మరో గురుదక్షిణ గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 10:46 am
ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉంటాను ఒక మాటను. కల్పన అనేది కవి హక్కు కాని అది మూలఛ్ఛేదిగా ఉండకూడదు అని. కల్పనపేరిట కథాసంవిధానాన్ని కాని పాత్రలస్వరూపస్వభావాలను కాని వికారం చేయకూడదు అని.
ఏకలవ్యుడు అనేది అతని పేరు కాదు. లవము అంటే బొటనవ్రేలు. ఒకే బొటనవ్రేలు కలవాడు అయ్యాడు కాబట్టి అతనికి ఏకలవ్యుడని పేరు వచ్చింది.
అతడు ఒక వేటకుక్క ముఖంలో సూటిగా ఏడుబాణాలు ప్రయోగించినప్పుడే అతడి క్రూరత్వం బయటపడింది ప్రపంచానికి. ద్రోణుడు ఆలోచించినది ఒక క్రూరుడు పట్టుదలతో చేసిన సాధన పర్యవసానం ప్రపంచానికి మంచిది కాదనే. అందుకే వాడి బొటనవ్రేలిని దక్షిణగా అడిగటం జరిగింది. దరిమిలా వాడు అలాగునే మరింతసాధన చేసి చివరకు తనను మించిన క్రూరుడైన జరాసంధుడి సేనాని అయ్యాడు. కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. (బొటనవ్రేలిని ద్రోణుడికి దక్షిణ ఇవ్వకుండా ఆ హిరణ్యధన్వుడి కొడుకు ఏకలవ్యుడు ఎలా అయ్యాడో!)
ఏకలవ్యుడి కథను వక్రీకరించారు. ధృష్టద్యుమ్నుడి కథను వక్రీకరించారు. ద్రోణుడి కథను వక్రీకరించారు. ఏమి సాధించాలని? ఈ చెత్తకల్పనకు కృష్ణుడిని సాయం చేసుకున్నారు! అసలు ఈకల్పనావ్యవహారం కోసం భారతకథను దారుణంగా వక్రీకరించారు
అన్నట్లు కర్ణుడిని దాత అని పొగిడినట్లున్నారు? భారతంలో అసలు అలా ఎక్కడన్నా మహాదాత కర్ణ అని ఉందా? ఏమి వెఱ్ఱి!
మూలవిరోధంగా ఇదంతా చేయటం ఒక అందమైన కల్పన అని భారతకథ సరిగా తెలియని వారు అనుకోవచ్చునేమో కాని నాకైతే వికారమైన కల్పనగానే అనిపించింది.
భారతకథ సరిగా తెలియని యువతను మరింత గందరగోళానికి గురిచేయటం తప్ప ఈకథకు మరొక పరమార్ధం ఏమీ కనిపించటం లేదు.
ఇలా మూలఛ్ఛేదకథాప్రచురణలు చేయకుండా ఈనాడు పత్రికవారిని మంచి సంయమనం పాటించవలసిందిగా చేతులుజోడించి అభ్యర్ధిస్తున్నాను.
ఒంటరి మరణం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 10:05 am
“అయితే పదకొండవ రోజు – పనిదినం అయింది. దాసుగారి కోసం, ఎవరికీ సెలవు పెట్టేందుకు లేదు. అందుకని ఈ కార్యక్రమాన్ని 15వ రోజు, ఆదివారానికి మార్చారు. అనుకున్న రోజున కార్యక్రమం నిర్వహించారు.”
Prayer is reserved for Sunday అని ఇంగ్లీషులో ఒక సామెత ఉందనుకుంటాను. సరిపోతుంది.
నో ఎగ్జిట్ .1 గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 9:57 am
తెలుగుకథలకు ఇంగ్లీషులో పేర్లు పెట్టటంలో ఉన్న గొప్ప సామంజస్యం ఏమిటో అది నాకెప్పటికీ అర్ధం కాదు. ఇంగ్లీషుపేరు పెట్టుకున్న కథ ముఖం చూడగానే నాలో కలిగే విరక్తి ఎంతబలమైనదీ అంటే ఆపేరు పెట్టుకున్న కథను చదవనే చదవను.
దీనిని నాకు తెలుగుమీద ఉన్న దురభిమానం అనే బలహీనత అని అంటారో లేదా వైద్యపరిభాషలో ఉన్న సవాలక్ష ఫోబియాలలో దీనిని కూడా ఏదైనా పేరుతో చెబుతారో తెలియదు.
(ఈమాటకు అభిప్రాయాలూ విమర్శలూ పంపే వారు కూడా తెలుగుసాహిత్యం గురించి మాట్లాడుతున్నవారే కాబట్టి వారు కూడా సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని కూడా నాఅభిప్రాయం.)
కథ మొదలు పెడుతూనే రూంలో అని ఇంగిలిపీసు ముక్కను ప్రధమకబళే మక్షికాపాతః అన్నట్లు వేయకుండా గదిలో అని కాస్త కరుణించవచ్చును కదా! చాదస్తంగా ఇంగ్లీషుముక్క లన్నీ తెలుగుచేయమని అనను కాని కాస్త వీలైనంత తెలుగు వాడవచ్చును కదా అని వాపోతున్నాను.
అదిసరే, ఈకథ బాగుంది. బహుకాలం క్రిందట చదివిన సాంబారు జన్మవృత్తాంతాన్ని వివరించే కథలాగా ఉందనిపించింది ఎందుకో (ఆకథకు రచయిత పెట్టిన పేరు గుర్తులేదు. మన్నించాలి)
ఆకథను టూకీగా చెప్తాను. కైలాసంలో శివకుటుంబంలో అమ్మవారు ఒకసారి చిరాకుపడి వంటావార్పూ అంతా నావంతే అంటే కుదరదూ – నాకూ భక్తులున్నారు బోలెడుమంది – వారిని చూచుకోవద్దా నేను? అందుకని ఇకనుండీ అందరూ వంతులవారీగా వంటపని చూడాలి అని నియమం చేసారట. అలా బండి నడుస్తూ ఉండగా ఒకనాడు సాంబశివులవారి వంతు వచ్చింది. ఆయనకు ఏం చేయాలో తోచక చివరకు గంగాళంలో నీళ్ళు ఉడకనిచ్చి కనిపించిన కూరానారా అంతా ముక్కలు చేసి దాంట్లో వేసి గుప్పెళ్ళతో ఉప్పూ కారం పులుపూ అంతా వేసి కూర్చున్నారు.
భోజనాలసమయంలో అందరూ ఆద్రవపదార్ధాన్ని దాంట్లో భీతావహంగా ములుగుతూ తేలుతూ ఉన్న రకరకాల రంగురంగుల ముక్కల్నీ చూసి ముందు జడుసుకున్నా రుచి మాత్రాం బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈవంటకం పేరేమిటండీ అని అమ్మవారు అడిగితే నాకు మాత్రం ఏమి తెలుసూ అని శివయ్య నవ్వాడట. సాంబశివులవారు కనిపెట్టిన వంటకం కాబట్టి అప్పటినుండీ దాన్ని సాంబారు అని పిలవాలని ఏకగ్రీవంగా నామకరణం చేసారని ఆకథ చెబుతున్నది. (ఇదీ నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకథ. ఏమిటో మీతో పంచుకోవాలని అనిపించి చెప్పాను. తప్పైతే మళ్ళా మన్నించేయండి.)
శివయ్య కాబట్టి ఎలాచేసినా అమృతంలాగా ఉండటానికి కుదురుతుంది కాని పాపం మనవాడు చేసింది బంగాళాదుంపల పప్పు కదా అలా ఎలా కుదురుతుందీ అని.
“వంట రెడీగా వుండడం చూసి నన్ను మెచ్చుకుని, తలలు తుడుచుకుంటూ పళ్ళేలు తెచ్చుకుని అందులో వుడికీ వుడకని అన్నాన్నీ, పొటేటో పప్పును వేసుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చూసిన చూపుంది చూశారూ నా కిప్పటికీ గుర్తే!”
బంగాళాదుంపల పప్పు చాలా బాగుంది, punch is very స్త్రొంగ్, కథ చక్కగా నవ్వించింది, నమస్కారం
విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష అవతారిక లో “ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కొనియాడబడిన తెలుగువారి ఆదికవి గారు మూలశ్లోకాలను ఏవిధంగా విస్తరించి తెనుగించారో పాఠకులను చిత్తగించవలసిందిగా కోరుతున్నాను. పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరిస్తూ దండుగ్గణాలు చేరిన నన్నయ్య చేసిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది అని ఎవరన్నా అనుకుంటే వారికొక నమస్కారం.
ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా’ అని ఎవరినో తిడుతూంది.
ఆమె లోని అమ్మతనం తను పెంచిన అమ్మాయిని తన సొంత కొడుకే పాడు చేస్తాడు అని అతన్ని తిట్టినప్పుడే తెలుస్తుంది. చాలా మంచి కథ, నమస్కారాలు.

సత్యం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 9:50 am
ఆలోచింపజేసేదే మంచికథ. ఆవిధంగా ఇదొక మంచికథ.
పెద్దన్నయ్య, ప్రపంచం గురించి S Chandra గారి అభిప్రాయం:
11/20/2024 6:41 pm
అయ్యా శర్మగారు, మహాద్భుతముగా కథను వ్రాశారు. భలే రచన.
ధన్యవాదములు
Chandra
వంటా వార్పు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/19/2024 6:42 am
తెలుగుసాహిత్యకారులు సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
(ఈమాటకు అభిప్రాయాలూ విమర్శలూ పంపే వారు కూడా తెలుగుసాహిత్యం గురించి మాట్లాడుతున్నవారే కాబట్టి వారు కూడా సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని కూడా నాఅభిప్రాయం.)
కథ మొదలు పెడుతూనే రూంలో అని ఇంగిలిపీసు ముక్కను ప్రధమకబళే మక్షికాపాతః అన్నట్లు వేయకుండా గదిలో అని కాస్త కరుణించవచ్చును కదా! చాదస్తంగా ఇంగ్లీషుముక్క లన్నీ తెలుగుచేయమని అనను కాని కాస్త వీలైనంత తెలుగు వాడవచ్చును కదా అని వాపోతున్నాను.
అదిసరే, ఈకథ బాగుంది. బహుకాలం క్రిందట చదివిన సాంబారు జన్మవృత్తాంతాన్ని వివరించే కథలాగా ఉందనిపించింది ఎందుకో (ఆకథకు రచయిత పెట్టిన పేరు గుర్తులేదు. మన్నించాలి)
ఆకథను టూకీగా చెప్తాను. కైలాసంలో శివకుటుంబంలో అమ్మవారు ఒకసారి చిరాకుపడి వంటావార్పూ అంతా నావంతే అంటే కుదరదూ – నాకూ భక్తులున్నారు బోలెడుమంది – వారిని చూచుకోవద్దా నేను? అందుకని ఇకనుండీ అందరూ వంతులవారీగా వంటపని చూడాలి అని నియమం చేసారట. అలా బండి నడుస్తూ ఉండగా ఒకనాడు సాంబశివులవారి వంతు వచ్చింది. ఆయనకు ఏం చేయాలో తోచక చివరకు గంగాళంలో నీళ్ళు ఉడకనిచ్చి కనిపించిన కూరానారా అంతా ముక్కలు చేసి దాంట్లో వేసి గుప్పెళ్ళతో ఉప్పూ కారం పులుపూ అంతా వేసి కూర్చున్నారు.
భోజనాలసమయంలో అందరూ ఆద్రవపదార్ధాన్ని దాంట్లో భీతావహంగా ములుగుతూ తేలుతూ ఉన్న రకరకాల రంగురంగుల ముక్కల్నీ చూసి ముందు జడుసుకున్నా రుచి మాత్రాం బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈవంటకం పేరేమిటండీ అని అమ్మవారు అడిగితే నాకు మాత్రం ఏమి తెలుసూ అని శివయ్య నవ్వాడట. సాంబశివులవారు కనిపెట్టిన వంటకం కాబట్టి అప్పటినుండీ దాన్ని సాంబారు అని పిలవాలని ఏకగ్రీవంగా నామకరణం చేసారని ఆకథ చెబుతున్నది. (ఇదీ నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకథ. ఏమిటో మీతో పంచుకోవాలని అనిపించి చెప్పాను. తప్పైతే మళ్ళా మన్నించేయండి.)
శివయ్య కాబట్టి ఎలాచేసినా అమృతంలాగా ఉండటానికి కుదురుతుంది కాని పాపం మనవాడు చేసింది బంగాళాదుంపల పప్పు కదా అలా ఎలా కుదురుతుందీ అని.
వంటా వార్పు గురించి Ramesh గారి అభిప్రాయం:
11/18/2024 10:23 am
“వంట రెడీగా వుండడం చూసి నన్ను మెచ్చుకుని, తలలు తుడుచుకుంటూ పళ్ళేలు తెచ్చుకుని అందులో వుడికీ వుడకని అన్నాన్నీ, పొటేటో పప్పును వేసుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చూసిన చూపుంది చూశారూ నా కిప్పటికీ గుర్తే!”
బంగాళాదుంపల పప్పు చాలా బాగుంది, punch is very స్త్రొంగ్, కథ చక్కగా నవ్వించింది, నమస్కారం
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/18/2024 9:17 am
మహాభారతం సభాపర్వంలోని రెండు మహా ప్రసిధ్ధమైన తెలుగు పద్యాలూ వాటికి మూలమైన వ్యాసులవారి శ్లోకాలూ ఇలా ఉన్నాయి.
మొదటిది.
అస్యపాపస్య దుర్బుధ్ధేర్భారతాపదస్య చ
స పిబేయం బలాద్ వక్షః భిత్వా చేద్ రుధిరం యుధి (సభా. 68-53)
అనువాదం.
మ. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్
రెండవది.
పితృభిః సహ సాలోక్యం మా స్మ గఛ్ఛేద్ వృకోదరః
యద్యే తమూరుం గదయా న భిద్యాం తే మహాహవే (సభా. 71-14)
అనువాదం.
ఉ. ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యఈ ద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్
విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష అవతారిక లో “ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కొనియాడబడిన తెలుగువారి ఆదికవి గారు మూలశ్లోకాలను ఏవిధంగా విస్తరించి తెనుగించారో పాఠకులను చిత్తగించవలసిందిగా కోరుతున్నాను. పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరిస్తూ దండుగ్గణాలు చేరిన నన్నయ్య చేసిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది అని ఎవరన్నా అనుకుంటే వారికొక నమస్కారం.
నౌకరీ గురించి Ramesh గారి అభిప్రాయం:
11/18/2024 6:20 am
ఎందుకో abrupt ending అనిపించింది,
ఆవిడ గురించి Ramesh గారి అభిప్రాయం:
11/18/2024 5:34 am