Comment navigation


15823

« 1 ... 1134 1135 1136 1137 1138 ... 1583 »

  1. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి mOhana గారి అభిప్రాయం:

    07/06/2010 10:58 am

    మంచి వ్యాసము. ఆసక్తి ఉన్నవారికి ఇందులోని సూచికలు ఎంతో ఉపయోగపడుతాయి. సుమారు 70, 80 వ దశకాలలో “రాయన దినచరి” అనే ఒక రాయల డయరీని కన్నడములో కనుగొన్నారట. అందులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయని చదివాను. దానిని గురించిన పరిశోధన వివరాలను ఎవరైనా తెలిపితే బాగుంటుంది. ఈ పుస్తకాన్ని బహుశా రాయలు వ్రాయలేదు, కాని ఇందులోని సమాచారాలు చారిత్రక సత్యాలనే అంటారు.
    విధేయుడు – మోహన

  2. కృష్ణదేవరాయలు గురించి Madhav గారి అభిప్రాయం:

    07/06/2010 7:43 am

    అఫోన్సో ఆల్బూకర్కు – Afonso De Albuquerque

    దురాతీ బార్బోసా – Duarte Barbosa

    డొమింగో పేస్ – Domingo Paes (also – Domingos Paes)

    ఫెర్నావ్ న్యూనేజ్ Fernao Nunes (Nunez)

    మీకింకే పేర్ల వివరాలు కావాలన్నా దయచేసి అడగండి.

    మాధవ్

    Added: 1. tArikh-e-farishta is written by Mohammad Qasim Farishta and 2. Burhan’i Ma’asir written by Sayed Ali Tabatabai (?). Could find some info on web.

  3. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి రవి గారి అభిప్రాయం:

    07/06/2010 5:35 am

    కృష్ణదేవరాయ వైభవం అన్న పుస్తకం ఒకటి రాయల వారి మీద పలువురు ప్రముఖులు వ్యాసాల క్రోడీకరణగా వెలువడింది. ఈ రచనలో రాయల వారి సాహిత్య సేవ గురించే కాక, అప్పటి సామాజిక పరిస్థితుల గురించి, ప్రజల జీవన విధానం గురించి, ఆహారపు అలవాట్లు, రాయల వారి వంశ చరిత్ర, రాయలవారు తిరుపతికి ఇచ్చిన మాన్యాలు వీటి గురించి సంగ్రహంగా ఉన్నది. ఈ పుస్తక పరిచయం ఇక్కడ ఉన్నది.

  4. ప్రేమ కవితలు గురించి reddy గారి అభిప్రాయం:

    07/06/2010 2:58 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  5. ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    07/06/2010 2:40 am

    కొలిచాల ! మీ తెనుగు అనువాదం సరళంగా ఉంది. చదవడానికి అనువుగా ఉంది. ముఖ్యంగా మీ వాక్యాలు బాగున్నాయి. ఇకపోతే కృష్ణదేవుని తండ్రి అయిన [ తుళువ] నరసానాయకుని బహమనీ రాజు [ ఆదిల్షానా?? ] సంధికని పిలిపించి నరసానాయకుని అతని సేనానాయకులు అందరితోనూ కలిపి మొత్తం ఒక 70 మందిదాకా బీజాపూర్ లో తన కొలువులోనే దారుణంగా ఊచకోతకోసి చంపిన వైనాన్ని చరిత్ర చెపుతోంది. ఆదిల్ షా మీద కృష్ణరాయలకి ఉన్నది మామూలు పగ కాదు, తీవ్రమైన పగ. అందుకే అంత సాహసంగా అతడు రాయచూర్ ముట్టడిని చాలా risk తీసుకుని కూడా చేసి ఆదిల్ షా ని తరిమికొట్టాడు. కృష్ణరాయలు బతికి ఉన్నన్ని నాళ్ళూ మళ్ళీ ఆదిల్ షా తలెత్తలేదు. రాయలికి దొరక్కుండా దాక్కుని తప్పించుకుని తిరిగాడు.
    రాజు తానే పూనుకుని స్వయంగా శతృరాజుల కొలువుకి వెళ్ళడం [ తురకల మాటలని నమ్మి] లోని ప్రమాదపు పర్యవసానం ఎంతటిదో స్వయంగా తన జీవితంలోనే ఎరిగిన వాడు గనకే, కృష్ణరాయలు తాను స్వయంగా యుధ్ధంలో పాల్గొన్నప్పటికీ తన రాజనీతిలో ఈ రకమైన అభిప్రాయాన్ని చేర్చిఉంటాడు.

    రమ.

  6. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/05/2010 9:47 pm

    ఇక్కడ జరుగుతున్న వాదన సంగతి నాకు తెలీదు కానీ, వ్యాసం మాత్రం అద్భుతం. నాకు ఈ వ్యాసంలోని పద్యాలు ఎట్సెట్రా వల్ల అటెన్షన్ కాస్త దెబ్బతిన్నది కానీ, బుక్మార్క్ చేసి పెట్టుకుని, పద్య భాషను అర్థం చేస్కోదగ్గ తెలుగు నాకు తెలిశాక మళ్ళీ వచ్చి చదువుకుంటాను…సందేహం లేదు.

    ఇంతకీ, కన్నడ తమిళ భాషల్లో కూడా పద్యాలున్నవని ఇదే మొదటిసారి చూడ్డము! నేను పద్యకావ్యాలు తెలుగులో మాత్రమే ఉన్నాయేమో అనుకుంటూ ఉన్నా! 🙂

    అన్నట్లు, మళయాళ కవులెవరూ రాయల వారి దరిదాపుల్లో లేరా?
    మళయాళంలో కూడా పద్యాలు గట్రా రాసేవారా?

    వీరంతా ఛందస్సు కూడా వాడేవారా??
    [క్షమించాలి – ఇవన్నీ ప్రాథమిక సందేహాలే. కానీ, నాలాగే ఇవన్నీ తెలీని వారు ఏదో ఒక సమయంలో ఈమాటకి రావొచ్చు గా…అలాగే ఈ వ్యాఖ్య కూడానూ!]

  7. పసిఁడిపల్లకి గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:

    07/05/2010 9:39 pm

    ఈ ఖండికను నిశితంగా పరిశీలించి ఇందులోని కించిద్దోషాల నెత్తిచూపిన కామేశ్వరరావుగారికి నా కృతజ్ఞతలు. ఇట్టి సద్విమర్శలవల్ల రచయితకూ, పాఠకులకూ మేలే జరుగుతుందని నా అభిప్రాయము.
    1. పట్టః అనే సంస్కృతపదానికి పట్టు అనేది వైకృతరూపం. సిద్ధసమాసంలో ధవళపట్టాంబరంఅనే ఉండాలి. వ్రాతదోషంవల్ల ఇది పట్టంబరంగా దొరలింది.
    2. సీసపద్యంలో “కంఠీరవోజస్సు” అనేది అసాధువు. పద్యధారలో ఈ అసాధురూపం దొరలిపోయింది,నేను తిరిగి చూచుకొనలేదు. కామేశ్వరరావు సూచించినట్లుగా ఇది కంఠీరవౌజస్సనే ఉండాలి. ఇదిదోషంగా నేనంగీకరిస్తాను. వృద్ధిసంధినిగుఱించి మాట్లాడుతున్నాం గనుక, ఈ సంధికి అపవాదాలను కూడా ఇక్కడ పేర్కొంటాను. ఓతుః(పిల్లి), ఓష్ఠః శబ్దములకు సిద్ధసమాసంలో గుణ,వృద్ధిరూపాలు రెండూ వస్తాయి – ఉదా- స్థూలౌతుః,స్థూలోతుః, బిమ్బౌష్ఠః, బిమ్బోష్ఠః. అట్లాగే అక్ష+ఊహినీ అనేచోట గుణసంధికిమారుగా అక్షౌహిణీ అని వృద్ధి వస్తుంది. ఐతే ఆంధ్రభారతంలో అక్షోహిణీ అనే రూపంకూడ వాడబడింది. కాని సంస్కృతవైయాకరణుల ప్రకారం ఇది అసాధువు. ఇట్లాంటివే గుణసంధికి మరికొన్ని అపవాదాలున్నవి, వాని నన్నిటినీ నేనిక్కడ పేర్కొనడం లేదు.
    3. పై సీసపద్యంలోనే “కంఠీరవౌజస్సు”, “నళినజుతేజస్సు” అన్నచోట్ల క్షత్రియుడైన రాజుయొక్క ఓజస్సుకు (బలానికి – అంటే రాజు సింహబలుడని చెప్పడం), బ్రాహ్మణుడైన కవియొక్క బ్రహ్మవర్చస్సుకే ప్రాధాన్యంగాని, వారిని సింహంతోగాని, బ్రహ్మతోగాని ప్రత్యక్షంగా పోల్చడంలేదు. సింహ,నళినజపదాలు ఈ ఓజస్తేజస్సులకు పరోక్షాధారములు మాత్రమే. అందుచేత, ఈ రెండు సీసపాదాల ఉద్దేశ్యం రాజుయొక్క క్షాత్రతేజాన్ని, కవియొక్క బ్రహ్మతేజాన్ని ప్రకటించడమే కాని, రాజును సింహంతో, కవిని బ్రహ్మతో పోల్చడం కాదు. అందుచేత, ఇక్కడ వాడబడిన పదాలు ప్రకృతార్థప్రయోజనకారులుగా నున్నవనుటలో సందేహము లేదని నా అభిప్రాయము.

  8. కృష్ణదేవరాయలు గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/05/2010 9:34 pm

    ప్రతి చరిత్ర పుస్తకానికి ఇలా వాళ్ళు చెప్పిన మూలగ్రంథాల గురించి ఒక ముందుమాట రాస్తే ఎంత బాగుంటుందో!

    ఇంతకీ – ఒక చిన్న సూచన: ఈ పోర్చుగీసు వారి పేర్లు, పుస్తకాలు: వీటికి ఆంగ్ల స్పెల్లింగులు బ్రాకెట్ల లో ఇస్తే, మాకు వెదుక్కోడానికి సులభం అవుతుందేమో! (కష్టే ఫలీ! మీరే కనుక్కోవాలి! అంటారా?)

    [ఈ పేర్లన్నీ మిగతా వ్యాసాల్లో ఇంగ్లీషులో కూడా ఇవ్వడము, నేలటూరి ప్రకరణాన్ని ఏ మార్పులూ లేకుండా ప్రచురించడము – ఈ ఉద్దేశాలతో పోర్చుగీసు పేర్లు ఇంగ్లీషులో ఈ వ్యాసంలో ఇవ్వలేదు. సారీ. – సం.]

  9. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Sowmya గారి అభిప్రాయం:

    07/05/2010 9:24 pm

    మొత్తంగా ఒక్కసారి ఇన్ని విషయాలు బుర్రలోకి వెళ్ళేందుకు మొరాయిస్తున్నాయి కానీ, వ్యాసం వల్ల చాలా విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ గారు మరింత తరుచుగా ఈమాటలో రాయాలని ఆశిస్తున్నాను.

  10. 88 ఏళ్ళ యువకులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    07/05/2010 2:08 pm

    చాలా గొప్ప వ్యక్తులగురింఛి చెప్పారు. వీ కే మూర్తి గారిని కలిసినప్పుడు ఆయనలోనూ ఇదేలాంటి ఉత్సాహం , యవ్వనం చూసాను. కళను ప్రేమించే వాళ్ళందరూ ఇంతేనేమో , వయసు సోకని అమరేంద్రులలా బ్రతికేస్తారు .

« 1 ... 1134 1135 1136 1137 1138 ... 1583 »