అయితే కన్విన్స్ కండి, కాకపోండి. ఫరక్ కుచ్ భీ నహీ పడేగా. జరగాల్సింది ముందుగా వ్రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది కాదనడానికి మై కౌన్ హుఁ? ఇదంతా నా థియరీ అనబడు ఒక సత్య శోధన, స్ట్రయిట్‌గా సూటిగా తార్కికంగా మీ పిల్లల సృజనాత్మకతని మీ తెలీని తనంతో హత్య చేయనీయకుండా ఆపే ప్రయత్నం.

రోజు రోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను

ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం

కానీ గురూ, చూడు ఈ రచయిత వాక్యం తాజాగా ఉన్నది. శైలి భిన్నంగా మెరుస్తుంది. కథ ఎత్తుకున్న తీరు తీర్చిదిద్దిన తీరుగా కలదు. ఇతగాడిని చదివి నేను మహదానందపడ్డా. నా ఈ ఆనందం నీకూ పంచాలనుకుంటున్నా, రా, నువ్వూ సంబరపడుదువు కాని మిత్రమా. ఈ కథాసంకలనం పేరు ఆ నేల, ఆ నీరు, ఆ గాలి.

ముఠాతత్వం అన్నది విమర్శలో కూడ ఇప్పుడు కనిపిస్తోంది. ఒక్కొక్కసారి ఈనాటి కవులు, రచయితలు తమ విమర్శకులను తామే సృష్టించుకుంటున్నారేమో అన్న అనుమానం, తమపై విమర్శ (ప్రశంస) తామే రాయించుకుంటున్నారేమో అన్న అనుమానం కూడ సహజంగానే కలుగుతుంది. అది సత్యదూరం కూడ కాదు. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)

చామనచాయలో వుండే ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వుంటాయి. ఆ ఎరుపు కనపడకుండా నల్లకళ్ళద్దాలు కాపు కాస్తూ వుంటాయి. ఆయన పెదాలు మాడిన కెంపు రంగులో వుంటాయి. వాటిని పొగలుగక్కే సిగరెట్లు దాచి పెడుతుంటాయి. ఆయన వంటి మీద లాల్చీ షరాయిలు ఎప్పుడూ లేత మొగలి రేకుల్లా తళతళమంటుంటాయి.

కొవ్వొత్తి, అగ్గిపెట్టె తెచ్చినతను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముందుకు కదిలే ధైర్యం తనకు లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ పలాయనమంత్రం పఠించటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా, వాళ్ళు; వాళ్ళ రాకడతోనే వాళ్ళ వెనకే యాంత్రికంగా మూసుకుపోయిన గుమ్మం తలుపుల్తో యుద్ధం చేస్తున్నారు.

ఇక, నవలలో పరచిన వ్యవసాయ విజ్ఞానం కంటే, చివరిలో ప్రత్యక్షమయే ఆత్మీయ స్నేహం తీరు కంటే, నోస్టాల్జియా కంటే (ఎవరి నోస్టాల్జియా వారిదైనప్పటికీ బెంగటిల్లడం ఒకటే), రచయిత చెప్పే కర్మసిధ్ధాంతం కంటే, ముఖ్యంగా అందరూ ఈ నవలలో ప్రస్తుతం తఱచి తఱచి చూడాల్సింది రచయిత నిరూపించిన, ప్రకృతితో మమేకమయిన మన జాతి తాత్త్వికతనే.

ఈ చల్లటి గాలిలో
స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగనై
కొన్ని సార్లైనా
ఏ పందెపు గాలానికీ చిక్కకుండా
ఏమీ ఆలోచించకుండా
దేనికోసమో పరుగులెత్తకుండా
ఇలా వుండనీ

తెల్లని జాజుల గంధం మోస్తూ పిల్లగాలి
వయ్యారంగా ఊగిసలాడే వంగపూలు
ఊసులలో తేలిపోతూ నల్లటి హంసల జంట
హరివిల్లు పానుపు పవ్వళిస్తూ మేఘమాల

ధ్వని ప్రధానంగా తీసుకున్నంతసేపూ రేడియో సంగీత నాటకం బాగా వస్తుంది. కళ్ళు మూసుకున్నా సరే, శ్రోతకి కథ అంతా అర్థం కావాలి. పాత్ర స్వరూపం వాచకం ద్వారా, పాటద్వారా తెలియాలి. ఎక్కువ పాత్రలున్నా సరే, కథాకథనం ఆ దృశ్యం ద్వారా అవగతమవ్వాలి. ఆరుగురి గొంతులతో నూరుగురు గొంతుకుల ప్రభావం శాబ్దిక రూపంలో వినిపించవచ్చు.

భూమి నిద్రపోదు అంటారు. అయితే ఆకాశం మేలుకునుండదు. రాత్రివేళల్లో మేలుకుని పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది. దీపాలన్నీ ఆర్పేసి చీకటి మధ్యలో నిశబ్దంగా కూర్చుని చూసేప్పుడు నక్షత్రాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో మెరుపులూ, ఉరుముల శబ్దమూ ఆశ్చర్యంగా కిందనుండి పైకొస్తున్నట్టుగా ఉంటుంది.

నిజానికి వర్షం కురుస్తున్న భావం కావాలంటే చిన్న చిన్న చినుకుల జలతరంగిణి కిణికిణులకు తోడు ధారాపాతపు పొడుగాటి చినుకుల జల్లును సూచించే ఐదారు వయొలినుల ధనుర్వాదనం కావాలి. మేఘాలు గర్జిస్తున్నాయన్న భావం కావాలంటే అనుమంద్ర స్వరంలో మృదంగ స్వరతరంగిణి కావాలి.

నాలుగు గోడల మధ్యనేగాకుండా ప్రకృతి ఒడిలో, సాగర తీరంలో, జలపాతాల పొరుగున, పర్వతాల నడుమన కథకులను చేర్చి ఒకే కుటుంబంగా గడిపే అవకాశం కథా ఉత్సవం కలిగించింది. ‘శిబిరాలు, శిబిరాలు’ అని పదేపదేపదే వాపోయే సాహితీ ప్రియులకు చెప్పని సమాధానాలు ఈ కథా ఉత్సవాలు.

ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యేపని.

లలిత సంగీతం అనేదానికి ఓ కొత్త శైలిని, సరికొత్త రూపాన్ని సృష్టించినవారిలో రజనీకాంతరావు చాలా ముఖ్యులని చెప్పాలి. లలిత సంగీతమైనా మరే సంగీతమైనా శాస్త్రీయ సంగీతం అనబడే సంగీతంలో ఓ భాగమే. శాస్త్రీయ సంగీతంలోని కొన్ని లోపాలను సరిదిద్దితే అది లలిత సంగీతం అవుతుంది.

గడినుడి 18: ఈసారి గడువు తేదీలోపు ముగ్గురు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. 1. సుభద్ర 2. భమిడిపాటి సూర్యలక్ష్మి 3. ఆళ్ళ రామారావు. సరిచూపు సహాయంతో కరక్టుగా నింపిన మొదటి ముగ్గురు: 1. గిరిజా వారణాసి 2. పద్మిని 3. టి. చంద్రశేఖర రెడ్డి. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 18 సమాధానాలు, వివరణ.

రజని 1988లో ఆకాశవాణి వారికిచ్చిన ఈ ఇంటర్‌వ్యూ నా దృష్టిలో చాలా అపురూపమైనది. రజని సంగీత, సాహిత్య, వ్యక్తిగత వికాసాల గురించిన ఎన్నో వివరాలు వినవచ్చు. అంతకంటే, 1920-30ల నాటి తెలుగు సాహిత్య, సంగీత చరిత్రల గురించిన ఎంతో ఆసక్తికరమైన సమాచారం ఈ ఇంటర్‌వ్యూలో ఉంది.

ఇలాంటి ప్రయోగం ఇంతకూ ముందు, తరువాత కూడా ఎవరూ చేయలేదు. రామాయణ అవతరణ కథను వాద్యగోష్ఠిలో వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతో మొదలు పెట్టి కొన్ని ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. దీని సృజన లేక సృష్టి వెనుకనున్న కొన్ని వివరాలను రజనీకాంతరావుగారే (ఇంగ్లీషులో) వివరిస్తారు.

అన్నమయ్య సంకీర్తనలలోని రాగాల విశిష్టత పైన రజనీకాంతరావుగారు చేసిన ఈ ప్రసంగం 2000 సంవత్సరం ఆగస్టు నెల చివరిలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.