కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.

” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత […]

అర్థాలతో పద్యాలు చెప్పీ చెప్పీ, లోకానికీ నిజానికీ మధ్య దూరం పెరిగిపోతోందన్న దశలో కొందరు కవులు ఆ భాషని బతికించడానికి ఇలాంటి పద్యాలు రాస్తారు. అంటే లోకంలో భాషని వాడడం మానేసి భాషలో మరో లోకాన్ని సృష్టిస్తారు. ఒకరకంగా ఈ పనే చేసారు పఠాభి.

పాఠకుల సూచన మేరకు అభిప్రాయాలన్నీ ఒకచోట చదవగలిగే వీలు కల్పిస్తున్నాము. ఎడమపక్క పైన ఉన్న “పాఠకుల అభిప్రాయాలు” మీద క్లిక్ చేస్తే, మే 2006 […]

ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని: ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా […]

ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.

ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.

ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.

ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’

చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!

ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.