దేవి సూక్తం, ఉపనిషత్తుల్లోని ఉమా హైమవతి, ఇతిహాస, పురాణాల్లోని దేవి, బౌద్దుల తార, తాంత్రిక దశమహావిద్యల్లో కాళి ఒక ఉపాస్య దేవీమూర్తిగా భక్తికవుల హృదయాల్ని కొల్లగొట్టుకోడానికి పద్దెనిమిదో శతాబ్దిదాకా ఆగవలసి వచ్చింది.

అఫ్సర్ రాసిన ఇంటివైపు కవిత్వసంపుటి పుస్తకానికి వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట. ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్

మచాడో తన దేశాన్ని తన దేశపు గ్రామాల్లో, పొలాల్లో, రైతుల్లో, ఋతువుల్లో చూశాడు. అందులో రంగుల్ని చూశాడు. అవి స్పష్టంగా స్పెయిన్‌ రంగులు. కాని అతడు చూసిన స్పెయిన్‌ ఎంత స్ధానికమో, అంత విశ్వజనీనం. అందుకనే అతడు చూసిన, చూపించిన దృశ్యాల్లో నాకు నా బాల్యం, నా స్వగ్రామం, నా స్వదేశం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.