గడి నుడి – 27 సమాధానాలు

అడ్డం

  1. విత్తము కానిది, జీవక్రియసంబంధి
    సమాధానం: పిత్తము
  2. అడపం పట్టిన ఆడది
    సమాధానం: అడప
  3. సొర
    సమాధానం: ఆనప
  4. మణులలో హీరోయే!
    సమాధానం: హీరము
  5. కీర్తిశేషుల స్మృతికి అర్పణం
    సమాధానం: నివాళి
  6. అర్ధమో!
    సమాధానం: సగమో
  7. కంకుడు వాటంగా ధరించిన పైపంచె
    సమాధానం: కండువా
  8. బార్లీ
    సమాధానం: యవ
  9. కొమ్మద్ది గ్రామం నుంచి పెన్నేరు దాటితేగానీ రాని యేరు
    సమాధానం: సగిలేరు
  10. భారీ మందుగుండు పరికరం
    సమాధానం: ఫిరంగి
  11. ఇంగ్లీషు కొన-గల సుల్తాను మొనగాడు
    సమాధానం: టిప్పు
  12. కన్నుపోయినంత ఎందుకు?
    సమాధానం: కాటుక
  13. విక్రమార్క సింహాసనపు విడ్డూరం
    సమాధానం: సాలభంజిక
  14. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పదవీయాత్రలు
    సమాధానం: పాదయాత్రలు
  15. పొడవు దండము
    సమాధానం: కోల
  16. చాట్ మసాలాతో ఏమిటీ గొడవ?
    సమాధానం: రగడ
  17. భుక్తి కోసం గ్రామంలో వెదకాలి కాబోలు!
    సమాధానం: గ్రాసం
  18. దక్షిణాయనంలో చివరి నెల
    సమాధానం: ధనుర్మాసం
  19. కుశుడి సోదరుడు
    సమాధానం: లవుడు
  20. తికమకపడ్డ ఐదో అవతారం
    సమాధానం: వానమ
  21. తాంబూలం
    సమాధానం: వక్కాకు
  22. 34 నిలువులో అక్షరం మారిన చెంప
    సమాధానం: చెక్కిలి
  23. ఇలాంటి బ్రహ్మచారులు, బెండకాయలు అందరికీ లోకువే
    సమాధానం: ముదిరిన
  24. బిడ్డ
    సమాధానం: వత్స
  25. ఇది ఎటుతిరిగినా ఒకటేనని కాబోలు దీన్ని తిప్పం అని గొప్పగా చెప్పుకుంటారు కొందరు
    సమాధానం: మడమ
  26. ఒక చెట్టు, ఒక శాస్త్రి
    సమాధానం: రావి
  27. పట్నవాసపు ఇల్లాళ్ళను విరహోత్కంఠితలుగా చేయగల వ్యక్తి
    సమాధానం: పనిమనిషి
  28. బంగారంగా మార్చే దిస వేరుపడింది
    సమాధానం: పరుసవేది
  29. 38 నిలువులాంటి అద్దం
    సమాధానం: మకురం
  30. ఔరా!
    సమాధానం: ఆహా
  31. మేం పోరాడుతాం అవ‌తార్‌సింగ్ పాష్‌!
    సమాధానం: లడేంగే
  32. గడినుడి పూరించేలోపల పదునెక్కేది
    సమాధానం: ఆలోచన
  33. డ్రమ్ముకోసం తిరుగుబాటు చేసిన పాపీ!
    సమాధానం: పీపా
  34. అన్నిటికీ విరోధభావం తెచ్చిపెట్టే ‘అ’ను మింగేసిన సముద్రం
    సమాధానం: కూపారం
  35. అలా వాలటం వల్ల చెదిరిన నుదురు
    సమాధానం: లలాటం
  36. ధరలు ‘మో’తమోగుతాయని పండించబోతే టపటపా పడిపోతాయి
    సమాధానం: టమోట
  37. పాతరోజుల్లో దీని బారిన పడి రాలక మిగిలినవారు అదృష్టవంతులు
    సమాధానం: కలరా
  38. ఎటునుంచి దూకినా ప్రమాదమే
    సమాధానం: కందకం
  39. చెలులతో బంధం కలిసిన అందం
    సమాధానం: చెలువం
  40. ఆకాశగంగ
    సమాధానం: మిన్నేరు

నిలువు

  1. కంపిలి నాడులో త్రిశూలం
    సమాధానం: పినాకం
  2. ఋషివాడ. ఈకాలంలో మనము వాటిని కనము
    సమాధానం: మునివాటిక
  3. అల్లుడు రామరాయలు
    సమాధానం: అళియ
  4. అడ్డం 7 లాంటిదే ఇంకొకటి
    సమాధానం: పచ్చ
  5. ఆడ స్వభావం గల మగవాడు
    సమాధానం: ఆడంగి
  6. అడ్డం 44లో ఆకురసం
    సమాధానం: పసరు
  7. నెత్తురు గడ్డకట్టని జన్యులోపం
    సమాధానం: హీమోఫిలియా
  8. కూరలో చేరే ముళ్ళచొక్కా
    సమాధానం: ముల్లంగి
  9. మగువా? శీర్షాసనమేసిన మాల్దీవుల నగరమా?
    సమాధానం: లేమా
  10. భంగం కాని తాళం
    సమాధానం: అభంగం
  11. చేదుకూరలో కాయ
    సమాధానం: కాకర
  12. పూజలందుకునే గ్రాము మసాల
    సమాధానం: సాలగ్రామము
  13. పాషాణుడు
    సమాధానం: కఠినుడు
  14. తీరం దగ్గర
    సమాధానం: దరి
  15. పిసినారి
    సమాధానం: లుబ్ధుడు
  16. బిళ్ళ బంట్రోతుల బెల్టు
    సమాధానం: డవాలి
  17. ఏటికి మొదలు
    సమాధానం: సంవత్సరాది
  18. తోకతెగిన కులమణి సర్దుకుంటే కావ్యనాయిక
    సమాధానం: లకుమ
  19. పొడవుగా పరచుకునే రంగుల చాప
    సమాధానం: చిరిచాప
  20. చపలంగా ఎగిరే బర్రెదూడ
    సమాధానం: చెలప
  21. సూర్యుడు దీని నోట్లో తల పెట్టినప్పుడే పెద్దపండగ
    సమాధానం: మకరం
  22. అవనిలో అడవి
    సమాధానం: వని
  23. కూర్చునే కాదు పడుకునీ నిలబడీ తలకిందులుగా కూడా వెయ్యొచ్చు
    సమాధానం: ఆసనం
  24. చాటేలా నీకు మాటేలా “ఓ రాఘవా”
    సమాధానం: మరుగేలరా
  25. పేరుకేమో గొప్పదే కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు
    సమాధానం: మహాకూటమి
  26. హలో! ఇక పద.
    సమాధానం: చలో
  27. కలపలో దాగిన ధనం
    సమాధానం: లపక
  28. అడ్డంకి
    సమాధానం: ఆటంకం
  29. చౌరస్తా
    సమాధానం: చదుకం
  30. వంటవాడి చేతి వంట పాడవకుండా కాపాడేది
    సమాధానం: పాటవం
  31. “… బంగారు చెంగావులు ధరించు, శృంగారవతి నారచీరెలూనె” అని పద్యభాగం
    సమాధానం: రంగారు
  32. అన్వర్ గారి కర-వాలము
    సమాధానం: కుంచె