ఈ మాట పదవ వసంతం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. పూర్తిస్థాయి సాహిత్య, సాంస్కృతిక పత్రిక అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముందుకు యిలాగే, సాగిపోవాలని ఆ పరాత్పరుణ్ణి ప్రార్థిస్థూ – కొంపెల్ల శర్మ – తెలుగురథం.
మహానటి సావిత్రి గారి జనరంజని కార్యక్రమము:
Excellent.
So far, eemaata is restricted to literary writings and sounds/ voices only. I hope to see Eemaata coming up with programmes making the best use of the multimedia technology ( including videos and movie recordings and images ) in the future.
Thank you for including the programme in your site.
మీరు చెప్పిన హైకూ వ్రాసింది చెట్టుకవి ఇస్మాయిల్ గారు. మీరు వ్యంగ్యంగా ఉటంకించిన హైకూ, ఒక స్ట్రే థాట్. అలా చూడగలగడం కూడా అరుదైన విషయమే కదా. చెట్టుకవి ఇస్మాయిల్ గారి ఇతర రచనలు ఈమాట ఆర్చైవ్స్ లో ఉన్నాయి వీలైతే చదవండి. ఎంజాయ్ చెయ్యగలరు. I wonder in his poetry how he could see the things in such a totally different angles.
ఇక ఇప్రస్తుతం జరుగుతున్న డిస్కషను ఖాళీ సీసాల ఇస్మాయిల్ గారిగురించి. వీరు తన పేరును స్మైల్ అని కుదించుకొన్నారు. తెలుగు సాహిత్యం వరలో రెండు ఇస్మాయిల్స్ దూరటం బాగోదు కనుకేమో. వీరు వ్రాసింది తక్కువైనా మంచి కవిత్వం వ్రాసారు.
పై విషయంలో మీకే కాదు చాలా మంది కన్ఫ్యూషను లో ఉన్నారని నాకనిపించి ఈ కామెంటు వ్రాస్తున్నాను. ఎందుకంటే, ఆయన చనిపోయిన రోజున ఓ లోకల్ పత్రికలో, చానాళ్ల క్రితమే చనిపోయిన చెట్టుకవి ఇస్మాయిల్ గారిని మరలా వార్తల్లోకెక్కించేసాడో విలేఖరి.
వీణ తీగలను లెక్కించటం పద్ధతి – వీణ దండం మీద, వైణికుడికి అన్నిటికన్నా దూరంగా ఉన్న ( ఇత్తడి)తీగె మొదటిది, అన్నిటికన్నా దగ్గరగా ఉన్న (ఉక్కు) తీగె నాలుగవది కాదా రోహిణీ ప్రసాద్ ?
” అనుమంద్ర పంచమానికి మొదటి తీగె, మంద్ర షడ్జమానికి రెండవ తీగె, పంచమానికి మూడవ తీగె, మధ్య షడ్జమానికి నాల్గవ తీగెను ఈ కాలంలో శృతి చేసున్నాం.” – ముదిగొండ వీరభద్రయ్య రచించిన వీణ -వీణాపాణులు అన్న పుస్తకము నుండి.
వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.
తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.
నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!
ఒంటరి గురించి kolord97@gmail.com గారి అభిప్రాయం:
12/29/2008 12:32 am
చాలా రొజుల తరువాత హృద్యమైన కథ చదివాను.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి kompella sarma గారి అభిప్రాయం:
12/28/2008 9:21 pm
ఈ మాట పదవ వసంతం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. పూర్తిస్థాయి సాహిత్య, సాంస్కృతిక పత్రిక అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముందుకు యిలాగే, సాగిపోవాలని ఆ పరాత్పరుణ్ణి ప్రార్థిస్థూ – కొంపెల్ల శర్మ – తెలుగురథం.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/28/2008 11:46 am
బంగ్లాదేశ్ లో బాలమురళి స్ఫూర్తితో జరుగుతున్న కృషి ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.
http://www.sarvasree.net/index.php
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి srihari గారి అభిప్రాయం:
12/28/2008 10:18 am
ఇది చాలా మంచిపద్యము. ఇది తెలిపినందుకు కృతజ్ఞతలు. ఇలాంటివి పారిజాతాపహరణములో ఎన్నో ఉన్నాయి.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Sudhakar గారి అభిప్రాయం:
12/28/2008 5:53 am
మహానటి సావిత్రి గారి జనరంజని కార్యక్రమము:
Excellent.
So far, eemaata is restricted to literary writings and sounds/ voices only. I hope to see Eemaata coming up with programmes making the best use of the multimedia technology ( including videos and movie recordings and images ) in the future.
Thank you for including the programme in your site.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి bollojubaba గారి అభిప్రాయం:
12/28/2008 4:38 am
వంశీ గారికి :-)
మీరు చెప్పిన హైకూ వ్రాసింది చెట్టుకవి ఇస్మాయిల్ గారు. మీరు వ్యంగ్యంగా ఉటంకించిన హైకూ, ఒక స్ట్రే థాట్. అలా చూడగలగడం కూడా అరుదైన విషయమే కదా. చెట్టుకవి ఇస్మాయిల్ గారి ఇతర రచనలు ఈమాట ఆర్చైవ్స్ లో ఉన్నాయి వీలైతే చదవండి. ఎంజాయ్ చెయ్యగలరు. I wonder in his poetry how he could see the things in such a totally different angles.
ఇక ఇప్రస్తుతం జరుగుతున్న డిస్కషను ఖాళీ సీసాల ఇస్మాయిల్ గారిగురించి. వీరు తన పేరును స్మైల్ అని కుదించుకొన్నారు. తెలుగు సాహిత్యం వరలో రెండు ఇస్మాయిల్స్ దూరటం బాగోదు కనుకేమో. వీరు వ్రాసింది తక్కువైనా మంచి కవిత్వం వ్రాసారు.
పై విషయంలో మీకే కాదు చాలా మంది కన్ఫ్యూషను లో ఉన్నారని నాకనిపించి ఈ కామెంటు వ్రాస్తున్నాను. ఎందుకంటే, ఆయన చనిపోయిన రోజున ఓ లోకల్ పత్రికలో, చానాళ్ల క్రితమే చనిపోయిన చెట్టుకవి ఇస్మాయిల్ గారిని మరలా వార్తల్లోకెక్కించేసాడో విలేఖరి.
నాచన సోమన అపురూప పద సంచయం గురించి గిరి గారి అభిప్రాయం:
12/27/2008 5:54 pm
మీది విలక్షణమైన ప్రయత్నం. ధన్యవాదాలు
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/26/2008 5:59 pm
లైలాగారూ,
నా దగ్గర వీణ పుస్తకం లేదు. కుడిచేతికి దగ్గరి తీగను మొదటిది అన్నాను.
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/26/2008 4:11 pm
“కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది.” -Rohiniprasad.
వీణ తీగలను లెక్కించటం పద్ధతి – వీణ దండం మీద, వైణికుడికి అన్నిటికన్నా దూరంగా ఉన్న ( ఇత్తడి)తీగె మొదటిది, అన్నిటికన్నా దగ్గరగా ఉన్న (ఉక్కు) తీగె నాలుగవది కాదా రోహిణీ ప్రసాద్ ?
” అనుమంద్ర పంచమానికి మొదటి తీగె, మంద్ర షడ్జమానికి రెండవ తీగె, పంచమానికి మూడవ తీగె, మధ్య షడ్జమానికి నాల్గవ తీగెను ఈ కాలంలో శృతి చేసున్నాం.” – ముదిగొండ వీరభద్రయ్య రచించిన వీణ -వీణాపాణులు అన్న పుస్తకము నుండి.
సరస్వతి, నారదుడు ఏమిటండీ, 🙂 ఈమని శంకరశాస్త్రి వీణ ఈశ్వరుడే ఇష్టంగా వింటాడు. మన అదృష్టం బాగుంది. మనమూ విన్నాం. 🙂
లైలా.
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/26/2008 1:46 pm