మూడువందల సంవత్సరాలకు పైగా సంఖ్యాగణిత శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఫెర్మా చివరి సిద్ధాంతాన్ని, బ్రిటన్కు చెందిన సర్ ఏండ్రూ వైల్స్ మొదట 1993లోనే రుజువు చేసినప్పటికీ, అందులో ఒక లొసుగు కానవచ్చింది. రిచర్డ్ టేలర్ సహకారంతో అందులోని లొసుగులు సవరించి తిరిగి 1995లో ప్రచురించి శాస్త్రప్రపంచాన్ని ఇప్పటికి పూర్తిగా ఒప్పించాడు. ఎన్నో ఏండ్ల అకుంఠిత దీక్షతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన వైల్స్ కృషికి ఫలితంగా గణితంలో నోబెల్ బహుమతితో సమానంగా గౌరవించబడే ఆబెల్ ప్రైజ్ ఈ ఏడాది ఆయనకు దక్కింది. ఈ సందర్భంగా ఎంతో క్లిష్టమైన ఆ సిద్ధాంతాన్ని, దాని నిరూపణ వెనుక ఉన్న కృషిని, చరిత్రనీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించే సాహసం చేసి కృతకృత్యులైన వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం – ఫెర్మా చివరి సిద్ధాంతం ఈసంచికలో; కేవలం సైన్స్ అభిమానులే కాక అందరూ చదవదగినది. ప్రొఫెసర్ వేమూరి కృషికి అభినందనలు.
ఈ సంచికలో:
- కథలు: నేటికెవరు మరి కథానాయకుడు – పూర్ణిమ తమ్మిరెడ్డి.
- కవితలు: ఎవరు చూడొచ్చేరు – కనకప్రసాద్; బోధిచెట్టులో సగంచెట్టు – అవినేని భాస్కర్; కాగితపు అద్దం – జ్యోత్స్నాఫణిజ.
- వ్యాసాలు: ఫెర్మా చివరి సిద్ధాంతం – వేమూరి వేంకటేశ్వరరావు; స్వాధీనపతిక, ప్రోషిత భర్తృక – తిరుమల కృష్ణదేశికాచార్యులు
- శీర్షికలు: నాకు నచ్చిన పద్యం-మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం – భైరవభట్ల కామేశ్వరరావు.
- శబ్దతరంగాలు: పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ = కనకప్రసాద్; అద్వయ వచనములాడు – కనకప్రసాద్, శ్రీవిద్య నారాయణన్; కరుణఁజూడు లలిత – కనకప్రసాద్, పుచ్చా శేషయ్య శాస్త్రి; కాలిదాస-మాలవికాగ్నిమిత్రమ్ – పరుచూరి శ్రీనివాస్.