Comment navigation


15802

« 1 ... 1547 1548 1549 1550 1551 ... 1581 »

  1. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sai Brahamanandam Gorti గారి అభిప్రాయం:

    11/02/2006 11:17 am

    వేలూరి గారు,

    మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.

    ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!

    రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!

    ఇటువంటి కథలు మా కోనసీమ లో చాలా ఉన్నాయి.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  2. ప్రతీకగా శరీరం గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/02/2006 4:41 am

    చక్కని వ్యాసం. మీరు అనువదించిన కవిత అద్భుతంగా ఉంది.

  3. ఈ-మెయిలు గురించి K.Reddeppa గారి అభిప్రాయం:

    11/02/2006 3:12 am

    చానా బాగుంది. చాలా సంతోషంగా వుంది తెలుగులో మంచి సైటును ఏర్పాటు చేసినందుకు.

    ధన్యవాదాలతో
    కె.రెడ్డెప్ప
    రామసముద్రము
    చిత్తూరు జిల్లా
    ఆంద్రప్రదేశ్

  4. బస్సెడు దూరం గురించి radhika గారి అభిప్రాయం:

    11/01/2006 2:19 pm

    ఈ ఆర్టికల్ చాలా బాగుంది.

  5. ఉద్యోగం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 2:09 pm

    చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 1:44 pm

    బహు చక్కగా ప్రస్తుత రగడకు పూర్వపు ఇతిహాసానికి లంకె కట్టారు. భలే నవ్వు వచ్చింది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  7. ఈ-మెయిలు గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 1:34 pm

    ఈమెయిలు అని చూడగానే ఈమెయిలు సాంప్రదాయిక వుత్తరాలను ఎలా నాశనం చేసిందో చెప్తున్నారేమొ ననుకున్నా!
    చాలా బాగుంది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. అన్నీ చెప్పగల భాష గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 1:30 pm

    ఇంత బాగా చెప్పగలిగారు ఇక మీ భాషకేమయిందండి? 🙂
    “వేసుకుందామంటే ఏచొక్కా
    నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
    పెంకితనమే నా భాష కొచ్చింది.”
    ఇప్పటి వచ్చీరాని భాష గురించి చక్కగా చెప్పారిందులో.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  9. అక్టోబరు పులి గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 1:28 pm

    చాలా బాగుంది.
    చూసే వారి దృష్టి, ఆడేవాడి దృష్టి రెండూ బాగా మలిచారు.
    –ప్రసాద్

  10. ఛందోధర్మము గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/01/2006 12:52 pm

    కృష్ణదేశికాచార్యులు గారూ,
    మీలాంటి పెద్దలకు చెప్పేంతవాన్ని కాదు. అలాగే మీరు చెప్పిన వుదాహరణలతో విభేదించాల్సిన పనీ లేదు. చందోబద్దమైన పద్యానికి, లయ బద్దమైన గేయానికి, భావ బద్దమైన వచన కవిత్వానికి దేనికున్న విలువ దానికుంది. అలాగే చంధస్సు అన్నది స్వయంభువు అన్నదానితో మీ వుదాహరణలతో నేనేకిభవిస్తాను. ఒక మంచి లయబద్దమైన పాట వింటున్నపుడు కాలు లయబద్దంగా ఎలా కదులుతుందో అలాగే మనసును రంజింపజేసిన భావము కవి నోటిలో చంధోబద్దంగా పద్యాన్ని పలికిస్తుందని మీ వ్యాసమంతా చదివాక తెలుసుకున్నాను.
    అయితే చంధస్సు, యతి ప్రాసల నియమాలు కవితాకల్పనకు దోహదం చేసే నియమాలనడంతో విభేదించాల్సివస్తోంది. మీరే అన్నట్లు లయ ప్రాధాన్యంగా వుండాలంటే చందస్సు అవసరమే. అయితే భావమే ప్రధానమంటే చందస్సు కాక బావాన్ని కఠినంగా వ్యక్తపరిచే పదాలనే ఎన్నుకోవాలి కదా! చంధస్సుకు సరిపడలేదనే కారణంచేత సరైన భావాన్ని పలికించే పదాన్ని వదిలివేయడం ఎంతవరకు సబబు? మీరే చెప్పిన చాలా వుదాహరణల్లో యతి నియమం కోసం ఒకటి రెండు నియమాలు ఆలోచించి ఆ పదభందాలు చేర్చామన్నారు కదా. నాకప్పుడు ఏమనిపించిందంటే ఈ యతి నియమం సంతృప్తిపరచే పదభందం దొరగ్గానే మీలోని కవి మరింత మంచి పదానికై తన శోధనను ఆపివేశాడేమొనని! ఆ నియమమే లేకుంటే ఇంకెంత భావపుష్టి కలిగిన పదం మీకు దొరికేదో! ఆవేశంగా ఆశువుగా పదభందాలు దొర్లి automaticగా చంధోబద్దమైన పాదాలు జనిస్తే సరే కానీ యతో, ప్రాసో కలిసిందనే సాకుతో అంతకంటె మంచివైన పదాలను వదిలివేయడం సమంజసం కాదేమొ, లయబద్దమైన కవిత్వమే కావాలనుకుంటే తప్ప!
    –ప్రసాద్
    http://blog.charasala.com

« 1 ... 1547 1548 1549 1550 1551 ... 1581 »