మరోమజిలీకి ముందు
ఆ ఏటి ఒడ్డున
కాసేపు సేదదీరాం
సముద్రమంటే ఏంటో
చూపిస్తా రమ్మంటూ..
అలల గుడ్డతో
కడలి కళ్ళుకప్పి
ఏవో లోతుల్లోకి
తీసుకుపోయేవారు
రెండు తీరాల మధ్య
కవిత్వానికి మించిన
వారధి లేదని తెలిసింది
ఆయన్ని కలిసాకే
ఎన్నో అనుభవాలతో నిండిన
ఒక పుస్తకన్నిచ్చి
ఎవరున్నా లేకున్నా
చదువుకుంటూ ఉండమని
ఇక శెలవంటూ
ఆయన లేచారు
సంధ్య మసక వెలుగులో
మందహాసం
వలసపోతోంది
నిజంగానే…
( రిటైరై బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న ముకుంద రామా రావు గారికి….)