Comment navigation


15823

« 1 ... 1136 1137 1138 1139 1140 ... 1583 »

  1. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhan గారి అభిప్రాయం:

    07/04/2010 9:50 pm

    ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –

    ఇది శ్రీమదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవంశోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము

    (ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)

    కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –

    ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల-
    బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోపలోట్టంకితాం-
    కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాన్మత్కృతాముక్తమా-
    ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగున్
    – శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 4.289

    (ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)

    సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –

    రోమ్ణాం హర్షణకారిణీ శ్రవణతః పాపౌఘవిధ్వంసినీ
    ప్రేమ్ణా చింతయతాం విచిత్రవిమలశ్లాఘార్థసందాయినీ
    సంజాతే భువి రుక్మిణీశవిజయే సద్వాదిరాజోదితే
    సంజాతః సురమండలీషు మహితః సర్గో ముదాం సప్తమః

    (రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)

    ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂

    విధేయుడు – మోహన

  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/04/2010 2:26 pm

    ఈ విషయం మీద నేను చెప్పదల్చుకున్న విషయాలు ఐపోవచ్చాయి. చివరగా అఫ్సర్ గారు అడిగిన “ఊహాపాఠకుల” విషయం కొంత స్పృశించి ముగిస్తాను. నా “అశాస్త్రీయ సర్వే” పద్ధతి ఇది – నేను సామాన్యంగా రెండేళ్లకోసారి ఇండియా వెళ్తాను; అలా వెళ్లినప్పుడు నవోదయ లో గత రెండేళ్లుగా వచ్చిన కవిత్వపుస్తకాలు అన్నీ ఒకో కాపీ కొంటాను; (వాటిలో ఏవీ వెయ్యి కాపీలకు మించి ప్రచురించబడవు); అప్పుడు వాళ్లని ప్రతిసారీ అడుగుతాను – వాటిలో ఏయేవి ఎలా అమ్ముడు పోతున్నాయని. మొదల్లో కొంత మొహమోటపడ్డారు గాని తర్వాత వాళ్లు చెప్పేది NRI లు తప్ప ఎవరూ కొనరూ అని; ఇక చాలా మంది కవులు సొంతంగా ప్రచురించుకుని తెలిసిన వాళ్లకు అంటగట్టటమో ఊరికే ఇవ్వటమో చేస్తారనేది నాకు తెలిసిన కొద్దిమంది కవులు స్వయంగా చెప్పిన విషయం. ఊరికే ఇచ్చినవి చదివేవాళ్లు చాలా కొద్దిమంది అన్నది ఏ సర్వేలూ అక్కర్లేకుండానే చెప్పొచ్చు. కొన్న ఒక్కో ప్రతినీ ఈ కాలంలో ఒకరికి మించి చదవరు అనేది నా ప్రతిపాదన. కనుక మొత్తం మీద ఓ కవితాసంకలనాన్ని వెయ్యిమందికి మించి చదవరు (మొదటి నుంచి చివరదాకా చదివేవాళ్లు ఇంకా తక్కువ). అంతేకాదు, పై సమాచారాన్నుంచి వీళ్ళు ఎలాటివాళ్లో కూడా derive చెయ్యొచ్చు – వీళ్లు నాలుగు రకాల వాళ్లు: 1) ఇతర కవులు, 2) ఆ సంకలనకర్త బంధువులు, స్నేహితులు, 3) విమర్శకులు, 4) చాలా కొద్దిమంది కవితాసక్తి వున్నవాళ్లు (వీళ్లలో చాలా ఎక్కువభాగం గుప్తకవులు). ఇకపోతే ఆ కవితలు పత్రికల్లో వచ్చివుండొచ్చు. ఆ పాఠకుల మాటేమిటి? నేను చేసుకున్న మరొక ప్రతిపాదన వాళ్లు కూడా పై నాలుగు రకాల వాళ్లేనని. ఏతావాతా తేలేదేమంటే ప్రస్తుత కవిత్వానికి “ముఖ్యమైన” పాఠకులు ఎక్కువభాగం ఇతరకవులే నని.

    వీళ్లు కాక ఇంకెవరినైనా ఒక కవి తన పాఠకులుగా భావిస్తే వాళ్ళు ఊహాపాఠకులు. ఇదీ నా definition. ఇతరులు అంగీకరించొచ్చు, రించకపోవచ్చు. అఫ్సర్ గారి శాస్త్రీయ సర్వే ఫలితాల కోసం వేచి చూస్తాను.

  3. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి సంచారి గారి అభిప్రాయం:

    07/04/2010 8:42 am

    I am disturbed by the implication of KVS Ramarao that the reviewer is biased. This amounts to ascribing ulterior non-literary motives to the reviewer and a personal insult. One may disagree with the reviewer, but one can not start by questioning the honesty of the review, but none of the above comments seem to even acknowledge that the reviewer honestly spoke his mind. This is more unfortunate given the stature of people who posted these comments.

  4. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి JAGADEESHWAR గారి అభిప్రాయం:

    07/04/2010 4:17 am

    very good

  5. ప్రేమ కవితలు గురించి JAGADEESHWAR గారి అభిప్రాయం:

    07/04/2010 4:11 am

    చాల బాగున్నవి

  6. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి V. Praveena Reddy గారి అభిప్రాయం:

    07/04/2010 2:29 am

    Namasthe

    Vrayatam… vrasina dhanni edit cheyyadam manaku ekkuvaga alavatu leni vishayam. Amricalo rachayithalaku edtarlu untarani thelisinappudu….

    వ్రాయటం, వ్రాసిన దానిని ఎడిట్ చేయడ మనకు ఎక్కువగా అలవాటు లేని విషయం. అమెరికాలో రచయితలకు ఎడిటర్లు ఉంటారని తెలిసినప్పుడు.. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆలోచిస్తే 99శాతం రచనల్లో ఎడిటింగ్ అవసరమే అనిపించింది. ప్రఖ్యాతి రాగానే మన రచయితలు ఏమి రాసినా గొప్పే.. అనాల్సి వస్తోంది. అందువల్ల గొప్ప రచనలు రావడం అరుదైపోయింది. కానీ 100లో 1కింటికి ఎడిటర్ల వల్ల రచయిత ఆ రచనలో ప్రాణప్రతిష్ట చేసినా soul కి విఘాతం కలుగుతోంది. Any how, మీ సంపాదకీయం విషయబద్ధంగా ఉంది.

    Thank you.
    Request…
    Memu meku rachanalu ela pampalo thelupagalaru….
    V. Praveena Reddy
    ( writer, journalist)

    [మీ అభిప్రాయాలు దయచేసి తెలుగు లేదా ఇంగ్లీషులోనే వ్రాయండి. తెంగ్లీషు వాడకండి. ఈమాటకు రచనలు ఎలాపంపాలో సూచనల పేజీలో చూడగలరు – సం.]

  7. నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/04/2010 2:04 am

    కెవీయస్ రామారావుగారూ!! ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.

    ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ – కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.

    రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.

    రమ.

  8. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/04/2010 1:32 am

    చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీషు సాహిత్యలో కీట్సు , షెల్లీ ల కవిత్వాన్ని ప్రచురణకర్తలూ.. సమీక్షకులూ ఎలా నిర్లక్ష్యం చేసారో వారి జీవితకాలంలో ఆయా కవులు ఎలా నిరాదరించబడ్డారో.. వెంకటేశ్వరావుగారికి తెలియదని నేను అనుకోను. అలాంటి రివ్యూదారులు ఒకలాంటి వాళ్ళైతే మరొకరకం ..చెత్తకవిత్వాన్ని పైకెత్తుకునే రివ్యూదారులూ ..అనువాదకులూను. ఉత్తమ కవులని పక్కకు పెట్టి వారి వారి వ్యక్తిగత కారణాలకి గానూ నాసిరకం రచయితలని ముందువరసలో చూపించిన పనిని అన్ని కాలాల్లోనూ పత్రికలూ చేసాయి. విమర్శకులూ చేసారు. అనువాదకులూ చేసారు. చేస్తున్నారు.

    రమ.

  9. అ, న్యాయం గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/04/2010 1:14 am

    ఓహో…అమెరికాలో కూడా ఇంతే అన్నమాట!
    ఇంతకీ – నా సందేహం – లక్ష, లకారం – మన డబ్బుల లెక్కల్లో వాడతాం కానీ, డాలర్‌ లెక్కల్లో అసలు ‘లాక్‌’ అన్న కాన్సెప్ట్ లేదు కదా? ఉందా??

  10. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    07/04/2010 1:14 am

    రమ గారు అన్న “కట్టు కధలలోకెల్లా ముఖ్యమైనదీ తెలుగువారికి ప్రీతిపాత్రమైనదీ అయినది కృష్ణ్దరాయలే ఆముక్తమాల్యదని రాసినవాడని నమ్మడం. ఇది పెద్దన విరచితమనీ తనకి అమిత స్నేహపాత్రుడైన రాయని పేర ఈ కృతిని అల్లసాని పెద్దనే రచించి పెట్టాడనీ అనేకానేక రుజువులతో ఇదివరలో ఎన్నో చర్చలు జరిగాయి ” చాలా ఆశ్చర్యకరం. వారనే అనేకానేక ఋజువులు నాకు తెలియవు గాని ఆముక్తమాల్యద పెద్దన కృతం కాదని మాత్రం ఆధునికశాస్త్రీయంగా ఋజువు చెయ్యవచ్చు. ఈ విషయం తెలుగులో చెప్పటం కష్టం కనుక ఆంగ్లంలో వివరిస్తాను.

    Well-known statistical tool known as “hypothesis testing” has been successfully used to authenticate the authorship of several works, including some of the Shakesperean dramas and can be utilized to determine whether or not both Manucaritra and Amuktamalyada are authored by the same person. For this, one takes random samples of poems from each and counts the number of occurrences of different canonical word-roots, The hypothesis that both of these collections come from the same statistical distribution (which models the hypothesis that they both are by the same author) can be tested using one or more “standard” statistical approaches such as chi-square. My experiments with random samples have shown that the probability that they both are by the same author is extremely small and thus quite unlikely.

    సారాంశం ఏమంటే, ఆముక్తమాల్యదని రాయలు రాసినా రాయకపోయినా పెద్దన మాత్రం రాయలేదని సశాస్త్రీయంగా నిక్కచ్చిగా నిర్ణయించొచ్చు (మనుచరిత్ర రాసింది పెద్దనే అనేది నిజమైతే).

« 1 ... 1136 1137 1138 1139 1140 ... 1583 »