పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. ఉద్యోగం గురించి chavakiran అభిప్రాయం:

    11/02/2006 8:04 pm

    చాలా బాగుంది

    మీరు డాక్టరు అని నాకు తెలుసు కదా:)

    ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయితే ఎలా వ్రాసేవారు ?

  2. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    11/02/2006 7:53 pm

    బ్రహ్మానందం గారూ!

    కోనసీమ కథలు చెప్పినందుకు ధన్యవాదాలు. నేచెప్పిన కథ variation on the same theme అన్నమాట. ఇట్లాంటి పిట్ట కథలు ఇంకా ఏవన్నా ఉంటే చెప్పండి. అన్నీ కలిపి ఒక చిన్ని పుస్తకం వేద్దాం.
    మరోసారు ధన్యవాదాలతో,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  3. ఈమాట కొత్త వేషం గురించి Kameswararao అభిప్రాయం:

    11/02/2006 5:02 pm

    మొదటి 30 సంచికలు P D F గా download చేయబడ్డాయి.

    అక్కడినుండి మిగిలిన సంచికలు కూడా PDF గా Download చేసుకునే అవకాశమ కలిపించండి.

    మీ
    కమేశ్వరరావు.

  4. ఛందోధర్మము గురించి Raja Shankar Kasinadhuni అభిప్రాయం:

    11/02/2006 3:35 pm

    కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.

    కాశీనాథుని రాజాశంకర్

  5. గణపతి బప్పా మోరియా! గురించి aananda అభిప్రాయం:

    11/02/2006 11:24 am

    కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!
    ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.
    దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!
    బహుశా ఇది కూడా మాయేమో?
    వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,
    దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!

    వక్త్రతుండ మహాకాయ
    సూర్యకోటిసమప్రభ
    నిర్విఘ్నం కురు మే దేవ
    సర్వకార్యేషు సర్వదా

    నవ్వి నవ్వి నా బొజ్జ పేలదు గదా!

    – ఆనంద

  6. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sai Brahamanandam Gorti అభిప్రాయం:

    11/02/2006 11:17 am

    వేలూరి గారు,

    మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.

    ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!

    రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!

    ఇటువంటి కథలు మా కోనసీమ లో చాలా ఉన్నాయి.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  7. ప్రతీకగా శరీరం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/02/2006 4:41 am

    చక్కని వ్యాసం. మీరు అనువదించిన కవిత అద్భుతంగా ఉంది.

  8. ఈ-మెయిలు గురించి K.Reddeppa అభిప్రాయం:

    11/02/2006 3:12 am

    చానా బాగుంది. చాలా సంతోషంగా వుంది తెలుగులో మంచి సైటును ఏర్పాటు చేసినందుకు.

    ధన్యవాదాలతో
    కె.రెడ్డెప్ప
    రామసముద్రము
    చిత్తూరు జిల్లా
    ఆంద్రప్రదేశ్

  9. బస్సెడు దూరం గురించి radhika అభిప్రాయం:

    11/01/2006 2:19 pm

    ఈ ఆర్టికల్ చాలా బాగుంది.

  10. ఉద్యోగం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2006 2:09 pm

    చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.
    –ప్రసాద్
    http://blog.charasala.com