నా జాడ నేను కోల్పోయాను
నా పరిచయ వాక్యం నన్ను వెతుక్కుంటోంది
పరచుకున్న రస్తాలు
తప్పిపోయిన నా అడుగుల కోసం నిరీక్షిస్తున్నాయి
అనాథగా నా నీడ

జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.

ఈ “శిలాలోలిత” అనుభూతి, నాది. ఈ “శిలాలోలిత” హృదయం, నాది. ఈ “శిలాలోలిత” గొంతు, నాది కాకపోవచ్చు. ఈ “శిలాలోలిత” భావాలు, నావి కాకపోవచ్చు. […]

నేనెవరినో మీకెవరికీ తెలియదు ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు […]

మరో శిశువు పుట్టగొడుగులా మొలుచుకొచ్చింది ఈ పొగలోకి ఈ చీకట్లోకి ఈ బొగ్గులోకి ఈ మసిలోకి ఈ బురదలోకి ఈ పేడలోకి ఈ మురికిలోకి […]

ఈ రైలు ఆ ఊరెడుతోంది రైల్లో కూచునున్న నేనూ ఆ ఊరే వెడుతున్నానా ఈ రైలుపెట్టెలో అటునుంచిటుకి పాకే ఆ చీమ ఎటెడుతున్నట్లు ఈ […]