అడ్డం
- 2018కి…
సమాధానం: స్వాగతము - సభలో ఉద్యోగం
సమాధానం: కొలువు. ఈ పదానికి సభ, ఉద్యోగం అనే రెండర్థాలూ ఉన్నాయి. - వెనకనుండి చీలుస్తుంది
సమాధానం: ముకరదా. దారకము అంటే చీల్చేది అని అర్థం. - ప్రతిజ్ఞ చిట్టా
సమాధానం: పద్దు. ఈ పదానికి ప్రతిజ్ఞ, చిట్టా అనే రెండర్థాలూ ఉన్నాయి. - వెళ్ళడం వరకూ సరే, పొతే మళ్ళీ ఇక రానట్టే
సమాధానం: చని. చని అంటే వెళ్ళి, “చనిపొతే” ఇంకా రానట్టే కదా. - బాధ కలిగితే ఓర్చుకోవాలి భాయ్!<
సమాధానం: నిభాయించుకో - నాక్కొంచెం నమ్మకమిస్తే బామ్మను చూపిస్తా
సమాధానం: నానమ్మ. “నా”కు, “నమ్మకం”లో కొంచెం అంటే “నమ్మ” కలిపితే “నానమ్మ” - మిగతా ఆధారాలని పూరిస్తే ఇది కూడా పూర్తవుతుంది
సమాధానం: గడి - వెనకవారగా వచ్చి బంధించు
సమాధానం: ట్టుక - ఒక సహృదయుడు ప్రారంభించిన సాహితీప్రస్థానం, అది ఆపాత మధురం, భద్రం,
సమాధానం: నిర్వికల్ప సంగీతం. ఇది తెలియాలంటే ఈమాట చదువుతూ ఉండాలి! (నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం) - ఇలా కలుసుకొనే ప్రదేశం జరా చెప్పుండ్రి
సమాధానం: ఇలాక. ఇలాక అంటే తెలంగాణ వాడుకలో ప్రదేశం - ఈ గొడవకి అంతుపొంతూ లేదా?
సమాధానం: వివాద - సమంగా కనిపించడం లేదేమిటి?
సమాధానం: మసక - పడవ చరిత్రంతా సాగేది దీని మీదనే
సమాధానం: యమునానది. త్యాగరాజస్వామి ‘నౌకా చరితం’ అనే యక్షగానం అంతా యమునా నది పైనే సాగుతుంది. - కొత్తకోరికలు మత్తిల్లే చోటు కృష్ణశాస్త్రికి తెలుసు
సమాధానం: మది. “గదిలోన మదిలోన మత్తిలిన కొత్తకోరికలు” అని కృష్ణశాస్త్రి రాసిన “సిగలో అవి విరులో” అనే పాటలో వస్తుంది - ఎదో సరదాగా హాస్యమాడితే తిడతావెందుకు?
సమాధానం: జోకు. అచ్చతెలుగులో జోకు అంటే తిట్టడం. - వనమాలి, శూలి సరసన నిలిచేవాడు
సమాధానం: తమ్మిచూలి. అంటే బ్రహ్మ - 12 జనవరి 26న చేసేది
సమాధానం: కవాతు. 12 నిలువు భారత సైనిక దళం. అది జనవరి 26 రిపబ్లిక్ డే నాడు చేసేది కవాతు. - ఇప్పుడే చూస్తుంది
సమాధానం: ఈక్షణము. “ఈక్షణము” అంటే చూపు. “ఈ క్షణము” అంటే ఇప్పుడే
నిలువు
- కొంచెం సాగినంత మాత్రాన చప్పుడు చప్పుడు కాకుండా పోతుందా?
సమాధానం: స్వానము. స్వనము అన్నా స్వానము అన్నా శబ్దం అని అర్థం - ఒడ్డును తనలో కలిపేసుకున్న ఏరు
సమాధానం: తటిని. అంటే ఏరు. ‘తటి’ అంటే ఒడ్డు - తలకిందులుగా చెట్లకు వేళ్ళాడేవి
సమాధానం: లుతుకో - ప్రేమకు దరకాస్తు
సమాధానం: ముద్దు. “కాస్తందుకో దరకాస్తందుకో” అనే వేటూరి పాట గుర్తుకుతెచ్చుకోండి - కథ, నవల అనే ఎందుకు, పూలదండ అల్లికయినా కావచ్చు
సమాధానం: రచన. రచన అంటే అల్లిక, కూర్పు. - పచ్చని గుడిగర్భంలో పచ్చిపచ్చి కెంపులు – చెప్పుకోండి చూద్దాం
సమాధానం: దానిమ్మ. ఇదొక పొడుపు కథ - అయ్యో! పూర్తిగా గెలవలేకపోయావా?
సమాధానం: జయిం - పదవి మధ్యలో ఊడిపోతే పిడుగుపాటే కదా!
సమాధానం: పవి. అంటే పిడుగుపాటు - “Service before self” అని నినదించే మనసేన
సమాధానం: భారత సైనిక దళం. - ఇదే రోజున మొసళ్ళ పండగ సక్రమంగా జరుపుకుందాం
సమాధానం: మకర సంక్రమణము. “మకర” అంటే మొసలి. సాధారణంగా సంక్రాతి 14నే వస్తుంది - తాళి కట్టు శుభ వేళ.. వినిపించే తంతు
సమాధానం: మాంగల్యం తంతునానేన - కొండ ఒడ్డు
సమాధానం: గట్టు. అంటే కొండ, ఒడ్డు అనే రెండర్థాలూ ఉన్నాయి - బోర్లించిన అన్నం ముద్ద
సమాధానం: డిక - స్వప్నద్వయం చేసిన హళాహళి ఇంతాఅంతానా!
సమాధానం: కలకలము. హళాహళి అంటే కలకలం - 24 చేరితే మెట్లవరస కనిపిస్తుంది
సమాధానం: పడి. పడికట్టు అంటే మెట్లవరస అనే అర్థం ఉంది - తెలుగులో యే క్యా హయ్?
సమాధానం: ఇవి. హిందీలో “యే” అనే పదానికి “ఇవి” అని అర్థం ఉంది - జ్వాలాశిలావారి?
సమాధానం: లావా. అగ్ని శిలల నుండి వచ్చే ద్రవం - 19 చేరితే బద్ధమై ఉంటుంది
సమాధానం: కట్టు. కట్టుపడి అంటే బద్ధమై ఉండడం - పూజారి చేరితే ఆట, కులకర్ణి చేరితే సినిమా, బెనర్జీ చేరితే రాజకీయాలు
సమాధానం: మమత. - నేలను అడ్డదిడ్డంగా చదును చేసింది
సమాధానం: సదిమ్మి – దిమ్మిస అంటే నెల చదునుచేసే సాధనం - ఒక నెపాన్ని పెంచిపోషించడం సాధకునిలో కనిపిస్తుంది
సమాధానం: సాకు. సాకు అంటే నెపం, పెంచిపోషించడం అనే రెండర్థాలూ ఉన్నాయి. - YHWH
సమాధానం: యహోవా. మోసెస్ కి యహోవా అనే పేరు అచ్చులు లేకుండా, “YHWH” అని కనిపించిందని బైబిల్లో ఉంది - చక్రవర్తి నట్టనడుమన ఉండే కస్తూరీ తిలకం
సమాధానం: నాభి. ఈ పదానికి చక్రవర్తి, నట్టనడుమ, కస్తూరి, తిలకం అని అన్ని అర్థాలు ఉన్నాయి! - చూడాలని అంత కోరికా!
సమాధానం: దిదృక్ష. ద్రష్టుమ్ ఇచ్ఛా దిదృక్ష, అంటే చూడాలనే తీవ్రమైన కోరిక - 14 తర్వాత 15న వస్తుంది చూడు
సమాధానం: కనుము. సంక్రాంతి తర్వాత జనవరి 15 (సాధారణంగా) వచ్చే పండగ. కనుము అంటే చూడు అనే అర్థం కూడా ఉంది - కథా సంబంధమైన సంగతి ఏంజలీనాకు తెలుసు
సమాధానం: జోలి. అంటే కథ, సంగతి అని రెండర్థాలూ ఉన్నాయి