రాజుగారి ప్రస్తుత పరిస్థితికీ ఈ నడింపిల్లోరి టెంకబాబుకీ ఏదో మెలికుంది. ఏంటదీ? టెంక మాటెత్తితేనే ఈయన ఉలుకులికిపడుతున్నారు. టెంకగారేమో అస్సలు ఏమీ తెలనట్టే వుంటాడు. ఆ బాబు కూడా చాలా మంచోడు. అందరితో కలివిడిగా వుంటూ ఊరికేదో ఉపకారం చేద్దాం అనే బాపతే తప్ప అల్లరి చిల్లర రకం కూడా కాదు. అసలేమై వుంటది?
శీర్షికలు సంచికలు
మలుపులన్నీ తిరిగి తిరిగి
మన కథ కంచికెళ్ళిపోతుంది
నా నుంచి నీ వైపుకు వెళ్ళే దారి
ఒకే ఒక ఉత్తరం ముక్కకీ
ఓ సంక్షిప్త వాక్యానికీ మాత్రం తావుంచి
పూర్తిగా మూసివేయబడుతుంది
రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు. టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ. ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్ధం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది. కోపంతో శ్రీధర్ అన్నయ్య యామిని మీద చేయి చేసుకోలేదు కదా?
…పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో…
సురపురం చదివితే ఒక అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. తనమీద తనకు నమ్మకం ఉన్న మనిషి, తనతోనూ పరిసర ప్రపంచంతోనూ సామరస్యం సాధించిన మనిషి– ఎన్ని గొప్ప పనులూ సాహసాలూ చెయ్యగలడో స్పష్టమవుతుంది. కీర్తీ, జీతభత్యాలూ తనకు అందకపోయినా అలాంటి నిరాశల గురించి యథాలాపంగా, నిర్లిప్తంగా చెప్పే ఒక స్థితప్రజ్ఞత ఆయన జీవనసూత్రం.
నా చిన్ని పెరటిలో పూసిన పువ్వులు
చూడలేదని నిన్ను నిష్టూరమాడాను
నువ్వు నడచి వచ్చిన అడవి ఆరోజున చూశాక
ఎంతటి సిగ్గుతో ముడుచుకుపోయాను
నా అల్పత్వాన్ని చూసి ఎంత నొచ్చుకున్నావో గదా!
తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి చాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు చాయ అనలేము. ఇలాంటి మేనిచాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు అని చెప్తే మీకు అర్థం అవుతుంది.
ఏ కథనయినా సరిగా అనుసరించాలంటే కథలోని ప్రధానపాత్రల ప్రాథమిక పరిచయం అవసరం. ప్రాథమిక పరిచయం అంటే పేరు ఒకటే కాదు. దానికన్నా ముఖ్యం ‘నేను’ కి చెందిన ఇతర వివరాలు. ప్రథమపురుష కథనంలో ఈ వివరాలన్నీ కథలో ప్రధానపాత్రలు ప్రవేశించినప్పుడో, ఆ తర్వాత కొద్దిసేపటికో సందర్భానుసారంగా తెలుస్తాయి. ఈ పాత్రల్తో పోలిస్తే ఉత్తమపురుషలో కథలో ప్రధానపాత్ర అయిన ‘నేను’ పూర్తిగా భిన్నమయినది.
ఆ పాట
దూరంగా కొండ కొమ్మున
వినిపిస్తుంది
ఎందుకంటే
ఆ పంజరపు పక్షి
స్వేచ్ఛను గురించి పాడుతుంది మరి
పాపులర్ రచనలను పట్టించుకోవడం అనేది చాలామంది మంచి విమర్శకులు సైతం విస్మరిస్తున్న పని. ‘సాధారణ పాఠకుడి’ పఠన రీతుల్ని మలచగల శక్తి, మలచాల్సిన బాధ్యత విమర్శకున్నాయి. ఈ పనిని చేసిన వాళ్ళు కొద్దిమందే, కొడవటిగంటి కుటుంబరావుగారి వంటి వాళ్ళు. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో మూడవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది.
గడినుడి 16కు ఈసారి గడువు తేదీలోపు ఎవ్వరూ సరైన సమాధానాలు పంపలేదు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల 2. హరిణి దిగుమర్తి. 3. సతీశ్ 4. భమిడిపాటి సూర్యలక్ష్మి 5. మంథా వీరభద్రం. వీరికి మా అభినందనలు.
అడ్డం బలం విశేషంగా బోల్తాపడి జాగుకు కారణమైంది సమాధానం: విలంబ. విలంబ(ము) అంటే ఆలస్యం లేదా జాగు. విలంబ అనగ్రామ్. సవరణ చేస్తే చక్కనౌతుంది […]
భారతీయ చిత్రకళ ఆధునికతా స్వరూపాన్ని మార్చిన వ్యక్తిగా, భిన్న సంస్కృతులు కలిసిన అనుభవంతో తనదే అయిన పంథా పాటించిన అసమాన కళాకారిణిగా, ఒక స్వేచ్ఛాజీవిగా, ఇండియన్ ఫ్రిదా కాలో అని అభివర్ణింపబడిన అమృత షెర్-గిల్ (1913-41) చిత్రకళాభిమానులకు చిరపరిచితమే. యూరోపియన్ ఆధునిక పద్ధతులతో, గొగేన్, మొదిల్యాని తదితరుల ప్రభావంలో పారిస్ కళావాతావరణంలో మెరుగులు దిద్దుకున్న అమృత చిత్రకళ ఆపైన అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రాలు, మొఘలాయి మినియేచర్లు, దాక్షిణాత్య చిత్రశిల్పాలు, ఫ్రెస్కోలు, తదితర దేశీయ చిత్రకళలను లోతుగా ఆకళింపు చేసుకుని తనదయిన ఒక వినూత్న పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటికి ప్రాభవంలో ఉన్న బెంగాల్ ఆర్ట్ స్కూల్ నీటిరంగు పద్ధతులను విమర్శించింది. భారతీయ సమాజాన్ని అత్యంత సమర్థంగా తైలవర్ణాలలో ప్రదర్శించింది. ఒక సుడిగాలిలా భారతీయ చిత్రకళాలోకంలో ప్రభంజనం సృష్టించి, మూడుపదుల వయసు కూడా రాకుండానే మాయమై పోయినా, అమృత చూపించిన దారి మాత్రం అజరామరమై నిలిచింది. జనవరి 30 అమృత షెర్-గిల్ జన్మదినం. ఆ సందర్భంగా ఈ సంచికలో అమృత స్వీయచిత్రాల గురించి ఆర్ట్ హిస్టోరియన్ రాఖీ బలరామ్ విశ్లేషణ; తల్లావఝ్జుల శివాజీ అమృతాస్మృతివచనం; ఈ సంచిక నుండీ ఆర్టిస్ట్ అన్వర్ ‘బొమ్మల పాఠాలు దిద్దుకునే’ తనకు తాను చెప్పుకునే సిలబస్ గురించి మనకూ చెప్తున్నారు; శబ్దతరంగాలలో సంజీవదేవ్, మో రేడియో ప్రసంగాలు అందిస్తున్నారు పరుచూరి శ్రీనివాస్; ఇంకా, గడి, కథలూ, కవితలూ…
పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.
లైన్ డ్రాయింగ్ ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? రేఖ ఎంత అద్భుతమైన భాషో తెలుసా? ఒక వస్తువును అది అర్థం చేసుకున్నంతగా మరే కళ ఈ ప్రపంచాన్ని చూడలేదు. వాస్తవాన్ని చప్పున గాలికూదేసి రేఖ చేసే మహా మాయే లైన్ డ్రాయింగ్. రేఖ అనేదేదీ లేని ఈ వస్తు ప్రపంచంలో అది మనం ఉందనుకున్న మరో కొత్త లోకాన్ని సృష్టించింది.
అలా పరవశించిన తిరుగుడులో అజంతా, ఎల్లోరా, తంజావూరు, మహాబలిపురం, పట్టడకల్ చిత్ర శిల్పాలు, కంచు శిల్పాలు, తాళపత్ర చిత్రాలు, దక్షిణాది ఫ్రెస్కోల్లోని ఆకుపచ్చ, నీలి, ముదురు పసుపు, చామనచాయల్లో అందగత్తెలయిన దేవతలలో చూసింది పౌరాణిక దృశ్యాల్లో ఆధునిక రేఖల వొంపుల విన్యాసాలను, చైతన్యం తొణికిసలాడే లయనీ!
కొన్ని ప్రశ్నలూ జవాబులూ అవుతూండగానే ఆకర్షణ వల్ల ఒంట్లో విద్యుత్తు, దాన్నుంచి చెంపల్లో వేడి, కళ్ళలో మెరుపులు, పెదాల మీద నవ్వులూ. కొన్ని మాటల్లో తెలిసీ, కొన్ని మాటల్లేకుండానూ. చేతులు పట్టుకుని నడకలు, అర్థాలతో బరువెక్కిన మాటలు, ఊహలతో మత్తెక్కిన కళ్ళూ, కొన్ని ‘మిస్ యూ’లూ చేతికి అందేంత దూరంలో ఆశగా. మరికొంత దూరంలో ఒళ్ళు విరిచే ఉద్రేకాలూ బిగి కౌగిలింతలూ తడి ముద్దులూ.
తెరల సంగతి సరే, మరి నేను?
నేనా?
నేనొక ముద్దగన్నేరు పువ్వును!
ఇటువైపు వచ్చినవాళ్ళు
సీతాకోకలై సేదతీరుతారో,
పిచ్చుకలై పీక్కుతింటారో ఎవరికి తెలుసు?