రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నాతి చరామి

రచన: శ్రీనివాస్ కంచిభొట్ల
జనవరి 2009

పెల్లుబికిన వెల్లువగా
కట్టతెగిన ఆనందం
కడలి కెరటమై వచ్చి నను ముంచు వేళ
సరిగంగ ఆటలలొ
సరిజోడువై నిలిచి
మనసు బరువు సగము పంచుకొనిన వేళ

ఆ చిరునవ్వులో చెరిసగములై మనం
ఆ తుళ్ళింతలో రెండితలై మనం

గుండెలో చీకట్లు
దారులన్నీ మూసి
కంటిచూపుకు వెలుగు కప్పివేసిన వేళ
నవ్వు ప్రమిదను చిదిమి
చేయి ఊతగ చేసి
దారి పొడుగూ నువు తోడు నిలిచిన వేళ

ఆ బాట పాటలో పదం కలిపిన మనం
ఆ బ్రతుకు నడకలో పదములైన మనం

నీ కంట జారిన కన్నీటి బొట్టు
దోషిగా నను నిల్పి
నీ వాడి చూపు నను నిలదీయు వేళ
సిగ్గుతో వంగిన తలను నీ చూపులే
నను ప్రేమతో నిమిరి
తప్పు ఒప్పుల సద్దులెందుకన్న వేళ

జంటగా సమసి ఒకటైన మనం
ఆ ఒకటిలోనే జంటైన మనం

క్షణములావిరి చేయు
గ్రీష్మ తాపపు వేడి
నిప్పు సెగలై నన్ను రగిలించు వేళ
మంచు ముద్దులు జార్చు
శిశిర గాలిగ జుట్టి
ఉష్ణ శీతల నడుమ నన్నూపు వేళ

కురిసె తొలకరిలో తడిసి ముద్దై మనం
విరిసె హరివింటిలో వొదిగి వొంపై మనం

కాలము జార్చి పోయిన పరదాల మాటున
గతము వదలి వెళ్ళిన జ్ఞాపకాల అడుగున
నా అడుగుజాడల ప్రక్క నీవి కానని క్షణాన
నా పాదాలపై నువ్వు నిల్చున్న ఊసు
చెదురు మనసుకి చెప్పి ఊరడించిన వేళ
అడుగులొకటే మనవి గురుతులూ ఒకటే
మనమొక్కటే అంటు గుర్తు చేసిన వేళ

నా ఎదుట నీవుగా నీ ఎదుట నేనుగా ఒక్కటై మనమైన మనం
అడుగులో అడుగుగా ఒక్కటే అడుగుగా కలిసి నడిచే మనం

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    wb February 21, 2009 1:49 am

    మండు వేసవి మధ్యాహ్నప్పూట లేత కొబ్బరి బోండం తాగుతున్నట్టు… అల్లం, పచ్చి మిర్చీ, కొతిమీర వేసి దోరగా కాల్చిన వేడి వేడి పెసరట్టు కొబ్బరి పచ్చట్లో అద్దుకొని భోంచేసినట్టు… మంచు వెన్నెల్లో గోదారొడ్డున కూర్చుని అలల్తో ఆడుకునే చందమామను చూస్తూ మాగాయ పెరుగన్నం తిన్నట్టు… ఒక్క తెలుగు వాడూ మాత్రమే వ్రాయగలిగినట్టూ… రుచిగా, శుచిగా, చాలా చక్కగా వ్రాశారు. వేటురి గారి కలం జోరు, మీ పాట లాంటి కవితలో కొంచెం తొంగిచూసింది. ప్రేరణ కావచ్చు, లేపొతే… నాకు వేటూరి మీదున్న పిచ్చి కావచ్చు. విషయం ఏంటంటే, మీరిలా హ్యాపీగా సినిమా పాటలు వ్రాసేయొచ్చు. పొగడ్త కాదు. పచ్చి నిజం. సుబ్బరంగా దీన్నిలాగే తీసుకొని… వంశీ సినిమాలో ఇళయరాజా మ్యూజిక్ తో ఇరగదియ్యవచ్చు అన్నంత హాయిగా వుంది సార్ మీ రచన.

  2. 2
    Chandranaga srinivasa Rao Desu May 23, 2017 11:16 pm

    ఈ కవిత చాలా బాగుంది

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • తెరచాటు-వులు: 1. ఆదిన
  • తెరచాటు-వులు: 10. టక్కుటమార గజకర్ణ గోకర్ణ…
  • తెరచాటు-వులు: 11. జాటర్ డమాల్! (అంటే అర్థం లేదు అని అర్థం)
  • తెరచాటు-వులు: 2. రాజువయ్యా! మహరాజువయ్యా!
  • తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు!

ఇటువంటివే…

  1. నాతి నోట నువ్వు గింజ
  2. బందీ
  3. ఆగవే రజనీ! విభావరి!
  4. గడ్డిపూవు
  5. టేబుల్ పై చేతి వాచీ

జనవరి 2009 సంచికలో ...

  • ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా
  • అదృశ్య దృశ్యాలన్నీ…
  • ఈ మాసపు పాట
  • ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం
  • ఒఖడే
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం
  • కవి స్మైల్ గురించి మరొక్కసారి…
  • కవిరాజశిఖామణి
  • కొండ నుంచి కడలి దాకా
  • ఖాళీ సీసాలు
  • గడ్డిపూవు
  • జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం
  • టేబుల్ పై చేతి వాచీ
  • తెలుగు కవిత్వంలో ‘ఒఖడే’ స్మైల్
  • నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం
  • నాతి చరామి
  • పాఠం
  • పెంపకం
  • బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు
  • మనకు తెలియని మన త్యాగరాజు – 3
  • రచయితలు – ఎడిటర్లు
  • వానకు తడిసిన పువ్వొకటి
  • స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత
  • స్మైల్‌ – ఓ జ్ఞాపిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అదృశ్య దృశ్యాలన్నీ…
కొండ నుంచి కడలి దాకా

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.