సాహిత్యం ఇష్టంగా చదివేవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండాలని లేదు. అక్కడొచ్చే లైకులన్నీ రీడర్స్‌వి అనుకోవడం మన భ్రమ. కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలంటే వారి అనుభూతులకి, వారుంటున్న కాలానికి సరిపడే రచనలు రావాలి. ఓ సామాన్య పాఠకుడిగా నేనైతే సీరియస్ కథనాలతో పాటు జీవితంలో సౌందర్యాన్ని, ప్రేమని, ఉత్సవాన్ని, ఆశావాదాన్ని ప్రకటించే రచనలు కూడా విరివిగా రావాలని కోరుకుంటాను.
శీర్షికలు సంచికలు
మన మొట్టమొదటి శ్వాస పుట్టిన వెంటనే గాలిని లోపలి పీల్చుకోవడంతో మొదలవుతుంది, చిట్టచివరి శ్వాస గాలిని బయటకి వదలడంతో అంతం అవుతుంది. ఈ మధ్య కాలంలో, ప్రతి రోజూ, సగటున, 22,000 సార్లు ఊపిరి పీల్చి వదలుతామని ఒక పనిలేని దివాకీర్తి లెక్క కట్టేడు.
మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది.
ఒక్కసారిగా ఊళల శబ్దం, ఉలిక్కిపడి నిద్రలేచా. ఎక్కడనుంచి వచ్చాయో తోడేళ్ళు అమీ చుట్టూ. అక్కడ అమ్మ, గొర్రెలు ఏమీ లేవు. అమీ వాటి వైపు చిత్రంగా చూస్తోంది. అమీ తల ఇంకా పెద్దదైంది. కళ్ళు నీలి రంగుతో వెలుగుతున్నాయి. అమీ ముఖంలో సన్నటి జలదరించే నవ్వు. క్రమంగా అది పెరిగిపోతోంది. నవ్వులా లేదు అది, తోడేలు ఊళలా ఉంది. చుట్టూ తోడేళ్ళు అమీతో పాటే ఊళలు పెడుతున్నాయి. వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి. తోడేళ్ళు నా వైపు తిరిగాయి.
సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చిన బింబిసార మహారాజు, ఆ రోజు గుర్రం దాని ఇష్టం వచ్చిన దారిలో తీసుకెళ్ళినపుడు ఊరు చివర శ్మశానం దగ్గిర తేలాడు. కాలుతున్న శవాలు ఏమీ లేవు కానీ తాను వచ్చినట్టు గమనించాడు కాబోలు ఎవరో అరుస్తున్నాడు, దగ్గిరకి రమ్మని. వెళ్ళి చూస్తే రెండు మూడు రోజుల క్రితం కొరత వేయబడిన ఎవరో నేరస్థుడు. ఆ మనిషి చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి ఉన్నాయి.
స్వామిజీ పరిచర్యకోసం ఈ రామస్వామిని ఉండమని చెప్పి ఇతర శిష్యపరమాణువులు తమ పనులమీద వెళ్ళిపోయారు. రామస్వామి ఆస్తిపరుడు; సద్గుణ సంపన్నుడు; అతిధి సత్కారాలు తెలిసినవాడు. అన్నీ ఉన్నయి. శని స్థానం ఎక్కడ? అన్న విషయం మీదనే అభిప్రాయ భేదం ఉంది. నోట్లో శని ఉందని కొందరంటే, కాదు చెవులో ఉంది అని మరికొందరు. రామస్వామికి చెముడు అని చెబితే తెలిసిన విషయం చెప్పటం ఎందుకు?’ అనే పాఠకులుండవచ్చు.
రహస్యాలన్నీ తెలిసినట్టు
కొండలన్నీ ఎక్కినట్టు
త్రోవంతా నడిచినట్టు
వాక్యాలు చదువుతుంటే
అసూయగా ఉంటుంది
ఏ ప్రయాణమూ లేని
అసంతుష్ట జీవితం అడ్డొస్తుంది
ఎలా ఎగరాలి భూమినుండి
ఓ ముసలి అల
తన కళ్ళను పారేసింది
గాలిపటంలోని మట్టి
కరగడం లేదు
ఎగిరే దారం ఒంటరేనా
ఆఖరిసారి మనవాడే మీవాణ్ణి
గుండేసి కాల్చి చంపేశాడు
మీవాడు దుర్మార్గుడు
మీవాడు పాపాత్ముడు
ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు,
ఎవరున్నారు, ఎవరు లేరు
అన్నీ ప్రశ్నలే!
అయినా
ఫోటోలు లేని
ఆల్బమ్‌లో చేరని ఎందరో
అప్పుడెప్పుడో ఆవిరైన అత్తరు
కురుస్తోందిపుడు ఆటవిడుపుగా
కడలి అంచున నించున్నా
ఉప్పగా, నీటి శ్లోకంలా
కంటిదొన్నె కంపనంతో
పోటెత్తిన పతనాశ్రువులు
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్
‘లెటర్స్ టు ది ఎడిటర్’ అనేది పత్రికలలో ఒక సంప్రదాయం. సంపాదకుడిని సంబోధిస్తూ వివరంగా వ్రాసే ఉత్తరాల ద్వారానే చక్కటి సాహిత్యచర్చ సాధ్యం అని నమ్మిన పాఠకుల కోరిక ప్రకారం ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ విభాగంలో ప్రచురించే ఉత్తరాల ద్వారా సంపాదకులతో నేరుగా ఒక సంభాషణ సాధ్యమవుతుంది.
యక్షగానం అనగానే కొంత సామాన్యజనులు నిత్యవ్యవహారంలో ఉపయోగించే పదజాలం రచనలో చేరడం సహజం అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేని సంగతి. రచనలో ఎక్కడా పేర్కొనబడకపోవడం వలన ఈ రచనకు కర్త ఎవరో తెలియదు. భాషను బట్టి, తాళపత్రప్రతిలోని వ్రాతను బట్టి కనీసం రెండు వందల సంవత్సరాల మునుపటి రచనగా దీనిని నేను భావిస్తున్నాను. అప్రకటితంగా నిలిచిపోదగ్గ రచనగా ఇది అనిపించదని ప్రగాఢంగా నమ్ముతూ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.
‘ఉపజ్ఞ’ ఈ పుస్తకానికే తలమానికమైన వ్యాసం. అందులో పదాల విన్యాసం, పన్ ప్రయోగాలు, శ్యామ్ ట్రేడ్‌మార్క్ హిందీ వరుసలు రచయిత మనోభావాలకు అద్దం పట్టి, ఆసక్తికరంగా చదివిస్తుంది. భరాగో తినిపించే సాహిత్య చిప్సూ గాసిప్సూ, కొకు జ్ఞాపకాలు…
‘మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?’ అని మిత్రులు, పాఠకులు అడిగితే నవ్వి ఉరుకోవటం, లేదా ఒక మొహమాటపు నవ్వు నవ్వి ‘అందుకే నేను కార్టూనిస్ట్’నని అని తప్పించుకోవటం పరిపాటే. నిజానికి ఇలాంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వటం కష్టమే. ఐడియాలు ఎప్పుడు, ఎలా బుర్రకి తడతాయో చెప్పటం నాకు కష్టమే.
అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండుతుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒకకన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది. అన్నీ సక్రమంగా అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు జరగటం కష్టమైన రోజుల్లో ఒకలోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన ప్రశ్నల లాంటి ప్రశ్న. ప్రతీవారికీ ఇబ్బంది కలిగించే ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ విలువలకు లోబడి జీవించాలి? ఏ ఆదర్శాలకు నిలబడుతూ జీవించాలి? ఎలాంటి వ్యక్తిగా జీవించాలి? దేని కోసం పాటుపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రతి మనిషికీ భిన్నంగా ఉంటాయి. ఆ జవాబులు ఏ మనిషికైనా వాళ్ళ మనసుల లోతులలోనుండే దొరకాలి, దొరుకుతాయి. ఈ రకమైన ఆత్మపరిశీలన చేసుకోని వ్యక్తి, సమాధానాలకై సంఘర్షణకు లోను కాని వ్యక్తి తనను తాను స్పష్టంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. తన పట్ల తనకే స్పష్టత లేని వ్యక్తికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా స్పష్టత ఉండదు. అటువంటి వ్యక్తిత్వంతో తన పట్ల తనకే లేని నిజాయితీ ప్రపంచం పట్ల చూపగల అవకాశమూ లేదు. ఎన్నో కోణాలనుంచి తనను తాను అర్థం చేసుకొని తన బలాలు, బలహీనతలు విచారించుకోలేని వ్యక్తి, ప్రపంచాన్ని కూడా అదే కురచ చూపుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతో సంక్లిష్టమైన మానవజీవితాన్ని, సామాజిక చలనాన్ని కేవలం కామెర్ల ఒంటికంటితోటే చూస్తాడు. తన చూపే నిజమని బుకాయించుకుంటాడు. మంచి చెడు అన్న ఒక అత్యంత బలహీనమైన కొలమానం మాత్రమే ఇటువంటి మనిషికి వాడటం తెలిసిన పనిముట్టు అవుతుంది, ఆ మంచి చెడు అన్నవాటి నిర్వచనాల పట్ల ఏమాత్రం స్పష్టత లేకున్నా, అవి స్వార్ధాన్ని, సందర్భాన్ని పట్టి మారుతునే ఉన్నా. వీటిని దాటిన ఆలోచన, ఆ ఆలోచనకు కావలసిన పరిశ్రమ, ఆ పరిశ్రమకు తోడు కావల్సిన సహానుభూతి, జీవితానుభవం ఇవేమీ ఈ తరహా మనుషుల నుండి ఆశించలేము. అందుకే, నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? అన్న ప్రశ్న జోలికి ఈ సమాజంలో అత్యధికులు ఎప్పుడూ పోరు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం నిర్ణయించిన నడతకు, నిర్దేశించిన విలువలకూ కట్టుబడి ఉండటంలో తృప్తిగా వుంటారు. సమూహంలో ఒకరుగా జీవిస్తారు. తోలుబొమ్మలలాగా సమాజం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. వారి వలన మార్పు, అభ్యుదయం ఉండదు. సమాజచైతన్యం ఉండదు. కానీ ఇవి లేనిదే మనిషికి మనుగడ లేదు, ముందడుగు లేదు. తార్కికమైన వివేచన విచక్షణలు ఒక సంపూర్ణజీవితానికి అవసరమని, ఆత్మపరిశీలన చేసుకోని బ్రతుకు బ్రతుకే కాదని ఎన్నో శతాబ్దాల మునుపే ప్రతిపాదించిన ఆ సోక్రటీస్ ప్రశ్నలు ఇప్పటికీ మనమధ్య సజీవంగా, ఒక అవసరంగా ఉండటానికి కారణం ఇదే. ఈ రకమైన పరిశీలన సమాజపు నడతకు లోబడినవారికి అనవసరం అనిపించవచ్చు. కాని, సమాజంలో మార్పు కోరేవారికి, అభ్యుదయాన్ని ఆశించేవారికి, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం కావడం అవసరం. సంగీతసాహిత్య చిత్రలేఖనాది కళలను అభ్యసించే కళాకారులకు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. తమకు సామాజిక బాధ్యత ఉన్నది అని నమ్మే తెలుగు రచయితలు ఈ రకమైన ప్రశ్నలతో తమను తాము పరిశీలించుకోవడం, తమ సాహిత్యాన్ని ఆ వివేచనతో సమీపించడం అత్యవసరం.