Comment navigation


15818

« 1 ... 64 65 66 67 68 ... 1582 »

  1. చావు బ్రతుకులు గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    05/26/2024 4:57 pm

    “కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది…” కె.కె. రామయ్య

    A literary platitude.
    *
    రబీంద్రనాథ్ టాగోర్ చిన్నకథల్లో – తెరచాపల పడవల్లో నదిలో పైకీ కిందకూ తిరుగుతూ, నది గట్టమ్మటే కాలే శవాలు చూస్తూ, శాలువా, పైజమా లాల్చీ, పాదరక్షల, ఏమీ త్రాణలేని దివాళా మగవాళ్ళు కనిపిస్తుంటారు. కథానాయకుడు కలకత్తాలో కాలేజికి వెళ్ళేముందు చూసిన పక్కింటి నబవధు, మళ్ళీ అతను సెలవల్లో పల్లెలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, బిధవా వేషంలో వచ్చి వంగి, వినయంగా అతని పాదధూళి తీసుకుంటుంది. మగవాళ్ళు వంటింట్లోకి వచ్చి కూర్చుని విసినకర్రతో విసిరించుకుంటూ, ఆడవాళ్ళు వండి వడ్డించే చేపలపులుసులు వాళ్ళకేదో ఫేవర్ చేస్తున్నట్టు, నిరాసక్తంగా తిని పోతుంటారు. బినయ్ దా, బిపిన్ దా, కమలాదీదీ, కుసుమ్‌బహెన్, పిలుపులతో కథలు గడిచిపోతుంటయ్యి. ఎటు చూడూ పడవ మునకలు, మరణాలు, రచనల్లో అజ్ఞానం, మూఢనమ్మకాలు, Dogma, ఆచారాలు మాత్రమే కనిపిస్తాయి. ఉత్తి డెస్క్రిప్టివ్ డాక్యుమెంటేషన్. Pervasive passive acceptance. Complacency. Status Quo. కథల్లో, జీవితంలో, మనుషులు ఎలా చస్తేనేం, రచయితకు అక్కడికే నోబెల్ రానేవచ్చె.

    (టాగోర్ బెంగాలీ వచ్చినంత బాగా, ఇంగ్లిష్ కూడా వచ్చినవాడు కనక తన ప్రోజ్, పొయట్రీలను తనే ఇంగ్లీషులో అనువదించుకుని, విదేశీయుల దృష్టి లోకి తన సాహిత్యం ఒక ఇంగ్లండ్ ట్రిప్‌లో తనే తెచ్చాడు. అతడు కలిసిన లిటరాటీ అతని సాహిత్యంతో అతి స్వల్ప పరిచయం లోనే అత్యంత వేగంతో ప్రకంపించి, ఒక సంవత్సర కాలంలోనే, ఒక్క విడతలోనే అతడికి నోబెల్ ఇప్పించారు. ఇది ఆ లిటరరీ ప్రైజ్ చరిత్రలోనే ఒక అనూహ్యమైన ఘటన.)

    టాగోర్ ఈ కథ లోనూ అంతటా, అందరికీ భూతాలు, దయ్యాల మూఢనమ్మకం వ్యాపించి ఉంది. ఆడవాళ్ళు హిస్టెరికల్ హీప్స్, మగవాళ్ళు నిర్వీర్యులు. విశ్వకవి రవీంద్రుడు తన ప్రసిద్థి వహించిన Patriotic prayer పద్యంలో లాగానే, తన చిన్నకథల్లోనూ – దేశంలో మూఢత్వం వదిలించి, జ్ఞానం ప్రసాదించే భారం భగవంతుడి పైనే వదిలివేసినాడా? జనగణమంగళదాయక జయహే, భారత భాగ్యవిధాతా… తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష్ మాంగే, గాహే తవ జయ గాథా! ఇవేనా ఆ గాథలు!

    స్ధూలంగా (current popular word in the magazine), టాగోర్ కథానాయికలకూ, గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మకీ ఏం తేడా ఉండదు. స్త్రీలు తరచూ నుయ్యో, గొయ్యో చూసుకుని, కాళిలోనో దుర్గలోనో చేరిపోతారు. రచనలలో ఆనాటి వాస్తవత ఉండొచ్చు గాక! ఈ ఆత్మహత్యల కథలు, పద్యాలు మూలంగా – చదివినవారు అంతకన్నా వేరుదారిలేదన్న నిస్పృహకు లోనవటం, జీవితంలో ఆసక్తి కోల్పోవటం కూడా జరగొచ్చు. జర్మన్ కవి Goethe -The sorrows of young Werther, రాసిన తర్వాత చాలామంది యువకులు నిజంగానే ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతీతి.

    పల్నాటియుద్థం సినిమాలో, చితి లోకి దూకకముందు రోదించే ఒక నాయికకి, జాషువా కవి -ఆయన తెలుగు బిరుదు ఏమిటీ?- అందించిన పద్యం “…నల్లపూసల సౌరు నాశమయ్యె, గంగలో కలిసె నా గాజుమట్టెల శోభ,..” Something like that, ఆ పద్యం విని, కన్నీరు విడవని తెలుగు వీరులెవ్వరు? ఆ పైన ఉద్రేకించి, యుద్ధం ఎవరెవరి మధ్యనో ఎందుకు జరుగుతోందో కూడా తెలియని బాలవీరులు కొందరు బలి.

    తనను కడజాతి వాడన్నందుకు, ఎంతో ఆర్తితో కవిత్వం చెప్పిన జాషువాకు, సినిమాకి రాస్తున్నప్పుడు, ఈ పద్యంలో తను ఎంత క్రూరకార్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడోనన్న స్పృహ లేదు. (ఈ కథ మొదట్లోనే “పసుపు కుంకుమలు పోగొట్టుకున్న కాదంబిని” అంటూ టాగోర్ పొయట్రీ, కథల, ఇంగ్లీషు అనువాదకుడు William Radiceకి రాని, తెలుగు పలుకుబడి కనిపిస్తే, ఆ పాత సినిమా సన్నివేశం గుర్తొచ్చింది.)

    ఈ మాగజీన్లోనే ఈమధ్య ఇచ్చిన మరో అనువాద కథ ‘పోస్టు మాస్టరు’లోనూ రచయిత టాగోర్ attitude నాకు నచ్చలేదు. There is a hidden tease and tormentor in Tagore. He plays with women and small girls’ hearts. He drowns his heroines like rats. What kind of nonsense is that?

    అదే, ఈ టాగోర్ భూతాల కథ సమయం నుండే, అదే – ఆ 19 శతాబ్దినుండే; ఒక ఫ్రెంచ్ రైటర్ Jules Verne కల్పించిన Philias Fogg ని చూడండీ, హీరో అంటే అతనూ హీరో. ఫిలియాస్ తన “around the world in 80 days” యాత్రలో, ఇండియాలోనే – ఆ బెంగాల్ ప్రాంతాలలోనే, అప్పటి దారుణమైన “సతి” కార్యక్రమంలో, Aoudaకి మత్తుమందిచ్చి, ఆమె చేతులు కాళ్ళు కట్టేసి, చచ్చిన మొగుడితోపాటు పాడెక్కట్టేసి, సంబరంగా ఊరోళ్ళంతా డప్పులు కొట్టుకుంటూ శ్మశానానికి తీసుకుపోయి, నిప్పెట్టపోతుంటే, Passepartout సహాయంతో, ఉపాయంతో ఆమెను విడిపించాడు. బ్రతికి ఉన్న స్త్రీని తగలెట్టటానికి ఇంతకూడా సంకోచించని ఊరిజనం, భూతాలంటే హడలు కాబట్టి, పాడెమీది మగవాడి శవం లేచికూర్చుంటే అప్పుడు పారిపోయారు. ఆమెను తర్వాత ఫిలియాస్ తనతో లండన్ తీసుకుపోయాడు. వేజర్ గెలిచాడు.

    అదీ కథంటే. అతడూ మగవాడంటే. ట్రావెలర్ అంటే. హీరో అంటే. నిజానికి, Fogg, Passepartout, Aouda, అందరూ హీరోయిక్ స్పిరిట్ ఉన్నవారే. కార్యశూరులే. వారి సంభాషణలు, పనులు ఆ విషయం మనకు స్పష్టం చేస్తాయి.

    Así es como se cuentan algunas historias.

    -Lyla

  2. నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/26/2024 1:26 am

    దీనికి రస్సెల్ విస్తృత రచనలలో మూలమేదో చెప్పాల్సింది.

    [మూలవ్యాసపు వివరాలు చేర్చాము. కృతజ్ఞతలు – సం.]

  3. వాళ్ళు… గురించి వారణాసి నాగలక్ష్మి గారి అభిప్రాయం:

    05/23/2024 11:55 am

    అమరేంద్ర గారూ, పూలల్లే దారం లాగా కొందరు మనుషులని కలుపుకుంటూ పోతారు. ఇలాంటి వ్యక్తులవల్లే స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. మీ కదంబం బాగుంది. 💐

  4. గడినుడి – 91 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    05/22/2024 3:53 am

    ఈ మధ్య సంపాదకులకు గడినుడి నిర్వహణపై శీతకన్ను వేసినట్టుగా అనిపిస్తోంది. తప్పులెంచాలనే ఉద్దేశంతో కాదు గానీ, గడినుడి స్థాయి పెరగాలని ఆశిస్తున్నా. ఒక నిర్వాహకుడు కూర్చిన దానిని, రెండు నెలల ముందే ఇతర నిర్వాహకులకు (సమాధానాలు లేకుండా) పంపించి వారి అభిప్రాయలను సేకరించి సరైన నిర్ణయం తీసుకోవడం, మూడు లేదా నాలుగు గడినుడులను ఎప్పుడూ దగ్గర నిలవ ఉంచుకోవడము లాంటి చర్యలు ఉపయోగపడతాయి.

  5. దక్షిణ అమెరికా దృశ్యమాలిక-3 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    05/22/2024 3:26 am

    ధన్యవాదాలు రమేష్ గారూ

  6. గడినుడి – 91 గురించి మంజరి లక్ష్మి గారి అభిప్రాయం:

    05/21/2024 4:20 am

    ఇన్ని నల్ల గళ్ళు (ఖాళీ గళ్ళు) ఉంచటం ఏమీ బాగా లేదు. పదానికి కనెక్షనుగా ఇంకో పదం ఉండేటట్లు ఇవ్వకపోతే ఎట్లాగా? మీ మనసులో ఉన్నది మేం ఊహించాలా? అలాగే సమాధానాలు ఇచ్చినప్పుడు అవి మీరిచ్చిన క్లూలతో ఎలా సరిపొయిందో వివరణ కూడా ఇస్తే బాగుంటుంది. మా బోటి పామరులకు కూడా మీరిచ్చె పధ్ధతిని అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది.

  7. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి వెల్లాల హరి హర ప్రసాద్ గారి అభిప్రాయం:

    05/18/2024 2:24 pm

    తెలుగు మేష్టారు క్లాస్ లో వున్న అనుభూతి కలిగింది. ధన్యవాదాలు. 🙏

  8. తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి తఃతః గారి అభిప్రాయం:

    05/17/2024 4:19 am

    “అయితే ఆ రెండు సమీక్షలలో పేర్కొన్న కొన్ని అతిశయోక్తులను సవరించక/సరిచేయక పోతే భాషాశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచనలను మౌనంగా సమర్థించినట్లవుతుంది అనిపించింది”

    ఉషాదేవిగారికి: నమస్కారాలమ్మా.

    మీరు ఎంతో సహనంతో రాసిన ఈ నిశితమైన పరిశీలనా వ్యాసం చదివి ఆనందించాను. వెల్చేరు వారికి ‘బాస్వెల్’లుగా కొందరు చప్పట్ల చాటింపులు చేయడం నేనెరుగుదును. వారి పాండిత్యాన్ని ఎవరూ చిన్న బుచ్చలేరుగానీ వారి ధోరణి అప్పడప్పుడు నాకు వారు పాత తెలుగు పుస్తకాలకు కొత్త ఇంగ్లిష్ అట్టలు వేసిన వారిగా అనిపింపజేస్తుంది. మీ వ్యాసం మొదటి వాక్యంలో స్పష్టత కరువైనదిగా తోస్తూంది.

    తః తః

  9. కంబైన్డ్ స్టడీ గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:

    05/15/2024 11:47 pm

    అన్వర్! ఈ గతాలు ఆయా తరాల వాళ్ళకు అటూ ఇటూగా ఒకలానే ఉన్నట్టనిపిస్తాయి. ఎవరి సంగతులు వాళ్ళకే ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం మాత్రం ‘బాల్యం’. ఈ బాల్యాన్ని బతిమాలో బామాలో సాగదీసి పొడిగించకుంటే ఎంత బావుణ్ణు. ఏంటో తొందర, ఎవడిమట్టుక్కి వాడికి? రేజర్ వాడేయాలనీ, మీసాలు తిప్పాలనీ, జులపాలు పెంచాలనీ, పొడుగు లాగుల్లో వీదులెక్కయ్యాలనీ… ఎదగడానికెందుకురా తొందరా? అంటే ఇంటామా?

    అయినా మీరు పాదాలు ముందుకే పెట్టి, పదాలతో వెనక్కి తోలేరు చూడండి. అబ్బ! తెలుపూ ఎరుపూకి తిరిగిన చీమచింత కాయలోని వగరూ, తీపీ. చాలనివ్వకండి. సాగించండి. అరవైలు దాటినా బాల్యంలో బతకొచ్చని చాటింపు వేస్తూనే ఉండండి.

    రాజా

  10. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి Srinath Vadapalli గారి అభిప్రాయం:

    05/11/2024 11:40 pm

    ఈ శ్యామ్ గారి మాటలు సభలో విని ఉండాల్సింది. ఆ అదృష్టం లేకపోవడం వల్ల ఆ మాటల్ని  చదువుతూ వినాల్సి రావడం, అందులోనూ , ఆ పని ఒక్క తూరులో  జరగకపోవడం. ఇలాంటి కారణాలతో ఆ ప్రసంగాన్ని ఒక సీరియల్ మాదిరి విన్నాను.  చదివాను అనడం కన్నా విన్నాను అనడమే సబబుగా అనిపిస్తోంది. శ్రీ శ్యామ్ మాటలు సాంతం వారి జ్ఞాపక శక్తికీ, వారి విషయం సేకరణకీ ఒక ఉదాహరణ.  అంతమంది రచయితల్నీ రచనల్నీ ఒక్క ఊపులో సోదాహరణలతో వివరిస్తూ మాటాడ్డం ఇప్పుడున్న రచయితల్లో, వక్తల్లో బహుశా ఆయనొక్కరికే సాధ్యం. 

    ఇంకా, వారి మాటలన్నిటిని అక్షరాల్లో అందించిన వారికి ధన్యవాదాలు.

« 1 ... 64 65 66 67 68 ... 1582 »