Comment navigation


15549

« 1 ... 1409 1410 1411 1412 1413 ... 1555 »

  1. తుపాకి గురించి rama గారి అభిప్రాయం:

    03/19/2008 11:49 pm

    అబ్బ! స్నేహమ్ గురించి ఎంత చక్కగా చెప్పారండి. కళ్ళ నీళ్ళు వచ్చాయి చదువుతుంటే. చాలా చాలా బాగుంది కధ.స్నేహానికి సరిహద్దులు లేవని చాలా చక్కగా చెప్పారు. తుపాకి కధ నిజంగా తుపాకి నే.

  2. ఇండియన్‌ వేల్యూస్‌ గురించి rama గారి అభిప్రాయం:

    03/19/2008 10:57 pm

    కధ చాలా బాగుంది. ఇండియన్ వాల్యూస్ అర్ధం అక్కడి ఇండియన్ భాష లో ఏమిటో చాలా చక్కగా వివరించారు. నేను మా బంధువులు ఇక్కడికి వచ్చినప్పుడు (పరదేశాల నుండి) అంటూ వుంటాను “అక్కడి వాళ్ళకి మొరల్ వాల్యూస్ వుండవు ” అని, ఇదిగో ఇప్పుడది గుర్తొస్తోంది.

  3. “చందమామ” జ్ఞాపకాలు గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    03/19/2008 11:20 am

    నేను చందమామలను సేకరించే అభిరుచి కలవాణ్ణి. 1947 నుండి, 1980 వరకు చందమామలలొ (ధారావాహికలు పునర్ముద్రించటం మొదలుపెట్టేవరకు). ఎవరి దగ్గరయినా, పైన చెప్పిన సంచికలు ఊండి, అవి వారు dispose ఛేద్దమనుకునేవారు నాకు తెలియచేయగలరు. ఇద్దరికి అంగీకారమయిన పద్దతిలో నేను తీసుకొనుటకు ఎంతో సంతోషిస్తాను.

    దయచేసి నాకు E Mail ఇవ్వగలరు.

    కప్పగంతు శివరామప్రసాదు
    ముంబాయి

  4. “చందమామ” జ్ఞాపకాలు గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    03/19/2008 11:11 am

    చందమామ గురించి ఆసక్తి ఉన్నవారు తెలుగు విఇకిపీడియా లూ ఈ క్రింద ఉన్న లింకు ద్వారా ఒక వ్యాసము చూడవచ్చును, మరియు వారికి తెలిసిన వెశేషాలు ఆ వ్యాసంలొ చేర్చవచ్చును.

    అలాగే, చందమామలోని బేతాళ కథలగురించి కూడా ఒక ప్రత్యేక వ్యాసము తెలుగు వికీపీడియాలో ఉన్నది, ఈ లింకు ద్వారా అక్కడకు వెళ్ళవచ్చు.

    బేతాళ కథలు ఒరిజినల్గా ఎవరు వ్రాసారో, ఎక్కడనుండి ఈ కథలు ప్రారంభమైనాయో, అన్ని కథలుగా ఉన్నయో, చివరి కథ య్క్కడన్న దొరుకుతుందా. ఇటువంటివంటి ఆసక్తికర విషయాలు తెలిసినవారు ఈ వేదికమీద కాని, తెలుగు వికీపీడియాలో వ్రాసి గానె తెలియ చేయగలరు.

    కప్పగంతు శివరామప్రసాదు
    ముంబాయి

  5. వీరిగాడి వలస గురించి rama గారి అభిప్రాయం:

    03/19/2008 3:45 am

    చాలా బాగుంది కధ. వృద్ధాప్యంలో కూడా ఇంకో అమ్మాయితో మాట్లాడితే సహించలేని ఆడవాళ్ళ అపార్ధాలని అద్దం పట్టినట్లు చెప్పారు. ఇంతకి “వీరిగాడు” దొరికాడా మరి రాఘవ రావు గారికి? ఒంటరితనం వూహించడానికి కూడా భయంగానే వుంది.

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి Venkata Satish Babu Samudrala గారి అభిప్రాయం:

    03/17/2008 9:13 am

    Hi Hamuma,

    I have gone through this article, which is wonderful. Basically this article helps me in how binary system has been implemented in computers in a thesis way mean we have learnt binary numeric system. I read your previous articles also those are having very good information. I will wait for your upcoming articles.

  7. రచయితలకు సూచనలు గురించి dresudhakar గారి అభిప్రాయం:

    03/17/2008 3:32 am

    ఈ మాట మీ మాట కాదు, మా మాట .మనందరిమాట ప్రజల మాట కాలం మాట కలకాలం కలాలమాట.
    కాలంమీద మీసంతకానికి
    అభినందనలతొ……….
    మీ… డా.ఈదూరు. సుధాకర్
    అద్యక్షులు
    నెల్లూరు జిల్లా రచయితల సంగం
    నెల్లూరు

  8. ఓ చందమామ గురించి yashwanth.alakky గారి అభిప్రాయం:

    03/15/2008 10:48 pm

    చాలా బాగుంది.

  9. లిటిల్‌సైంటిస్టు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/15/2008 6:03 pm

    ప్రచురించిన రచనను ఇంకొక చోట ప్రచురించబడ్డది అని పూర్తిగా తొలగించడం, జరిగిన పొరపాటుకు మించిన తప్పిదం లాగా అనిపిస్తుంది. పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించినా అది దురభిప్రాయంతోనో, దురుద్దేశంతోనో చేసినట్టుగా కనిపించదు. అయినప్పటికినీ, మన్నించమని అడగడమో, ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని విన్నవించడమో సరిపోయేదేమో.
    ఏ రచయితైనా తన రచనను ప్రచురించకపోతే కొంత నిరుత్సాహపడవచ్చేమో కానీ, ప్రచురించిన తర్వాత తొలగించడం నొప్పి కలిగించేదే. అదీ రచనయొక్క గుణాల గురించిగా కాక, తెలిసో తెలియకో ఇంకో చోట ప్రచురింపబడ్డందుకే అని గుర్తిస్తే సంపాదకుల నిర్ణయం అర్థంచేసుకునేదే అయినా, సహృదయంగా మాత్రం అనిపించడంలేదు. పాఠకులకైతే ఇది వడ్డించిన విస్తరి తీసేసినట్టుగా ఉంది. ఏన్నో ప్రచురించి ఉండొచ్చు, ఈ రచయితవే కూడా, కాని ఇలా వేసి తీసిపారేసారు అన్న మాటే ‘ఈమాటకు’ అన్నింటికన్నా ఎక్కువగా నిలిచిపోతుందనే అనుమానం కలుగుతుంది. సంపాదకులు కొంత సహృదయంతో పునరాలోచించి తీసేసిన రచనను, వారికిష్టమైన, తోచిన గమనికతోనైనా, పునర్ముద్రించాలనీ, ఈ తీసివేతకు తొందరగా తెరదించాలని కోరుకుంటున్నాను, కాదు అర్థిస్తున్నాను.
    విధేయుడు
    Srinivas

  10. ఆహా గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:

    03/15/2008 9:48 am

    Is it just me? or is it toooooo perfect?

    నాదో అభిప్రాయం: మీ కవిత చదువుతుంటే అన్ని క్లైమేక్సులు వున్న సినిమా చూస్తున్నట్టు వుంది. ఇక పద్యానికి పద్యానికీ థీమేటిక్ సంబంధం వున్నా వాటికి క్రమనియమం అవసరం లేదనిపిస్తుంది. అంటే కొన్ని పద్యాలను పైకీ క్రిందకీ చేసినా కొంత వరకూ అదే ఫలితం ఉంటుంది చదువరికి అని. ప్రతి పద్యాన్ని (లేదా ఒకటి రెండిటినీ) ప్రక్కకు తీసి, దాన్ని క్లైమాక్సుగా వాడి, వాటికి తగిన బిల్డప్పు ఇస్తే వాటిని నాలాంటి వారు ఇంకా బాగా ఆస్వాదించగలరనిపిస్తుంది. ఈ శైలిలో ఏదో బాణాల వర్షం కురిసినట్టూ భావాల వరదలో కొట్టుకుపోతున్నట్టూ వుంది (మీ కవిత ప్రభావం అనుకుంటా నాకు కూడా ఉపమాలు వస్తున్నాయి :))

    నేను చెప్పదలచుకుంది ఆంగ్లంలో కౢప్తంగా : Not just the metaphoric mountains but also some build up to them through some winding scenic mountain paths, with an occasional flower here and there would be perfect, as opposed to being too perfect.

    రాకేశ్వర రావు

« 1 ... 1409 1410 1411 1412 1413 ... 1555 »