వద్దన్నా వదలని తన ఆలోచనల ప్రవాహం, చైతన్య స్రవంతి …
Category Archive: సంచికలు
హారములు నా కేలు
హారతులు నా మేను
పీయూష మీ మోవి
పొంద రా అంద రా
ఎప్పుడైతే భిక్షా పాత్ర త్యజించాలనుకుంటున్నాడో, తన ప్రియ సఖిని చేరుకోవాలనుకుంటున్నాడో, మనస్సుని ఇంటి దారి మళ్ళించాడో అప్పుడే నందుని ధైర్యం సన్నగిల్లింది.
“అమ్మా నేను బడికి పోతానే … అందరు పిలకాయల్లాగా నేను కూడా చదువుకుంటానే ”
ఈవ్యాసంలో నేను కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనవసరమా అనే వాదానికి తలపడడంలేదు. ఛందస్సులో వ్రాసిన సంప్రదాయకవులను భూషించడం లేదు, వ్రాయని వచనకవులను దూషించడం లేదు. కాని, సంస్కారవంతుడైన కవికి కవితావేశం కల్గినప్పుడు వెలువడే కవిత్వంలో ఛందస్సు స్వయంభువుగా – అంటే తనంతకు తానే – ఉద్భవిస్తుందని నిరూపించ దలచుకొన్నాను.
నిశి రాత్రి వర్షంలా
కరగనీ సంగీతాన్ని-
నాలుగు భుజాలూ కలవనీ
ఊగనీ ఈ చెట్లన్నీ-
చూరింట్లో నీరెండ
వాకట్లో నెలవంక.
సూర్యుడు మా అన్నయ్య
జాబిలి మా చెల్లి.
శ్రీరాముడు నదిలో సంధ్య వార్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!
బెబ్బుల్ని ఆవాహనచేసి మనసు నింపుకోడానికి
ఈ నవరాత్రుల రోజుల్లో పెద్దపులైపోడానికి
అన్ని చెప్పగల భాష
అక్కడే ఆగిపోయింది.
ఐదవ తెలుగు సాహితీ సదస్సు, హ్యూస్టన్ లో చదివిన కీలకోపన్యాసం –నూరు సంవత్సరాల క్రితం ప్రబంధ సాహిత్యంపై వచ్చిన విమర్శని స్థూలంగా పరిశీలించడం; ప్రస్తుతం వస్తున్న సాహిత్య విమర్శనలగురించి ముచ్చటించడం; ఈ విమర్శనా ధోరణుల వలన సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చిన, వస్తూన్న నష్టాలని గుర్తించడం, నా ముఖ్యోద్దేశం. ఈ పరిస్థితిని మార్చడానికి కావలసిన ప్రేరణ, తగిన శిక్షణల గురించి సాహితీపరులందరూ, ముఖ్యంగా diaspora సాహితీపరులందరూ ఆలోచించడం ఆవశ్యకం
శరీరానికతీతమైన స్వభావాన్ని వర్ణించటానికి శరీరాన్ని ప్రతీకగా తీసుకోవటంలోనే ఒక ప్రత్యేకత ఉంది.
సాహిత్యాభిమానులందరూ ఒక చోట చేరి వ్యక్తిగతంగా కలుసుకునేందుకు నిర్వాహకులు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు.
ఈ రకమైన సదస్సుల వలన మనం ఏవిటి సాధించాం? అని ప్రశ్నించుకోవడం తప్పు కాదనుకుంటాను.
వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్ళకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.
“జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశంలో 1950, 60 దశకాల్లో ప్రవహించటం మానేసింది. శుష్క నినాద […]
అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం.
అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.
ఈ సంచికలో విశేషాలు: భావ జానపద కవిత్వాల పై వెల్చేరు, పరుచూరి గార్ల వ్యాసం పాల్కురికిపై పరిశోధన చేసిన ఆచార్య పి. జ్యోతి గారి […]