కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి.
Category Archive: సంచికలు
రిక్షా లోంచి ఒక అమ్మాయి దిగింది. వాన ఎంత ఉధృతంగా ఉందంటే పరదా ఏమీ పని చెయ్యలేదు. ఆమె కూడా మొత్తం తడిసిపోయింది.
సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధపడుతున్నారు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.
ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు.
మమ్మీకి బోలెడు పనికదా! అయినా కథలు మమ్మీలు చెప్పరు. అమ్మమ్మలే చెప్తారు. నాక్కూడా మా అమ్మమ్మే చెప్పింది.
ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తాయి.
ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.
ప్రిన్స్‌టన్ లో విద్యార్ధి దశలోనే మన భార్గవ ఇటువంటి సంధి సూత్రాలని మరో పదమూడింటిని కనుక్కున్నాడు. కనిపెట్టటమే కాదు, గణిత శాస్త్ర రీత్యా ఈ సూత్రాలు ఎలా ఉద్భవించేయో కూడ రుజువుతో సహా చూపెట్టేడు. ఈ పని ఫలితంగా భార్గవకి పట్టా ఇవ్వటమే కాకుండా 28 ఏళ్ళ చిరుత ప్రాయానికే ఆచార్య పదవి (full professor) ఇచ్చి గౌరవించింది, ప్రిన్స్‌టన్.
సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో “బ్రహ్మవిద్య” కాదని నా ఉద్దేశం. శాస్త్రీయ సంగీతాన్ని కొంతవరకూ “డీ మిస్టిఫై” చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.
విక్రీడితము అంటే ఆట. శార్దూలవిక్రీడితము పులుల ఆట అయితే మత్తేభవిక్రీడితము మదించిన ఏనుగుల ఆట.
ఆధునిక యుగంలో అభినవంగా సంప్రదాయాన్ని సాహిత్యంలో స్థాపించిన యుగపురుషులలో ఒకరు ఇంగ్లీషు విశ్వనాథ, మరొకరు తెలుగు ఎలియట్.
ప్రేమిస్తున్నాడో లేడో
నిమిషం గడిచేలోగా
ఉపపత్తి కావాలి !
“ఈ మాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. ఈ వారాంతంలో జరుగుతున్న “ఆటా” సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో బహుమతి […]
గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది.
మరి ఇక దొర గారంటే అచ్చమైన ఇంగ్లీషు కదా మాట్లాడేది! దేవుడే దిగి వచ్చినట్లనిపించింది నాకు.
రహస్యం దాచలేని సంగతి అలాఉంచి, నువ్వుగింజ నానదు అనెందుకన్నారో, నాకు ఇప్పటికీ బోధపడలేదు.
ఈ చెట్టు రెమ్మల చివర్లలో పేలిన రంగుతూటాల్లా మొగ్గలు!