Comment navigation


15802

« 1 ... 1548 1549 1550 1551 1552 ... 1581 »

  1. అనుబంధం గురించి T.Satyanarayana గారి అభిప్రాయం:

    10/28/2006 3:37 am

    Such situations do exist everywhere in the world.

  2. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    10/27/2006 2:25 pm

    ఒక రచన కలం పేరు మీద సాగినా, నిజం పేరు మీద సాగినా, ఆ రచన మీద అభిప్రాయం రాసేటప్పుడు ఆ రాసే వ్యక్తి తన నిజం పేరుతో రాయటం ఆరోగ్యకరమే కాదు, అవసరమేమో అని కూడ అనిపిస్తోంది. ప్రచురణ ముందు జరిగే రివ్యూ రాసేటప్పుడు అనామకంగా రాయటం ఆరోగ్యకరం అయినట్లే, ప్రచురించబడ్డ వస్తువు మీద విమర్శ రాసేటప్పుడు నిజం పేరుతో రాయటం కూడ అంతే ఆరోగ్యకరం. ఈ విషయంలో నేను లైలా గారితో ఏకీభవిస్తాను. రాసే వ్యక్తిని ఆక్షేపించకుండా రాసిన విషయాన్ని ఆక్షేపించటానికి భయం ఎందుకు?

  3. అర్హత గురించి Ramesh గారి అభిప్రాయం:

    10/25/2006 2:42 am

    Very Very nice. A beautiful Romantic love story. I like such type of stories.

    Thanks to the author for delivering such type of good story.
    Thanks
    Ramesh Gullapalli
    Hyderabad

  4. స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ గురించి Ramesh గారి అభిప్రాయం:

    10/25/2006 1:44 am

    బాగుంది. very nice. Good prediction about the Swamijis

  5. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    10/24/2006 6:16 pm

    Regarding – observer eccentric , and any number of other pseudonym users:

    రచనల మంచిచెడులు, రచయితల ఉద్దేశాలు, పాఠకుల నిద్ర-మెలకువలు, వగైరాల మీద -వీరు వీరి పేరు బైట పెట్టకుండా ఉద్దెశాలు వెలువరించడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏమిటి?
    ఈ మాట ఎడిటర్లు కావాలంటే అసలు పేర్లే లేకుండా రచనలు, వాటిపైన ఉద్దేశాలు వెయ్యొచ్చు. లేదా రచయితలకు, పాఠకులకు అందరికీ ఒకే రూలు వర్తించనీయండి.
    ఒక్కొక్క ఉద్దేశానికి ఒక్కొక్క మారుపేరు తగిలించుకుని పాఠకుడు/లు వ్రాయటం అసభ్యంగా అనిపిస్తుంది నాకు. తమ సొంత పేరు తో చిన్న అభిప్రాయం కూడా తెలుపలేని వారి అభిప్రాయాలకు విలువేమిటి?
    నా ఉద్దేశంలో సున్నా.

  6. కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” గురించి vijaya గారి అభిప్రాయం:

    10/24/2006 4:53 pm

    hello sir, it is simply supurb. thank you – vijaya

  7. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి ObserverEccentric గారి అభిప్రాయం:

    10/24/2006 8:45 am

    “మధ్య తరగతిని తయారు చేసింది” అనే రచయితల వాక్యాన్ని శ్రీనివాస్ గారు literal గా తీసుకున్నట్టున్నారు. నాకనిపించింది ఇక్కడ తయారు చెయ్యటం అంటే – ఈ మధ్యతరగతికి ఒక legitimacy ని ఇచ్చి, వాళ్ళ భావాల్నీ ఆలోచనల్నీ ఆశయాల్నీ ఉత్తమమైనవిగా ప్రచారం చెయ్యటం.

    భారత, ఆంధ్ర జాతీయతా భావాలకీ తెలుగు భావకవిత్వానికీ ఉన్న సంబంధం బాగా చెప్పారు. ముఖ్యంగా గురజాడ ఉదాహరణ బాగా అతికినట్టు సరిపోయింది ఈ సిద్ధాంతానికి. అయితే పుట్టపర్తి శివతాండవ రచన వంటి ఉదాహరణలు అతకలేదు. చాలా చోట్ల భాస్కర్ గారు చెప్పినట్టు continuity of thought, argument లోపించింది.
    రచన గొంతు (tone) రెచ్చగొట్టాలన్నట్టుగా ఉంది. అదే కనక రచయితల ఉద్దేశమైతే సఫలమైనట్టే. అందువల్లనైనా పాఠకుల్లో కొంచెం మెలకువ కలిగి చర్చ జరిగితే మంచిదే కదా!

  8. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    10/20/2006 9:49 pm

    ఇది ఆసక్తికరమైన వ్యాసం. పరిశోధనా పరంగా విషయాలను వెతికి వెలికి తీసి అందించిన శ్రమ కొట్టొచ్చి నట్లు కనపడుతుంది. రాజుల గురించి, కావ్యాలు, రచనలను ఉటంకించి ఎన్నో విషయాలను అందజేసారు.

    కాని వీటినన్నింటి ఆధారంగా చేసిన విశ్లేషణ, conclusion మాత్రం అసమగ్రంగా, అసంబద్ధంగా ఉంది. ఉదాహరణకు భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇది అని వివరించిన
    వాక్యం చూడండి. ఇది ఎందుకు ఉటంకించానంటే, మొత్తం వ్యాసానికి ఇది ప్రధాన భూమికగానే కాక, అంతస్సూత్రంగా కూడా ఉన్న ముఖ్యాంశం.

    “(భావ కవిత్వం) దేశంలో ఒక మధ్య తరగతిని తయారు చేసి వాళ్ళ ఊహల ద్వారా ఒక భారత జాతీయతని నిర్మించింది” అని అన్నారు.

    ఇది అసంబద్ధంగా ఉంది. కవిత్వానికి ఎక్కడైనా మధ్య తరగతిని తయారు చేసే శక్తి ఉంటుందా ? పోనీ, అలా చేస్తే కవిత్వానికి ఎప్పుడైనా ఒక ప్రత్యేక మైన వర్గానికి చెందిన వారి ఊహలను మాత్రమే ప్రభావితం చేసి, ఇతరులను అంటకుండా ముట్టకుండా వదిలేసే విచక్షణాపరమైన శక్తి కూడా ఉంటుందా? పోనీ, మధ్య తరగతి వాళ్ళ ఊహలు ప్రభావితం చేసిందే అని అంగీకరించినా, నేటి మధ్యతరగతి వాళ్ళు రేపు పేద వాళ్ళుగానో, కడు శ్రీమంతులుగానో మారిపోతే అప్పుడు ఏమైపోతాయి ఆ ప్రభావాలూ, ఆ ఊహలూ అన్నీనూ? భావకవిత్వమైనా, ఏ కవిత్వమైనా సరే, అది రచించినప్పుడు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా తరువాత అలానే మధ్యతరగతిలో ఉండాలని కానీ, ఉంటారని కానీ ఏమీ గ్యారంటీ లేదు కదా.

    అసలు economy వల్ల మధ్య తరగతేనిది ఏర్పడుతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే మధ్య తరగతిలోనే కాస్త డొక్క మాడే ఆకలి బాధలు తగ్గి, కొంత కడుపు చల్లబడి తీరికగా ఊపిరి పీల్చే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి సందర్భంలోనే కొంత భావమూ, ఊహలు చేసే అవకాశమూ, ఆలోచనలూ కలుగుతాయి కాబట్టి, అసలు ఈ మధ్య తరగతే “భావ కవిత్వానికి” భూమిక అనీ, “భావ కవుల” ఊహలకు “మధ్య తరగతే” బలం, గళం ఇచ్చిందీ అని ఎందుకు అనుకోకూడదో తెలియదు.

    Literature ని economy ని ఒక్క గాటున కలిపేసి ఈ విధంగా ఒక కవిత్వం యొక్క పరిణామాన్ని ప్రతిపాదిస్తూ, ఫలానాది మధ్య తరగతి వాళ్ళ ఊహలను ప్రభావితం చేసిందనడం రెంటికి చెడిన రేవడిలాగా ఉంది.

    అంతే కాక, ఏ జాతీయ భావం ఈ కవిత్వం కల్పించిందని అన్నారో, అదే భావానికి అంకితమై, ధనిక, పేద, మధ్య తరగతి అనే ఎటువంటి భేదం అణుమాత్రం లేకుండా ఉన్న ఆస్తులూ, పాస్తులూ, పదవులూ, ప్రాణాలు ఒడ్డి పోరాడి జైల్లలో మ్రగ్గిన వారెందరినో మరచిపోవడమే అవుతుంది, ఈ ప్రతిపాదనను అంగీకరించడం. భారత జాతీయతా అనేది కవిత్వమే కనక సృష్టించి ఉంటే ఆ భావకవులందరినీ బ్రిటీషువాళ్ళు జైల్లో త్రోసి సుళువుగానే దాన్ని నొక్కి ఉంచేవారు.

    (భావ) కవిత్వం కాదు భారత జాతీయతను నిర్మించింది! అంకురించి పెల్లుబుకి వెల్లువై విజృంబించిన భారత జాతీయతా భావతరంగాలకు తనదైన గొంతు నిచ్చి రసవంతంగా పలికించిన పదాలే కొన్ని మనం భావ కవితలనే పేరుతో పిలుస్తున్నాము అని అనుకుంటున్నాను.

    విధేయుడు
    -Srinivas

  9. సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    10/19/2006 4:29 pm

    రానారెగారి స్పందన చదివాక నాకు వివిధ్ భారతి రేడియోలో రోజూ ప్రసారం చేసిన సంగీత్ సరితా కార్యక్రమం గుర్తొచ్చింది. ఒక శాస్త్రీయ రాగ గీతాన్నీ, అదే రాగంలో ఒక హిందీ సినిమా పాటనూ వినిపించి, శ్రోతలకు సమాచారం అందించే ప్రయత్నం చేసేవారు. అది ఇంకా కొనసాగుతూనే ఉందనుకుంటాను. ఇటువంటి ప్రయత్నాల వల్ల బెరుకు తగ్గే అవకాశం ఉందనిపిస్తుంది. మనకున్న గొప్ప సంగీత వారసత్వంతో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు తోడ్పడే పద్ధతులన్నీ మంచివే. గురుశిష్యుల మాట ముఖ్యం కాదుగాని ఇటువంటివి ఎవరైనా నేర్చుకోగలిగితే అది సంతోషించదగిన విషయమే కదా.

  10. సంగీతంతో కుస్తీ గురించి రానారె గారి అభిప్రాయం:

    10/19/2006 2:41 pm

    సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం – అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. ధన్యోస్మి. నా తొలి గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలు.

« 1 ... 1548 1549 1550 1551 1552 ... 1581 »