ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆ భాషలలోని మెలకువలు తెలియవు. లేకుంటే భాషాంతరానుసృజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్ధార్థ స్ఫూర్తిని కూడ కలుగజేస్తుంది. మూలగ్రంథం దీర్ఘంగా ఉన్నప్పుడు దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి. మూలంలోని పదాల్లో అర్థం అస్పష్టంగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్థం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్పడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి.
శీర్షికలు సంచికలు
కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ద్వీపం కార్ నికోబార్. అంతా సమతల ప్రదేశం. పరిణతిగల రహదారి వ్యవస్థ. ఎటు చూసినా బీచ్‌లు. ఆ మారుమూల ద్వీపాలలో మనుషుల్ని ఆకర్షించి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోమని ప్రేరణ కలిగించే శక్తీ వనరులూ కలది కార్ నికోబారే.
ఈ వాస్తవ సంఘటనల సమాహారం, ఒక పెద్ద మాప్‌ని దగ్గర పెట్టుకుని, ఒకే సమయంలో వేరు వేరు చోట్ల జరిగిన సంఘటనలు, వాటి మధ్య ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉన్న కారణాకారణ సంబంధం గురించి తెలుసుకున్నట్లు ఉంటుంది. ఇది ఒక దేశచరిత్ర కాదు; మానవుల మనుగడ చరిత్ర.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు: 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.
ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం”కు 2026 సంవత్సరానికిగాను ఇరువురు రచయితలను ఎంపిక చేశాము.
ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దాలు తెలుగు జాతికి, సాహిత్యానికి ఒక నూతన శకానికి నాంది పలికిన చారిత్రక సంధియుగం. అప్పటివరకు రాజులు, జమీందారుల ప్రాపకంలో […]
రావిపాటి త్రిపురాంతకుడు మొత్తం ఐదు విశిష్ట గ్రంథాలను ఉదాహరణము, శతకము, తారావళి, శాస్త్రకావ్యము, వీథి అన్న అయిదు విభిన్న ప్రక్రియలలో రచించినట్లు సాహితీవేత్తలు భావిస్తున్నారు.
క్వాంటం ఆవిష్కరణే ఇరవయ్యో శతాబ్దపు భౌతికశాస్త్ర పరిశోధనలన్నింటికీ మూలపునాదిగా మారి, దాని పరిణామాన్ని పూర్తిగా శాసిస్తూ వచ్చింది. ఈ ఆవిష్కరణే లేకపోతే అణువులు, పరమాణువులు, వాటి రూపాంతరాలను నియంత్రించే శక్తి ప్రక్రియల గురించిన ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని నిర్మించడం సాధ్యమయ్యేదే కాదు.
వట్టి కలయని భావించి వనజ నేత్ర
చూడరాదని యనుకొని చూచి సీత
భయము నొందుచు మదిలోన భ్రాంతి తోడ
మరల మతిదప్పి నేలపై మహిజ కూలె!
ఓ బోర్డు మీద తప్పు రాస్తే చెరిపేసుకోవచ్చు, ఓ కాగితం మీదైతే చింపేసుకోవచ్చు. కానీ ఓ మనసు మీద తప్పు రాసుకుంటే?
ప్రాణంలేని యంత్రాలతో నింపిన కాంక్రీటు కీకారణ్యం
కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం
స్మార్ట్ ఫోన్ తెరపై వెచ్చదనం వెతుక్కునే
అస్థిపంజరం!
నెలపొడుపు ముంగిట్లో
మసకల పొద్దు
వెదురు బొంగురు గొంతు తీపిసడి సోకి
రిక్కిన వీనుల నూగు
గతంలో నాలో ఏముండేదో..
ఇప్పుడది లేని శూన్య స్థానాన్ని
శబ్ద రాహిత్యం అల్లుకుంది
ప్రేమ రాహిత్యం పట్టుకుంది
రిక్త చైతన్యం చుట్టుకుంది
తమిళ మూలంతో పాటుగా అవినేని భాస్కర్ అందించిన సంయుక్త మాయ కవితల తెలుగు అనువాదాలు. కాశీ నగరపు వీధులు, గంగానది అలలపై సాగే జీవితపు లోతులను ఈ కవితలు అన్వేషిస్తాయి.
ఇప్పటికీ ఒక నరం ఇంకా ప్లెక్ట్రమ్ కోసం
ఎదురు చూస్తూ ఆవిరినాపుకుంటూ
ఇప్పుడే ఒక తార తెగి ఆకసానికెగిసి టాటా కొడుతూ
కమాను రజను తగిలి ఖస్సుమన్న వయొలిన్
‘స్థితం’ కోరిక, ఒంటరితనం, అనుబంధం, జీవితపు అన్వేషణల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా ఆవిష్కరించే ఒక తాత్త్విక కథ. ఈ కథకు మూలస్తంభం అస్తిత్వపు ఆందోళన. కథానాయిక తన చుట్టూ ఉన్న సమాజం, సమాజం వేసే అంచనాలు, చివరికి తననుండి కూడా తాను పరాయీకరణకు గురైనట్లు భావిస్తుంది.
కావ్యాన్ని రచించే కవి అన్ని విధాలా రసానికి లోబడియే ఉండాలి. ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనబడ్డప్పుడు ఆ స్థితిని భంగం చేసి అయినా సరే రసానుగుణంగా వేరే కథను సృజించాలి. కవి కేవలం ఇతివృత్తాన్ని నిర్వహిస్తే, అందువల్ల ఏ ప్రయోజనం కలగదు. నన్నయ భట్టారకుడు భారతమును రసనిర్భరమై ధ్వనివిలసితముగా తీర్చిదిద్దెను.
శాంతం పాపం! శాంతం పాపం! రాక్షసులకన్నా తమరే క్రూరులు. ఎందుకంటే,
లక్కయింటిలో నిద్రిస్తున్న అన్నదమ్ములను నిశాచరులు కాల్చనే కాల్చరు. వదిన తలను ఆవిధంగా తాకరు గాక తాకరు. యుద్ధంలో కొడుకును చంపాలన్న ఆలోచన కూడా రాదు వారికి. వికారశరీరులు, ఘోరవర్తనులూ అయినా కరుణను మాత్రం విడిచిపెట్టలేదు వారు.
హైడెగర్ ప్రధానగ్రంథం పేరు, “Being and Time”. Da-sein దేశాన్ని చెబుతోంది. ఈ కల్పితపదం, మనిషి దేశకాలాలకు అతీతమైన తత్త్వం కాడని, మనిషి సక్రియుడని, తన కర్మలచే తనను తాను నిర్మించుకుంటాడని, “బతకడం” మనిషి “ధర్మ”మని, (తత్త్వం కాదని) చెబుతుంది. ఇది హైడెగర్ పదప్రయోగము, అనువాదభాషావిషయము.