గడి-నుడి 4 సమాధానాలు

అడ్డం

అడ్డం

  1. ముందుభాగాన చెదిరిన వరసా? (3)
    ఇంటి ముందుభాగం వసారా. దాన్ని వాడుకలో వసార అంటాం. ఆధారంలో ఇచ్చిన వరసా చెదిరి వసార అయింది.

  2. కుడియెడమైన ప్రయత్నం (3)
    ప్రయత్నం అంటే పూనిక (పూనుకోవడం). కుడియెడమైతే కనిపూ.

  3. ఒక నది తిరగబడితేనే సమభావం (3)
    నదిపేరు తమస. అది తిరగబడితే సమత అంటే సమభావం.

  4. దానమును కాక కాస్త సర్దుకుని దీనిని స్వీకరించడం ఉచితమే (3)
    “దానమునుకాక”లో చివరి మూడక్షరాలను సర్దితే కానుక అవుతుంది.

  5. ఏది ధర్మం, ఏదధర్మం? తేల్చుకోలేని విషమస్థితి (5)
    సమాధానం: ధర్మసంకటం
  6. ఊరికి ఉపకారం (5)
    సమాధానం: సమాజసేవ
  7. మట్టిపలక ఫ్రేము దీనితో చేస్తారు (3)
    సమాధానం: కలప
  8. కావ్యం ముక్కస్య ముక్కానువాదం గట్టిదైన చెర (3)
    ప్ర అంటే గట్టిది. బంధం అంటే చెర. కలిపితే ప్రబంధం అంటే కావ్యం.

  9. వసంతంలో మనవాలల్లె సరిగా పడితే మనోహరం (5)
    సమాధానం: మల్లెలవాన
  10. బేసరి కోసం పోయేది కాలిపోయి రూపుమారిన పులి ముక్కు కడకా? (5)
    “పులి ముక్కు కడకా”లో కా,లి అన్న అక్షరాలు తీసేసి, సర్దితే వచ్చేది ముక్కుపుడక, అంటే బేసరి.

  11. కక్షిదారు డాక్యుమెంటు తిప్పలుపడి అదనంగా సాగిన మానవతులకా? (6)
    “మానవతులకా”లో అదనంగా సాగవలసిన అక్షరం ‘న’. దాన్ని తిప్పలుపెడితే వచ్చేది వకాలతునామా. కక్షిదారు కోర్టులో తన తరపున వాదించడానికి లాయరును నియమించుకున్నట్లు ఇచ్చే ధృవపత్రం.

  12. అంచులో సాగిన అంచు మధ్యలో మోది అంగీకరించు (4)
    అంచులో అంటే మొదట్లో. అంచు అనే పదం మొదటి అక్షరం సాగితే ఆంచు. దాని మధ్యలో ‘మోది’ని చేరిస్తే ఆమోదించు అవుతుంది.

  13. వేదమంత్రాన్ని వత్తిపలికితే విశ్వాసం కలుగుతుంది (3)
    వేదమంత్రం నమకం. నమ్మకం అంటే విశ్వాసం.

  14. 18 నిలువును తలదన్నే గర్వం (3)
    సమాధానం: బడాయి

  15. అటునుంచి గురితప్పనివాడు (4)
    సమాధానం: గురికాడు
  16. దిక్పాలకులెందరు? (6)
    సమాధానం: ఎనమండుగురు
  17. వాటికాపతి సవరించిన పావన కలి (5)
    వాటిక అంటే తోట/వనం. వాటికాపతి అంటే వనపాలిక

  18. ముద్దగా ముడుచుకున్నా, రెక్కలు విప్పుకున్నా ఎర్రగా వెలిగే పువ్వులు (5)
    సమాధానం: మందారపూలు

  19. కోపానికిది నకలు కాదు (3)
    కనలు అంటే కోపం/కోపగించు

  20. ఇటునుంచి కాబట్టి అటునుంచి కూడా (3)
    సమాధానం: కనుక
  21. అస్తవ్యస్తంగా ఆవాలు మింగేసిన ఆనార జీవాలు మందంగా వినిపించే అందెలసవ్వడి (5)
    ‘ఆనారజీవాలుమందం’ మింగేసిన ఆవాలను తీసేస్తే మిగిలేది అస్తవ్యస్తంగా ఉన్న నారజీమందం (సమాధానంలో ఉన్నవి ఆరు అక్షరాలే కాబట్టి పక్కనే ఉన్న ‘గా’తో మనకు పనిలేదు). దాన్ని సరిచేస్తే వచ్చేది మంజీరనాదం.

  22. లోలలేని సంధిలో విలవిలా కొట్టుకోవడం తలరాత (5)
    సమాధానం: విధివిలాసం

  23. తన రథమున లిబ్బికోసం తలలు బయలు వెడలి (3)
    తల అంటే మొదటి అక్షరం. ఆధారంలోని మొదటి మూడు తలలు చేరిస్తే వచ్చేది తరలి.

  24. సన్నగా ఉన్నంత మాత్రాన చవట కాదు (3)
    సమాధానం: రివట
  25. నామ్‌కేవాస్తే మెత్తనివనిపించినా నిజానికి గట్టివే (3)
    అనూహ్యంగా చాలామందిని బోల్తాకొట్టించిన ఆధారం :-). నామ్ కే వాస్తే అన్నది సమాధానంలో హిందీ ప్రమేయాన్ని సూచిస్తుంది. ఆ సూచనను చాలామంది విస్మరించారు. హిందీలో నరమ్ అంటే మెత్తనిది. మెత్తనివనిపించేవి నరాలు.

  26. దేవతలకు సులభంగా అర్థమయ్యే గాడిద (3)
    దేవభాష సంస్కృతంలో గాడిదను గార్దభ అంటారు. కాబట్టి గార్దభం అన్నా వాళ్ళు సులభంగానే అర్థం చేసుకోగలరు.

నిలువు

  1. నరకాసురవధలో ప్రచ్ఛన్నంగా పాల్గొన్న అతని తల్లి (3)
    నరకాసురుని తల్లి భూదేవి. అంటే వసుధ. ఈ పేరులోని మూడు అక్షరాలూ ‘నరకాసురవధ’లోనే ఉన్నాయి.

  2. తోబుట్టువుల బంధం (5)
    సమాధానం: రక్తసంబంధం

  3. ఆటంకపరిచే దొంగవేషం (3)
    సమాధానం: కపటం
  4. పూసల రాలతో సర్దిన పుష్పహారాలతో (6)
    సమాధానం: పూలసరాలతో

  5. స్వాభావిక నవల ఓల్గా రచన (3)
    ‘సహజ’ ఓల్గా రాసిన ఒక నవల పేరు

  6. లకారం నకారమై కుదురుకున్న నవముల పోత మునీశ్వరులకు నెలవు (5)
    నకారమవడమంటే లేకపోవడం. ‘నవముల పోత’లో ల అనే అక్షరాన్ని తీసేస్తే మిగిలేది నవముపోత. ఆధారంలోని ‘కుదురుకున్న’ అన్న పదం ఏనగ్రామ్ సూచన.
  7. దీనితో వచ్చేది ఆకలేడుపు కాక మరేమిటి? (5)
    సమాధానం: కాలేకడుపు
  8. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు సోకని జిల్లా పూర్వనామం (3)
    సమాధానం: కడప
  9. ప్రథమ భవ్య వర్షము (3)
    ఇచ్చిన ఆధారానికి అర్థం మొదటి, శుభప్రదమైన సంవత్సరం అని. తెలుగు సంవత్సరాల్లో మొదటిది ప్రభవ. ఆధారంలో ఇచ్చిన మూడు పదాల మొదటి అక్షరాలను కలిపినా ఇదే సమాధానం వస్తుంది. ప్రథమ అన్నది దానికి సూచన.

  10. పెద్దపాము మెలితిరిగే మడుగు హానా? (5)
    సమాధానం: మహానాగుడు
  11. అందలేక మోగు అందనము సరియగునేని హసన్ముఖము (4)
    ‘మోగు అందనము’లో ‘అంద’ తీసేసి సర్దితే ‘నగుమోము’.

  12. గట్టిగా మోగనిది విలువైనది (3)
    కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?

  13. 23 అడ్డంతో వచ్చిన గొడవ (3)
    సమాధానం: లడాయి
  14. బొట్టనవేలికి దగ్గరి చుట్టం (5)
    చుట్టనవేలు అన్నది బొటనవేలి పక్కనున్న చూపుడువేలికి మరోపేరు.

  15. విదర్భ రాకుమార్తె మాత్రమే గుర్తుపట్టగలిగిన నిషధరాజు (3)
    విదర్భ రాకుమారి దమయంతి స్వయంవరంలో దేవతలు కూడా నలుడి వేషంలో వస్తే దమయంతి నలుడిని సరిగా గుర్తుపట్టగలుగుతుంది. ఆ నలుడు నిషధదేశపు రాజు.

  16. పరిపరి నామం ఒకపరి ఇలా మారడం సహజమే? (4)
    మారడం అంటే పరిణామం. ఆధారంలో ఉన్న పరినామం దీనికి homophone.

  17. బలము, సత్తువ, వడిలో మొదటి అడుగులు కూర్చిన తాత్త్వికుడు (3)
    మొదటి మూడు పదాల మొదటి అక్షరాలు కలిపితే వచ్చేది బసవ. కర్ణాటకలో భక్తి ఉద్యమకాలానికి చెందిన కవి, సంఘసంస్కర్త, తాత్త్వికుడు.

  18. పలుమారులు పలువిధాలుగ పనికొచ్చే గుడ్డముక్క (3)
    సమాధానం: రుమాలు
  19. మన దండ రణభూమిలో నేలను లాగే సర్దుబాటుతో ఉసురుతీయడం (6)
    మన దండ రణభూమిలో నేల(భూమి)ని లాగేస్తే మిగిలేది మనదండరణ. సర్దితే మరణదండన.
  20. వైకుంఠంలో ఎల్లెడల కపాలి ఆటుపోటులతో ఉన్నది (5)
    సమాధానం: పాలకడలి
  21. కథలు చిగురించే కొమ్మగా మారగల మంథా కరిజ (5)
    సమాధానం: కథమంజరి
  22. గాలి కవి డిగ్గున ఇలా అందరిలో కలిసిపోవడం పెద్ద మార్పే (5)
    సమాధానం: కలివిడిగా
  23. కత వినడానికి ఉత్సాహపడేవాళ్ళు కూడా ఇది వినడానికి వెనుకాడుతారు (3)
    సమాధానం: కవిత
  24. నూలు వడికేది (3)
    రాహట అంటే రాట్నం.

  25. మొదటే చిన్నబోయిన వీరులు సుకుమారులు (3)
    సమాధానం: విరులు
  26. రభసకు నిలువెల్లా సున్నాలు కొట్టి అక్రమంగా జరుపుకునే సంబరం (3)
    ఇక్కడ సున్నాలు అంటే అనుస్వారాలు.