మేడా, మిద్దె కాక హాస్టల్ రూముల్లో, స్నేహితుల అపార్ట్‌మెంట్లలో, చెరువు గట్లమీదా కూడా మేము చేసేవారం ఈ కంబైన్డ్ స్టడీ. మిడ్‌టెర్మ్‌కి ఫలానా రూమ్‌లో చదివితే మంచి గ్రేడ్ వచ్చింది కనక మిగతా ఏడాది, సెమెస్టర్ అంతా ఫలానా రూమే. టీలూ, భోయనాలు అన్నీ మిగతావి మీరు చెప్పినట్టే, చదువుమీద తప్ప మిగతా అన్నింటిమీదే శ్రద్ధ. ఫలానా టీచర్ దరిద్రుడురా, మనం ఏం చదివి ఏం రాసినా మార్కులేయడు; ఇప్పుడు చదివి ఏం ప్రయోజనం అనే వేదాంతం కూడా ఇక్కడే వంటబట్టేది. ఆశ్చర్యంగా ఆ ఫలానా టీచర్, ప్రొఫెసర్ ఎంత కష్టపడి చదివి రాసినా మంచి మార్కులేసేవాడు కాదు – అనుకున్నట్టే. డిగ్రీలన్నీ అయ్యాక ఆ ప్రొఫెసర్లనీ టీచర్లనీ మర్చిపోయేం కానీ గత స్మృతులు బాగానే గుర్తున్నై. అయితే ఆ స్నేహితులూ రూమ్మేట్లూ ఇప్పుడెక్కడున్నారో ఒకరికొకరికి తెలియదు.
అనుభూతికి అక్షరాలు కూర్చే రచనలూ, రచయితలూ మనతోటే ఉండిపోతారని చక్కగా చెప్పారు, శ్యామ్. వారిని “ఆలోచనల్లో” పొందుపరుచుకుని సాహితీసంస్కారాన్ని వెల్లడించారు. పద్మరాజు గారి నిజాయితీని, త్రిపురగారి కథాచాతుర్యాన్ని బాగా విశ్లేషించారు. ఈరోజుల్లో అది చాలా అరుదైన లక్షణం. కథకి నిజం ఖనిజం అన్న విషయం మీ సామాజికస్పృహకి తార్కాణం. కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలు ఈనాటికీ తాజాగా, relevantగా ఉన్న విషయం అందరి ముందూ ఉంచారు. వారి రచనల్లో నిజం ఎంతో శక్తివంతమైన ఖనిజం. “కానీ అలాంటివాళ్ళు తెలుగువాళ్ళవడం వల్ల, వాళ్ళ ఆధునిక గ్రంథమాల అర్ధాంతరంగా పోయింది” అంటూనే మీరు మంచి రచనల్నీ, రచయితల్నీ “వెన్నెల” లోకి తీసుకొచ్చే యథాప్రయత్నం చేశారు. డిటెక్టివ్‌లు- యుగంధర్, వాలి, గిరీల–నవలలు చదివి పెరిగిన మేము, వారి ప్రసంగం రాగానే ఆనందంతో పులకించి పోతున్నాం. జీవితం అర్థరహితంగా ఉందని అన్నారు కానీ, జీవితమంటే అవగాహన ఉన్నవారికే అది ఎంత అర్థరహితమో తెలుస్తుందని ఎవరో అన్నట్టు గుర్తు. ఎంతైనా… రవి గాంచనిచో కవి గాంచునే కదా…
కంబైన్డ్ స్టడీ గురించి Buddala Venkatesh గారి అభిప్రాయం:
మీ గడి నుడి క్లూలు కొన్ని అసమంజసంగా, వింతగా, అర్థరహితంగా, ఊహించలేని విధంగా ఉంటున్నాయి. అవి కూర్పరికి, కొద్దిమంది రెగ్యులర్ ఆల్ కరెక్ట్ పాఠకులకు తప్ప మరెవరికీ అర్థం కావు. వాటికి ఒక లాజిక్ లేదు. కొద్దిగా దిద్దుబాటు చర్యలు తీసుకోండి.
కంబైన్డ్ స్టడీ గురించి అయ్యగారి భుజంగరావు గారి అభిప్రాయం:
05/03/2024 1:53 am
బంగారు బాల్య స్మ్రుతులను గురుతు చేసిన మీ రచనకి… దానికి మీరు వేసిన illustrationకి వేల వేల సలాములు అన్వర్‌జీ.
శర్మ దంతుర్తిగారికి నమస్సులు! ఇక్కడ నేను మీరు అడిగిన రెండవభాగపు ప్రశ్నలకు మాత్రమే సమాధానమును ఇస్తున్నాను.
(1) రుబాయీ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన ఛందస్సు గలదు. దానిని వ్యాసములో వివరించినాను.
(2) పారసీక ఉర్దూ భాషలలో గణములకు తగినట్లు పదములు, అంత్యప్రాస మాత్రమే ముఖ్యము. తెలుగులో నేను అదనముగా ద్వితీయాక్షర ప్రాస, అక్షరసామ్య యతిని కూడ వీలైనప్పుడు వాడినాను.
(3) In principle మీరు ఏయుగమునైనను వాడవచ్చును. కాని ఛందస్సు రీత్యా అక్కడ UUUU లేక UUIIU లకు సరిపోయే పదములను మాత్రమే వాడాలి. త్రేతాయుగమే అను పదము UUIIU నకు సరిపోతుంది. రేఫముతో అక్షరసామ్య యతి. నాలుగవ పాదమునకు కూడ ఇక్కడ చెప్పినది వర్తిస్తుంది.
The twist in the story is interesting!!
Congratulations to Nadella Anuradha.
మాటలు ఉండాలి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
05/02/2024 8:09 am
అంత్యశయ్య మీద… నిప్పు రాజుకునే ముందు
అక్షర సత్యాలు చెప్పారు. అద్భుతం. నిజంగా నోరు విప్పకపోతే చివరకి జరిగేది ఇదే.
హై టెక్ అనుకుంటూ మనం తవ్వుకున్న గొయ్యే ఇది. మొదట్లో ఉత్తరం వస్తే – కార్డు ముక్క అయినా – ఎంతో సంతోషం. తర్వత ఫోన్ మోగితే సంతోషం మనలని ఎవరో పలకరిస్తున్నారని. ఆ కాల్ రాంగ్ నెంబర్ అయినా (ఒరే చిట్టిగా బావున్నావా? … సారీ ఇది లారీ సప్లై ఆఫీసండి) అదో నవ్వుకునే ఆనందం. ఇప్పుడవన్నీ పోయి స్నేహం ఫేసుబుక్కు మీదా, ఎన్ని లైకులొచ్చాయ్, ఎవడు కొట్టాడు లైకు, వాట్సాప్ లో సంతోషం వెతుక్కునే జీవితం రావడానిక్కారణం; ప్రతీ కుర్రాడూ కుర్రమ్మా ఫోన్ మీద వీడియోలూ అవీ చూసుకోవడానికీ కారణం మన స్టీవ్ జాబ్స్ బాబే. ఫోన్ మోగితే ఎత్తరు కానీ ఎస్సెమ్మెస్ మెసేజ్ వస్తే చంకలు గుద్దుకుంటూ అది మరో పది మందికి ‘స్ట్రైట్ ఫార్వార్డ్’ చేసేయడమే; అది నిజమా కాదా అనేది ఎవరికీ పట్టదు. ఆశ్చర్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిక్కూడా ఈ ఫేసుబుక్కు జ్వరం గొరిల్లా గ్లూలా అంటుకుని ఎంతకీ వదలడం లేదు.
చేతులు పట్టుకుని పక్కపక్కనే కూర్చుని ఒక మాయాబజార్ లాంటి సినిమా చూసి, రోజువారి పడే తిప్పలు మర్చిపోయి, మనసు విప్పి మాట్లాడుకునే రోజులేవీ? మనుషులున్నారు నిజమే, కానీ ఎవరికీ నోరు పెగలదు. అర్ధాంగినో, కొడుకునో, కూతుర్నో చూసి ‘ఐ లవ్ యూ’ అనే రోజులు లేవు. మొహం ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడలేక, వాట్సాఫ్ లో చెప్పుకోవడమో లేదా ఫేసుబుక్కులో లైకులు కొట్టడమో. పక్క గదిలో కుర్రాడు ఈ గదిలో తమ్ముడితో మాట్లాడ్డు – మెసేజ్ పంపుకోవడమే. ఫోను కూడా కమ్యూనికేషన్ కి కాదు ఇప్పుడు. వీడియోలకి ఆటలకీ ఎస్సెమ్మెస్ లకీ అంతే. దేనికైనా సరే ఒకే ఒక ఆయుధం – గూగిల్ కరో భాయీ!
మనుషులు మాట్లాడుతున్నప్పుడు వినకపోయినా, వాళ్ళు చెప్పినది అక్కర్లేదనుకున్నా, తర్వాతెప్పుడో కావాలనుకున్నప్పుడు మాట్లాడ్డానికి ఆ మనుషులు ఉండరు. ఈ కవితలో ఇది సరిగ్గా ప్రతిబంబించారు
శివమయం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
05/03/2024 10:18 am
ఇంతకీ చిలకలకి సరసా అనేమాట నేర్పింది ఎవరు? శివా!
అర్చకస్వామేనా? శివా!
అర్చకస్వామి దూరమైపోయినందుకు సరసేనా అలా నేర్పింది? శివా!
ఎందుకు అర్చకస్వామి ఉద్యోగం ఊడింది? శివా!
జయమోహన్ కధ – శివా!
భాస్కర్ అనువాదం – శివా! శివ శివా! 🙂
కంబైన్డ్ స్టడీ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
05/03/2024 10:11 am
మేడా, మిద్దె కాక హాస్టల్ రూముల్లో, స్నేహితుల అపార్ట్‌మెంట్లలో, చెరువు గట్లమీదా కూడా మేము చేసేవారం ఈ కంబైన్డ్ స్టడీ. మిడ్‌టెర్మ్‌కి ఫలానా రూమ్‌లో చదివితే మంచి గ్రేడ్ వచ్చింది కనక మిగతా ఏడాది, సెమెస్టర్ అంతా ఫలానా రూమే. టీలూ, భోయనాలు అన్నీ మిగతావి మీరు చెప్పినట్టే, చదువుమీద తప్ప మిగతా అన్నింటిమీదే శ్రద్ధ. ఫలానా టీచర్ దరిద్రుడురా, మనం ఏం చదివి ఏం రాసినా మార్కులేయడు; ఇప్పుడు చదివి ఏం ప్రయోజనం అనే వేదాంతం కూడా ఇక్కడే వంటబట్టేది. ఆశ్చర్యంగా ఆ ఫలానా టీచర్, ప్రొఫెసర్ ఎంత కష్టపడి చదివి రాసినా మంచి మార్కులేసేవాడు కాదు – అనుకున్నట్టే. డిగ్రీలన్నీ అయ్యాక ఆ ప్రొఫెసర్లనీ టీచర్లనీ మర్చిపోయేం కానీ గత స్మృతులు బాగానే గుర్తున్నై. అయితే ఆ స్నేహితులూ రూమ్మేట్లూ ఇప్పుడెక్కడున్నారో ఒకరికొకరికి తెలియదు.
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి వెలిదండ వేణుగోపాల్ గారి అభిప్రాయం:
05/03/2024 7:37 am
అనుభూతికి అక్షరాలు కూర్చే రచనలూ, రచయితలూ మనతోటే ఉండిపోతారని చక్కగా చెప్పారు, శ్యామ్. వారిని “ఆలోచనల్లో” పొందుపరుచుకుని సాహితీసంస్కారాన్ని వెల్లడించారు. పద్మరాజు గారి నిజాయితీని, త్రిపురగారి కథాచాతుర్యాన్ని బాగా విశ్లేషించారు. ఈరోజుల్లో అది చాలా అరుదైన లక్షణం. కథకి నిజం ఖనిజం అన్న విషయం మీ సామాజికస్పృహకి తార్కాణం. కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలు ఈనాటికీ తాజాగా, relevantగా ఉన్న విషయం అందరి ముందూ ఉంచారు. వారి రచనల్లో నిజం ఎంతో శక్తివంతమైన ఖనిజం. “కానీ అలాంటివాళ్ళు తెలుగువాళ్ళవడం వల్ల, వాళ్ళ ఆధునిక గ్రంథమాల అర్ధాంతరంగా పోయింది” అంటూనే మీరు మంచి రచనల్నీ, రచయితల్నీ “వెన్నెల” లోకి తీసుకొచ్చే యథాప్రయత్నం చేశారు. డిటెక్టివ్‌లు- యుగంధర్, వాలి, గిరీల–నవలలు చదివి పెరిగిన మేము, వారి ప్రసంగం రాగానే ఆనందంతో పులకించి పోతున్నాం. జీవితం అర్థరహితంగా ఉందని అన్నారు కానీ, జీవితమంటే అవగాహన ఉన్నవారికే అది ఎంత అర్థరహితమో తెలుస్తుందని ఎవరో అన్నట్టు గుర్తు. ఎంతైనా… రవి గాంచనిచో కవి గాంచునే కదా…
కంబైన్డ్ స్టడీ గురించి Buddala Venkatesh గారి అభిప్రాయం:
05/03/2024 4:48 am
Really recalling those days. thanks Anwar Bhai.
గడినుడి – 91 గురించి Murty గారి అభిప్రాయం:
05/03/2024 2:47 am
మీ గడి నుడి క్లూలు కొన్ని అసమంజసంగా, వింతగా, అర్థరహితంగా, ఊహించలేని విధంగా ఉంటున్నాయి. అవి కూర్పరికి, కొద్దిమంది రెగ్యులర్ ఆల్ కరెక్ట్ పాఠకులకు తప్ప మరెవరికీ అర్థం కావు. వాటికి ఒక లాజిక్ లేదు. కొద్దిగా దిద్దుబాటు చర్యలు తీసుకోండి.
కంబైన్డ్ స్టడీ గురించి అయ్యగారి భుజంగరావు గారి అభిప్రాయం:
05/03/2024 1:53 am
బంగారు బాల్య స్మ్రుతులను గురుతు చేసిన మీ రచనకి… దానికి మీరు వేసిన illustrationకి వేల వేల సలాములు అన్వర్‌జీ.
నా పేరు, నా గుర్తింపు! గురించి Mlsb గారి అభిప్రాయం:
05/03/2024 1:47 am
😆 interesting !!
రుబాయీలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
05/02/2024 7:51 pm
శర్మ దంతుర్తిగారికి నమస్సులు! ఇక్కడ నేను మీరు అడిగిన రెండవభాగపు ప్రశ్నలకు మాత్రమే సమాధానమును ఇస్తున్నాను.
(1) రుబాయీ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన ఛందస్సు గలదు. దానిని వ్యాసములో వివరించినాను.
(2) పారసీక ఉర్దూ భాషలలో గణములకు తగినట్లు పదములు, అంత్యప్రాస మాత్రమే ముఖ్యము. తెలుగులో నేను అదనముగా ద్వితీయాక్షర ప్రాస, అక్షరసామ్య యతిని కూడ వీలైనప్పుడు వాడినాను.
(3) In principle మీరు ఏయుగమునైనను వాడవచ్చును. కాని ఛందస్సు రీత్యా అక్కడ UUUU లేక UUIIU లకు సరిపోయే పదములను మాత్రమే వాడాలి. త్రేతాయుగమే అను పదము UUIIU నకు సరిపోతుంది. రేఫముతో అక్షరసామ్య యతి. నాలుగవ పాదమునకు కూడ ఇక్కడ చెప్పినది వర్తిస్తుంది.
విధేయుడు – మోహన
నా పేరు, నా గుర్తింపు! గురించి Seshu C గారి అభిప్రాయం:
05/02/2024 10:36 am