Comment navigation


15792

« 1 ... 1325 1326 1327 1328 1329 ... 1580 »

  1. సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/06/2008 12:09 pm

    కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో ప్రతి కవితనీ శల్యపరీక్షకి గురిచేస్తే ఇలాటి అవస్థే ఏర్పడుతుంది కాబోలు!
    నాకు చదవగానే కవిత చాలా తేలికగానే అర్థమైందనిపించించి! కవి థాయిలాండు యాత్ర చేసాడు. ఆ యాత్రలో అతని మనఃఫలకంపై బలంగా ముద్రపడిన కొన్ని దృశ్యాలను, మిగిల్చిన అనుభూతిని యథాతథంగా పదాలలో చిత్రించే ప్రయత్నం ఈ కవిత అని నా కనిపించింది.
    ఆ తర్వాత వెతికితే ఈ లంకె కనిపించింది:
    http://www.pbase.com/ratluk/allofthailand

    ఈ కవితలో ఉన్న కొన్ని పద చిత్రాలకి చాయా చిత్రాలని ఆ లంకెలో చూడవచ్చు.

  2. సువర్ణభూమిలో … గురించి mOhana గారి అభిప్రాయం:

    11/06/2008 11:30 am

    నా ఉద్దేశంలో ఇది రచయిత తాయిలాండు దేశం వెళ్లినప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహాలను చూచి వ్రాసిందనుకొంటాను. అక్కడ సుఖాసీనులైన బుద్ధుల చిత్రాన్ని ఇక్కడ చూడగలరు. బంగారు బుద్ధ విగ్రహాలు కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి . సముద్రం అడుగులో బహుశా రచయిత అండర్ వాటర్ డైవింగ్ చేశారేమో? ఆ అనుభూతిని వ్రాసి ఉంటారు. తాయిలాండు సముద్రతీరాలు దీనికి ప్రసిద్ధమైనవి. మన సినిమావాళ్లు కూడా ఇలాటి షూటింగులను ఎన్నో చేశారు గదా! చివరగా భాషలను త్వరగా నేర్వగలము, కాని మనుషులు, వారి మనసులు అర్థం చేసికోవడం కష్టం అని తెలిపారు. రచయితకు చాలా భాషలు వచ్చు, తాయిలాండుకు విహారయాత్రకు వెళ్లినప్పుడు వ్రాసినది అని నా భావన. కవుల మనసులో ఏముందో మనకేం తెలుసు?
    విధేయుడు – మోహన

  3. సువర్ణభూమిలో … గురించి Suneel గారి అభిప్రాయం:

    11/06/2008 10:39 am

    వినీల్ గారి జ్ఞాన బోధ తర్వాత నాకు వామన మూర్తి గారి కవిత partial differential euqation of second kind కింద తోస్తోంది.

    నాకు తోచిన interpretetion

    అంకాలమ్మ గుడి మన సంస్కృతికి ప్రతీక. ఒక అడుగు అనడంలో అది అంతరించిపోతోందే అన్న బాధ ధ్వనిస్తోంది.

    ఆ ఆటో నేటి పత్రికలకీ, శవం నేటి కవిత్వానికీ ప్రతీకలు.

    ఆ జెండా మరేమీ కాదు నేటి కాలపు కవిత్వంలో కనిపించే వాదాలకి ప్రతీక. ఆ బల్లి నాలాంటి సామాన్య పాఠకుడు.(బాధితుడు)

    తామరాకు నిద్రలేచి ఆవులించడమనేది వినీల్ గారి జ్ఞాన బోధకి నిద్రలేచిన నా మనసుకి ప్రతీక. వామన మూర్తి గారు కాల జ్ఞానానికి అబ్బురపడడం తప్ప మరేమీ చేయలేను.

    “పసిపాప ప్రత్యేక రాష్ట్రం కోసం గర్జిస్తోంది ఎంత సుకుమారం” ఆ పసిపాప విమర్శకుడు, ప్రత్యేక రాష్ట్రం భూషణ్ గారి కవిత్వం లాంటి కవిత్వమనీ నాకు అర్ధమైంది. ఎంత సుకుమారం అనడంలో విమర్శలు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. కవి ప్రతిభ అద్భుతంగా వ్యక్తమైంది.

    ఇక ఛాంగు భళ ఎంకి మావ అని కవితని ముగించడం. ఈ ఒక్కటీ మాత్రం అర్ధం కాలేదు. అందుకే partial differential equation అన్నది.

  4. సువర్ణభూమిలో … గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/06/2008 9:57 am

    చాలా బావుంది. అసలు ఇవన్నీ తెలుగు అక్షరాలే కదా.ఎందుకు అర్థం కావడం లేదు అని బాగా ఆలోచిస్తున్నా. వినీల్ గారి ఇంటర్‌ప్రెటేషన్ చదివాక నాకైతే ఈ కవిత అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి వ్రాసినట్లు అనిపించింది. ఎలాగంటే
    ముఖ ముఖి
    సుఖాసీనులై
    బుద్దులు
    (ఒబామా, మెకైన్ లు ఇద్దరూ చెరొక బుద్దుడిలా సుఖంగా కూర్చునీ, నిలుచొనీ మనకి సందేశాలిస్తున్నారు)

    వాడని కలువలు
    అలుముకునే ధూపం
    (ఆ మాటలు వినే మన మనసులు కలువలు లాంటివి. వాటి చుట్టూ పొగ అలుముకుంటోంది)

    ఎదురెండలో
    ఎర్ర చారల పిల్లి
    (వాళ్ళ మాటలు సరిగా అర్థం చేసుకోలేని, ఎర్రచారల పిల్లి లాంటి, కొంతమంది అయోమయం అనే ఎండలో)
    చెలగాటమాడుతుంది
    తలను పాదాలమీద ఉంచి
    (తమలో తాము ఘర్షణ పడుతూ, చెలగాటంలాగా, పాపం తలని మోకాళ్ళలో దాచుకుంటూన్నారు)

    ఈ విధంగా చూస్తే కవితా చాలా సులభంగానే అర్థమౌతోంది.
    ఏమైనా యదుకుల భూషణ్ గారి కవితలు చాలా ఇనిస్పిరేషన్ గా ఉంటున్నాయి. నెలకొక కవితైనా వారినుంచీ రావాలని కోరుకుంటున్నాను.

  5. రచయితలకు సూచనలు గురించి Syed గారి అభిప్రాయం:

    11/06/2008 9:40 am

    ఈ మాట Team members అందరికి నా హ్రుదయపూర్వ అభివందనాలు.తెలుగు ప్రజలకు చాల మంచి site ఇచ్చారు.

  6. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/06/2008 9:21 am

    I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.

    గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.

    మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.

    చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
    వ్యక్తీకరణ బాగుంది.

    అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.

    May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
    ====
    Regards
    Srinivas

  7. సువర్ణభూమిలో … గురించి bollojubaba గారి అభిప్రాయం:

    11/06/2008 9:06 am

    వినీల్ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  8. కుతంత్రం గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    11/06/2008 4:30 am

    మీ కథ ఎంతో బాగుంది. కథల్ని విశ్లేషించడం నాకు చేతకాదు కానీ, ఇందులో మనసుకి హత్తుకుపోయే కథనం, కారెక్టర్లూ ఉన్నాయి. ఇంతగా నాకు నచ్చే కథలు ఇప్పటిదాకా తక్కువే చదివాను.

  9. రెండు తీరాలు గురించి chittibabu mayara గారి అభిప్రాయం:

    11/05/2008 10:51 pm

    Excellent….

  10. సార్ గారండీ… సార్ గారండీ… గురించి ప్రతాప్ గారి అభిప్రాయం:

    11/05/2008 9:43 pm

    అవును అంతకంటే జీవితానికి ఏం కావాలి?

« 1 ... 1325 1326 1327 1328 1329 ... 1580 »