ఆవేళ, క్రీడామైదానంలో ఉండుండి వినిపించే ఆర్భాటం ఆకాశాన్ని ముట్టడించినట్టు, ఆ పిలుపు నా మనోవీధిలో మోగింది. చల్లటి జలపాతం తలని తొలిచేస్తున్న ఆ సమయంలోనే, నరాలలో వేడినీళ్ళు ఎక్కించినట్టు రక్తం వెచ్చబడుతూ… ఆ నిముషం గడిచిపోకుండా నా మదిలో నిలిచిపోవాలని ప్రార్థించాను. పొత్రాల్లాంటి వృషణాలున్న మంచి కోడెగిత్త రంకెలాంటి ఆ పిలుపు విన్న తర్వాత, నా మనోవీధిలో అగుపించిన దృశ్యాలు… వాటిని వివరించడం అతి కష్టం.

నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు.

పగవారి కుట్రో
బంధువుల గూడుపుఠాణో
రాజ్యభారం కోల్పోయి
బికారిలా తిరగసాగాడు రాజు
రాజభోగాలు పోయాయని చింతలేదు

వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు

కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.

ఈ మనుషులకి శవపేటికమీద ఉంచిన తాటాకుకు అర్థమే తెలియదనుకోవాలా? అది వారికేమీ కాదని అనుకుంటున్నారా? చనిపోయిన వ్యక్తి తన ఊరికోసం తిరిగివచ్చాడని వీళ్ళకెవరికీ తెలియడం లేదా? హార్వీ మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపోతే ఈ ఊరి పేరు ఎవరికి తెలిసేది? ఈ ఊరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులోనో సమాధి అయిపోయి ఉండేది.

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.

కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

భూమి నిద్రపోదు అంటారు. అయితే ఆకాశం మేలుకునుండదు. రాత్రివేళల్లో మేలుకుని పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది. దీపాలన్నీ ఆర్పేసి చీకటి మధ్యలో నిశబ్దంగా కూర్చుని చూసేప్పుడు నక్షత్రాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో మెరుపులూ, ఉరుముల శబ్దమూ ఆశ్చర్యంగా కిందనుండి పైకొస్తున్నట్టుగా ఉంటుంది.

లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను.

తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి చాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు చాయ అనలేము. ఇలాంటి మేనిచాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు అని చెప్తే మీకు అర్థం అవుతుంది.

పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.

అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చిపెట్టుకుంటూ ‘తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ; కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మనీ’ ప్రాధేయపడ్డాడు.

నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.

ఆ రోజుల్లో, కళ కళ కోసమే అని వాదించే అబ్సర్డిస్టులు, నాటకాన్ని సాంఘిక, రాజకీయ మార్పుకి వేదిక కావాలని వాదించే బ్రెఖ్టియన్ల మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా నడిచేవి. కెనెత్ టైనన్ అబ్సర్వర్ పత్రిక నడిపేవాడు. అతను ఉద్యమకారుల పక్షాన, ఐనెస్కో కళాకారుల పక్షాన ఉండేవారు. ఐనెస్కో కళాకారుల కవిత్వకాల్పనికతను సమర్థించేవాడు. మొదటినుంచి ఐనెస్కోనే నా హీరో.

నిన్ను చూసి అరుస్తుందీ లోకం
అన్నా! వదలకు ఆత్మస్థైర్యం
రెండు నాలుకల బుసకొడుతుందది
గుండె దిటవుచెయ్ తమ్మీ! బెదరకు
రెండు మాటలీ లోకం పోకడ
విచిత్రమైనది భాయ్, తెలుసుకో!

ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్‌-స్వాతంత్రము ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత.

“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను.”