పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 1:44 pm

    బహు చక్కగా ప్రస్తుత రగడకు పూర్వపు ఇతిహాసానికి లంకె కట్టారు. భలే నవ్వు వచ్చింది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. ఈ-మెయిలు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 1:34 pm

    ఈమెయిలు అని చూడగానే ఈమెయిలు సాంప్రదాయిక వుత్తరాలను ఎలా నాశనం చేసిందో చెప్తున్నారేమొ ననుకున్నా!
    చాలా బాగుంది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  3. అన్నీ చెప్పగల భాష గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 1:30 pm

    ఇంత బాగా చెప్పగలిగారు ఇక మీ భాషకేమయిందండి? 🙂
    “వేసుకుందామంటే ఏచొక్కా
    నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
    పెంకితనమే నా భాష కొచ్చింది.”
    ఇప్పటి వచ్చీరాని భాష గురించి చక్కగా చెప్పారిందులో.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. అక్టోబరు పులి గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 1:28 pm

    చాలా బాగుంది.
    చూసే వారి దృష్టి, ఆడేవాడి దృష్టి రెండూ బాగా మలిచారు.
    –ప్రసాద్

  5. ఛందోధర్మము గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 12:52 pm

    కృష్ణదేశికాచార్యులు గారూ,
    మీలాంటి పెద్దలకు చెప్పేంతవాన్ని కాదు. అలాగే మీరు చెప్పిన వుదాహరణలతో విభేదించాల్సిన పనీ లేదు. చందోబద్దమైన పద్యానికి, లయ బద్దమైన గేయానికి, భావ బద్దమైన వచన కవిత్వానికి దేనికున్న విలువ దానికుంది. అలాగే చంధస్సు అన్నది స్వయంభువు అన్నదానితో మీ వుదాహరణలతో నేనేకిభవిస్తాను. ఒక మంచి లయబద్దమైన పాట వింటున్నపుడు కాలు లయబద్దంగా ఎలా కదులుతుందో అలాగే మనసును రంజింపజేసిన భావము కవి నోటిలో చంధోబద్దంగా పద్యాన్ని పలికిస్తుందని మీ వ్యాసమంతా చదివాక తెలుసుకున్నాను.
    అయితే చంధస్సు, యతి ప్రాసల నియమాలు కవితాకల్పనకు దోహదం చేసే నియమాలనడంతో విభేదించాల్సివస్తోంది. మీరే అన్నట్లు లయ ప్రాధాన్యంగా వుండాలంటే చందస్సు అవసరమే. అయితే భావమే ప్రధానమంటే చందస్సు కాక బావాన్ని కఠినంగా వ్యక్తపరిచే పదాలనే ఎన్నుకోవాలి కదా! చంధస్సుకు సరిపడలేదనే కారణంచేత సరైన భావాన్ని పలికించే పదాన్ని వదిలివేయడం ఎంతవరకు సబబు? మీరే చెప్పిన చాలా వుదాహరణల్లో యతి నియమం కోసం ఒకటి రెండు నియమాలు ఆలోచించి ఆ పదభందాలు చేర్చామన్నారు కదా. నాకప్పుడు ఏమనిపించిందంటే ఈ యతి నియమం సంతృప్తిపరచే పదభందం దొరగ్గానే మీలోని కవి మరింత మంచి పదానికై తన శోధనను ఆపివేశాడేమొనని! ఆ నియమమే లేకుంటే ఇంకెంత భావపుష్టి కలిగిన పదం మీకు దొరికేదో! ఆవేశంగా ఆశువుగా పదభందాలు దొర్లి automaticగా చంధోబద్దమైన పాదాలు జనిస్తే సరే కానీ యతో, ప్రాసో కలిసిందనే సాకుతో అంతకంటె మంచివైన పదాలను వదిలివేయడం సమంజసం కాదేమొ, లయబద్దమైన కవిత్వమే కావాలనుకుంటే తప్ప!
    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. అనుబంధం గురించి T.Satyanarayana అభిప్రాయం:

    10/28/2006 3:37 am

    Such situations do exist everywhere in the world.

  7. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/27/2006 2:25 pm

    ఒక రచన కలం పేరు మీద సాగినా, నిజం పేరు మీద సాగినా, ఆ రచన మీద అభిప్రాయం రాసేటప్పుడు ఆ రాసే వ్యక్తి తన నిజం పేరుతో రాయటం ఆరోగ్యకరమే కాదు, అవసరమేమో అని కూడ అనిపిస్తోంది. ప్రచురణ ముందు జరిగే రివ్యూ రాసేటప్పుడు అనామకంగా రాయటం ఆరోగ్యకరం అయినట్లే, ప్రచురించబడ్డ వస్తువు మీద విమర్శ రాసేటప్పుడు నిజం పేరుతో రాయటం కూడ అంతే ఆరోగ్యకరం. ఈ విషయంలో నేను లైలా గారితో ఏకీభవిస్తాను. రాసే వ్యక్తిని ఆక్షేపించకుండా రాసిన విషయాన్ని ఆక్షేపించటానికి భయం ఎందుకు?

  8. అర్హత గురించి Ramesh అభిప్రాయం:

    10/25/2006 2:42 am

    Very Very nice. A beautiful Romantic love story. I like such type of stories.

    Thanks to the author for delivering such type of good story.
    Thanks
    Ramesh Gullapalli
    Hyderabad

  9. స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ గురించి Ramesh అభిప్రాయం:

    10/25/2006 1:44 am

    బాగుంది. very nice. Good prediction about the Swamijis

  10. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Lyla Yerneni అభిప్రాయం:

    10/24/2006 6:16 pm

    Regarding – observer eccentric , and any number of other pseudonym users:

    రచనల మంచిచెడులు, రచయితల ఉద్దేశాలు, పాఠకుల నిద్ర-మెలకువలు, వగైరాల మీద -వీరు వీరి పేరు బైట పెట్టకుండా ఉద్దెశాలు వెలువరించడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏమిటి?
    ఈ మాట ఎడిటర్లు కావాలంటే అసలు పేర్లే లేకుండా రచనలు, వాటిపైన ఉద్దేశాలు వెయ్యొచ్చు. లేదా రచయితలకు, పాఠకులకు అందరికీ ఒకే రూలు వర్తించనీయండి.
    ఒక్కొక్క ఉద్దేశానికి ఒక్కొక్క మారుపేరు తగిలించుకుని పాఠకుడు/లు వ్రాయటం అసభ్యంగా అనిపిస్తుంది నాకు. తమ సొంత పేరు తో చిన్న అభిప్రాయం కూడా తెలుపలేని వారి అభిప్రాయాలకు విలువేమిటి?
    నా ఉద్దేశంలో సున్నా.