Comment navigation


15798

« 1 ... 24 25 26 27 28 ... 1580 »

  1. నో ఎగ్జిట్ .1 గురించి Kondalarao Palaka గారి అభిప్రాయం:

    11/27/2024 11:23 am

    కథ నచ్చింది.

    ఇంత చిన్న కథలోనే “కథ ఇంకెవరూ చదివుండరు” అన్న జోక్‌కూడా ఇరికించడం నచ్చింది.

    పేరుపై వివరణ (రామారావు గారిది) నచ్చింది. కానీ కథ originality మీద అభిప్రాయం ఒక పాలు తగ్గిందనిపించింది.

  2. ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:

    11/26/2024 4:49 am

    2018 డిసెంబర్ నెలలో మేం, భూటాన్ పర్యటన కోసం వెళ్లాం నా శ్రీమతి అరుంధతి, మా కుమారుడు ఆదిత్య ప్రతాప. సదరన్ ట్రావెల్స్ వారి ప్యాకేజీలో! భూటాన్ పర్యటన ఇచ్చిన ఉత్సాహంతో నేపాల్ టిబెట్ వెళ్ళాలని అనుకున్నాం కానీ కోవిడ్ పుణ్యమా అని, అది సాధ్య పడలేదు! మీ పర్యటన వివరాల వెంట నడుస్తూ నడుస్తూ ఉంటే, అన్నీ వివరంగా కళ్ళకు కట్టినట్లు కనిపించాయి! ధన్యవాదాలు!

    ప్రతాప చంద్రశేఖర్
    9948856377

  3. చెప్పులు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/26/2024 1:54 am

    చెప్పులు స్వయంగా ఎందుకు కుట్టుకోకూడదు అంటారు లైలా గారు. పైగా చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా అంటారు.

    జాకెట్లు కుట్టడం కుట్టు సెంటర్లు నేర్పేవండీ అమ్మాయిలకు. చొక్కాలు కుట్టటం మాత్రం ఎవ్వరూ అబ్బాయిలకు నేర్పించేవారు కాదు. సూదీ దారం తోలూ వంటివి సంపాదించి చెప్పులు స్వయంగా కుట్టుకోవటం కుదిరేపని కాదండీ. అవి సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఆటూల్స్ సులువుగా దొరకవు దొరికినా ఎంచుకోవటం తెలియాలి గా? నైపుణ్యం లేకుండా ప్రయత్నం చేస్తే ఆ డబ్బు దండుగ అవుతుంది. నేర్చుకుందుకు ఏ ఐటీఐ లోనో చేరి కోర్సు చేయాలి. ఊరికే ఎద్దేవా చేసేముందు ఆలోచించే పనిలేదా?

    ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి అంటారు లైలా గారు.

    ఒక పాత్రను ఫోకస్ లోనికి తేవటం అంటే ఆపాత్ర పాఠకుడికి కథను చదివిన తరువాత కూడా గుర్తు ఉండేలా చేయటం అని అర్థం. అంతే కాని సాధ్యమైనంత ఎక్కువ నిడివిని పాత్ర కోసం కథలో కేటాయించటం కాదు.

    ఈ కథలోని అక్క గారి పాత్ర పాఠకుల మందిని నిలచే పాత్రగా ఉంది. ఇంకేం కావాలి?

    ఇక కవిత గారికి హిపోక్రసీ కనిపించింది. కథచెప్పిన రచయిత నిజాయితీ కనిపించింది కాదు. విడ్డూరంగా అనిపించింది.

    నాకూ పన్నెండవ తరగతిలో కూడా చెప్పులు లేవు కాలేజీలోనికి వచ్చే దాకా పేంట్లూ లేవు. నాస్కూలు చదువంతా సెకండ్ హేండ్ పుస్తకాల తోనే గడిచింది. కాలేజీ చదువు లోనూ లైబ్రరీ పుస్తకాలు దొరక నప్పుడే మొహమాట పడుతూ నాన్నగారిని పుస్తకాల కోసం డబ్బులు అడిగే వాడిని. ఎప్పుడూ బ్రౌన్ పేపర్లతో నోటు పుస్తకాలు కుట్టుకునే వాడిని. ఈకథ చదువుతుంటే ఆరోజు లన్నీ మదిలో మెదిలాయి. ఇదంతా నా హిపోక్రసీ అంటే చేయగలిగింది లేదు.

    ఆ టీనేజీ కథకుడి లాగే నేనూ పెద్దయ్యాక కుటుంబానికి అది చేయాలీ ఇది చేయాలీ అని కలలు కనే వాడిని. భగవదనుగ్రహం వలన అవి చాలావరకూ నెరవేరాయి.

    అన్నట్లు ఒక మాట. కాలేజీకి వెళ్తున్న పిల్లాడి నని ఒకసారి మా అమ్మగారు నాకు తను దాచుకున్న డబ్బులిచ్చి కాస్త మంచి చెప్పులు కొనుక్కో మన్నారు.

    ఈకథ అరవైల నాటి వాస్తవిక జీవితాలను ఆవిష్కరించింది.

    రచయితకు అభినందనలు.

  4. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Srinivasarao Chaavli గారి అభిప్రాయం:

    11/25/2024 11:00 pm

    రచయిత తన వ్యాసాలలో భారతీయ గ్రంధాలనుంచి ఉదహరిస్తారు. కానీ, సైన్స్ వ్యాసాలమధ్యలో వాటిని ప్రస్తావించడం సందర్భోచితంగా అనిపించదు. మత/ఆధ్యాత్మిక గ్రంధాలు కొన్ని ఆలోచనలను ప్రస్తావిస్తాయి. అవి (సామాన్యంగా)ఆలోచనలు/ఊహలే కాని వాస్తవాలు లేదా ప్రయోగాలపై ఆధారపడిన నిజాలు కావు. ఇది ఆయా రచయితల ఊహలను కించపరచడం కాదు. కానీ, వాటికి కాన్సెప్ట్‌లను ఆపాదించడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు, “నేను టీ కోసం చంద్రునికి వెళ్ళి ఒక గంటలో తిరిగి రావచ్చు” అని ఒక వ్యాసం వ్రాయగలను. భవిష్యత్తులో, ఇది నిజం కావచ్చు. అటువంటి సందర్భంలో కూడా, ఇప్పటి నా ఆలోచన ఒక ఆలోచన/ఊహ మాత్రమే కాని నిరూపించగలిగిన వాస్తవం కాదు. నేను భవిష్య ద్రష్టను కాను.

    ఈ విషయం రచయితకు చదువరులకు ఇక్కడ అర్థం అవుతుంది. కాని వీటిని చదివి కొంతమంది “ఇవన్ని వేదాలలొ ఉన్నాయిష” అనుకొనే ప్రమాదం ఉంది. చాలమంది ఇటువంటి వేదాలలొ పేర్కొన్న/నిరూపించిన అంశాల గురించి ఉపన్యాసాలలో ఉటంకించడం చూడవచ్చు.

    ఈ వ్యాఖ్య వ్యాసం యొక్క విలువను తగ్గించడానికి కాదు. కాని ఇటువంటి వివరాలు footnoteలో ఇవ్వడం గురించి ఆలొచించవచ్చు.

  5. నో ఎగ్జిట్ .1 గురించి anamakaha గారి అభిప్రాయం:

    11/25/2024 10:22 pm

    ఈమాట నాయకత్వానికీ, తాడిగడప వారికీ వచ్చిన పొరపొచ్చాలు తొలగిపోయినట్లున్నాయి, దెబ్బతిన్న మనోభావాలన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకున్నట్లున్నాయి. ఇప్పుడు వారు పుంఖానుపుంఖాలుగా తమ అభిప్రాయాలు గుమ్మరిస్తున్నారు. వారి వ్యాఖ్య చూడగానే నాలో కలిగే విరక్తి ఎంత బలమైనది అంటే ఈ వ్యాఖ్య రాసేటంత. ఏమిటో, పొరపొచ్చాలున్నప్పుడే బాగుండేది. ఇప్పుడు వారికీ నాకూ పొరపొచ్చాలు వస్తున్నాయి!

    [ఈమాట ఒక పత్రిక. మనోభావాలు వ్యక్తులకు ఉంటాయి. వ్యవస్థలకు కాదు. పత్రిక నియమాలకు లోబడి వచ్చిన ఏ అభిప్రాయాన్నైనా ప్రచురిస్తాము. – సం]

  6. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి Amarendra గారి అభిప్రాయం:

    11/25/2024 7:31 pm

    థాంక్స్ లైలా గారూ!

    మీరు చెప్పిన పుస్తకం తెప్పించుకుంటాను

    థాంక్స్ ఎగైన్!

  7. నో ఎగ్జిట్ .1 గురించి రామారావు కన్నెగంటి గారి అభిప్రాయం:

    11/24/2024 9:31 pm

    తెలుగు కథలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టటంలో సామంజస్యం ఏమిటంటే — కథ పేరు చదువరులకు తెలిసిన సాహిత్య చరిత్ర లోంచి తేవటంతో, రచయిత ఒక అర్థం చూపించగలడు. ఈ కథ పేరు సార్థ్ర్ రాసిన “నో ఎగ్జిట్” అనే నాటకం పేరుతో రాసింది. అందులో ముగ్గురు ఒక గదిలో ఉండి ఒకరికొకరు నరకం చూపించుకుంటూ ఉంటారు. “Hell is other people” అనే వాక్యం ఈ నాటకం నుంచే.

    అలాగనే సంస్కృత పదాల పేర్లతో కూడా కొందరు పేర్లు పెడుతుంటారు. ఆ ప్రాచీన గాథలతో సంబంధం గుర్తు చెయ్యడం కోసం. సంస్కృతం లేదా ఆ ప్రాచీన కథలు తెలియని వారికి అది బడాయి గానూ, లేదా అసమంజసంగానూ అనిపించవచ్చు.

    ఇంత బిజీగా ఉన్న రోజుల్లో, ఎటువంటి బాహ్యచిహ్నాలు చూసుకొని ఏవి చదువుకోవాలి అనేది రకరకాలుగా చూసుకుంటారు. అందుకే, “పుస్తకం కాదు బాగుండాల్సింది, అట్ట” అని కొడవటిగంటి ఏనాడో అన్నాడు!

  8. మా బోసన్న ప్రేమ కత గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 10:37 am

    మంచి హాస్యంతో చక్కగా నవ్వించారు.

  9. చెప్పులు గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 8:48 am

    కథ బాగా వుంది, ఎందుకు ఇంత తీవ్రమైన పరుషమైన విమర్శలు. ఇట్లాంటి కష్టాలు ఎందరి జీవితాల్లోనో వున్నయి.

  10. వీరాభిమాని గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 8:32 am

    మీ నుంచి ఇలాంటి కథ ఊహించ లేదు. very bad story.

« 1 ... 24 25 26 27 28 ... 1580 »