Comment navigation


15805

« 1 ... 1259 1260 1261 1262 1263 ... 1581 »

  1. బోడి పద్యం గురించి narsimha గారి అభిప్రాయం:

    03/30/2009 10:40 am

    ఈమాట్లో కయిత్వం చదువుడు నాకూ, మా దోస్తుల్కూ ఆదతు పళ్లేదు. పూల్ గురించి, పూబోడుల గురించీ, పిరుదుల గురించీ, అమ్మాయి కోసమో, అబ్బాయ్ కోసం రాసిందో తెలియని నయా భావ కవిత్వం జర ఎక్కువ. ఈ మాట కయితల్లో. అమెరికా వెళ్లి సనాది వారాలు ఆంధ్రా యాదొచ్చి, అ ఆలు నేర్చుకుని రాసే వోళ్లు ఈడ మస్తుగా కనిపిస్తరు.

    ఎవురో సెప్పిన్రు, అఫ్సర్ కవిత మీద మస్తు లొల్లి పడ్తున్నరని ఈడ.

    పని మాల సదివిన. నాకయితే ఇంక కడక్ చాయ్ లాగా రాసుండాలన్పించింది. చాయ్ పత్తా జర తక్కువయింది కదన్నా! ఇంకా జోరుగా మాటలు పడాలన్నా! ఇంకా ఇలాంటి కయితలు రావాల. తెల్ల పొగరు అణగిపోవాల. ఈ మాటలో కూడా జబర్దస్తు కయితలు వస్తయని ఎడిటర్లు జర సమజున్నోళ్ళే అని ఇయ్యాల్నె సమజయ్యింది.

    నర్సింహ

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/30/2009 9:30 am

    రమ గారు,

    సంగీత సాహిత్యాలలో ఎత్తు పల్లాలు కల కాలం మార్పుకిలోనుగాకుండా వుంటాయా? ఆయా రంగాలలో ఉద్దండులైన వారు అన్ని వర్గాలోనూ అలాగే పరిగణింపబడతారా? సమాజంలో ఆ పండిత వర్గం కోసం వ్రాసుకున్న వ్రాతలే సాహిత్యానికి ప్రమాణాలా? మిగిలిన జనాల్ని ఉర్రూతలూగించిన త్యాగరాజు, అన్నమయ్య, గద్దర్ల పాటలు (మళ్ళా వీటికో ప్రత్యేకవైన పేరు కృతులు, కీర్తనలని, విప్లవ సాహిత్యవని) సాహిత్యం కాదని ఆ వెయ్యికొకరు పండితులైన వారు చెప్పేది, మాలాటి సామాన్యులు ఎందుకు అంగీకరించాలి? కాబట్టి మీరు పండితులైతే మీ సాహిత్యం ప్రమాణాలు వేరు, మాలాటి సామాన్యుల సాహిత్య నిర్వచనాలు, ప్రమాణాలు వేరు అని మనవి చేసుకుంటున్నాను.

    రవి

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/30/2009 8:56 am

    రవికిరణ్,

    మీ ప్రశ్నకి బాబ్జీలు ఏమని ప్రతిస్పందిస్తారో..నాకు తెలీదు గానీ…అక్షరం లో వుండే గాడత ..కవితా వ్యక్తీకరణ..ఇవి అందరివీ ఒక్క ప్రమాణంలోనే ఉండవని..ఒకే అనుభవ నిర్వచనం లోకి ఒదగవని….దానిని బట్టే కవుల్లోని ఉత్తమ..మధ్యమ..శ్రేణులని..సాహిత్యంలో నిర్ణయిస్తారనీ..మనకి స్వానుభవంగానే తెలుస్తుంది. వాదన కోసం..బలం లేని కవితాపంక్తుల్ని ..ఓహో! అని అనొచ్చు. కానీ..”రసం”..”స్వారస్యం”..అన్నవి పరిగణనలోకి తీసుకున్నప్పుడు..ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అన్నట్టుగా..అందరు కవులూ సమానమే అవరు. అలా ఎందుకు కారో విడమరిచి చెప్పాలంటే..విమర్శ ఉండాలి. ఇది ఓట్లు వేయించుకుని best singer అయిపోవటం లాంటిదీ కాదు.

    శాస్త్రీయ సంగీతరంగంలోని ఉద్దండులైన శ్రీపాద పినాకపాణి గారి ..అలాగే రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారి అభిప్రాయం..కవిగా త్యాగరాజుని గురించి చెప్పబడి వున్నది… ఏకోశానా పరిగణించ వలసిన పనే లేనట్టుగా ఎవరుగానీ మాట్లాడటం ఆ రంగంలోని వారి విద్వత్తుతో పోటీ పడి మాట్లాడటం లాంటిది. అలాంటి కృషి చేసిన వారి మాటకి ఉన్న చెల్లుబాటు అది లేనివాళ్ళు అంటే ..మరి, దానికి రాదు.

    అలాగే వ్యక్తిగతంగా నేను గద్దర్ నీ..అన్నమయ్యనీ..త్యాగరాజునీ ఒక్కలాగే అర్ధంచేసుకుని ఆనందిస్తాను…అని మీరు అంటే..దాన్ని మీ వ్యక్తిగతమైన అభిప్రాయంగా మాత్రమే గ్రహించి..ఊరుకోవచ్చు.కానీ అదే సాహిత్యం విషయంతో పోల్చిచూసి దానికి ఉండే standards ప్రకారం అయితే మీ వ్యాఖ్య విమర్శ కి లొంగదు. కవితాబలం ముందు అన్నమయ్య తో పోటీకి గాని..పోలికకి గానీ..అస్సలు నిలవరు మీరు చెప్పిన ఆ ఇద్దరూ!!

    రమ.

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/30/2009 7:58 am

    బాబ్జీ,

    “శ్రీపాద పినాకపాణి గారు: పొయెట్రీ లేదు. బెగ్గింగ్ ఫర్ మెర్సీ అంతే…. ” దయ కోసవో, ప్రేమ కోసవో, విప్లవం కోసవో వేడుకోవటం, కావాలనుకోవటం, పాడుకోవటం సాహిత్యం కాకపోవటవేవిటి?
    సాహిత్యవంటే ఏవిటి? దీనికి అనేక నిర్వచనాలుండొచ్చు. పాత, క్రొత్త తరాల్లో ఎవరెవరు ఏవిధంగా నిర్వచించారో నాకు తెలియదుగాని, నా వరకు నాకు, అత్యంత సరళంగా, మనసుకి హత్తుకునేట్టు, మనసుని కదిలించేట్టు ఉన్నటువంటి త్యాగరాజ కృతులు గానీ, అన్నమయ్య పదాలు గానీ, గద్దరు పాటలు (కొన్నాయనవి, మరి కొన్ని ఇతరులవి) గానీ అత్యంత విలువైన సాహిత్యవే. ఇదేట్రా గద్దర్ని తెచ్చి త్యాగరాజుతో పోలుస్తాడు అంటారేవో. ఎందుకంటే, నాకు సంగీత, సాహిత్య శాస్త్రాలేవీ రావు. నాకు తెలిసిందల్లా, వినడం, చదవడం అర్థవైనంత వరకు. పైన చెప్పిన ముగ్గురు నా ప్రయత్నవేవీ లేకుండానే నాకర్థమవుతారు. అది పండిత లోకం ఒప్పుకునే సాహిత్యం కాదంటారా, కాకపోతే ఏవిటో నష్టం?

    రవి

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    03/29/2009 9:39 am

    ఇక్కడ వ్యాఖ్యలు చదివినాక మాయాబజార్లో ఒక డయలాగు గుర్తొస్తోంది.
    ముసలి వాని రూపంలో ఉన్న కృష్ణుణ్ణి ఘటోత్కచుడు ఎవర్నువ్వు అంటాడు.
    కృ: ఓహోహో నీవా? నీకు తెలియదూ నేనెవరో?
    ఘ: తెలీకనే గదా అడిగేది?
    కృ: తెలియని వానికీ చెప్పినా తెలియదూ!

  6. బోడి పద్యం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    03/29/2009 9:34 am

    ఈ పద్యమ్మీద లైలా, రాళ్ళపల్లి శర్మ, రావూరి శ్రీలత గార్లు చేసిన వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నా.
    ఏదో నాలుగు వరద తరగల్లో కొట్టుకుచ్చిన భాగ్యానికి తెలుగుకవిత్వమంతా మాకు తెలుసు, ఈమాటకొస్తే మాకే తెలుసు అని మిలట్రీకవాతు విద్వాంసుల పుంజీడు రణగొణధ్వనులు వినీవినీ వేసారిన ప్రాణానికి మీ వ్యాఖ్యలు హాయిగా ఉన్నాయంటే నమ్మండి.
    అదలాగుండగా, పైన రవికిరణ్ గారు లేవదీసిన కొన్ని ఆసక్తి కరమైన ప్రశ్నలకి రాళ్ళపల్లి గారి వ్యాఖ్య మంచి సమాధానమిస్తోంది.
    శ్రీలతగారు కూడా అడగాల్సిన ప్రశ్న అడిగారు. శ్రీలతగారూ, నాకు ఇంకో ప్రశ్న తడుతోందండీ – ఒక కవి విభిన్నమైన, ఆలోచనల్ని, పరస్పరం విరుద్ధం కాకపోయినా కొంత విభేదించే ఆలోచనల్ని రాయడం మరీ అంత విడ్డూరమంటారా?

  7. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    03/29/2009 9:25 am

    MS Prasad గారికి,

    పుస్తకం వివరాలు:

    పేజీలు 703. బౌండ్. వెల 295 రూపాయలు. నవోదయలో దొరుకుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి D. Venu Gopal గారి అభిప్రాయం:

    03/28/2009 10:28 pm

    ఎప్పటినుండో ఇది చదవాలని. ఇప్పటికి చదివాను. చాలాచాలా ధన్యవాదాలు.

  9. ఈమాట కొత్త వేషం గురించి Shankar గారి అభిప్రాయం:

    03/28/2009 8:17 pm

    చాలా బాగుందండి…

  10. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి vrveluri గారి అభిప్రాయం:

    03/28/2009 12:17 pm

    ఈమాట సంపాదకులకు:
    శ్రీ కొడవళ్ళ హనుమంతరావుగారు ఇలా రాసారు:

    ” మూడు నాలుగేళ్ళ క్రితం, నేను కొత్తగా తెలుగు సాహితీ ప్రపంచంలో తలదూర్చి, రచ్చబండలో, తెలిసీ తెలియని సాహితీ జ్ఞానంతో హేమాహేమీలతో తగాదాలు పడేవాణ్ణి. అప్పుడే వేలూరి గారి ఓ ఈమాట వ్యాసం పై గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆయన ఓ పొడవుపాటి జవాబు రాస్తూ, మధ్యలో ఇలా అన్నారు:

    “My second assertion, or call it a plea, that we badly need word meanings, paraphrases, and commentaries of their works to better appreciate them, and not to lose them!”

    నా ప్రమేయానికి కారణం అదన్న మాట. చాలా సమయం పట్టినా, కార్యరూపం దాల్చినందుకు సంతోషం. అప్పట్లో, అంటే ఆస్తులన్నీ హరించుకుపోక ముందు, ఆయన ఇంకాస్త ఎక్కువ విరాళం అడగనందుకు చాలా విచారపడుతున్నాను. “

    ఆతరువాత హనుమంతరావు గారు, నేను ఈ విషయంపై మాట్లాడుకున్నట్టు, ప్రైవేటు మెయిళ్ళు పంపిచుకున్నట్టు జ్ఞాపకం. ఏదయితేనేం! నా దుడుకు మాటలకి ఆయన రియాక్ట్ అయి విరాళం ఇవ్వడం ముదావహం.

    తొందరపడకండి, హనుమంతరావుగారూ! చాలాకాలం తరువాత అమెరికన్లు తెలివైనవాడు, నమ్మకస్తుడు నిజమైన దేశభక్తుడూ అయిన వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కనుక, మీ 401(కె) బహుకొద్దికాలంలోనే పైపైకి పోతుందని ఆశిస్తున్నాను. అప్పుడు, మీ దగ్గిరకి మరో మంచి సాహితీకార్యక్రమానికై మరికాస్తపెద్ద విరాళంకోసమే వస్తానని హామీ ఇస్తున్నాను.
    It is easy to sermonize. It requires commitment to act positively. I am happy you did the right thing, and I know you know that too!

    అభివాదాలతో,
    వేలూరి వేంకటేశ్వర రావు.

« 1 ... 1259 1260 1261 1262 1263 ... 1581 »