జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది

అప్పుడప్పుడూ
నీ ఉత్తరాల్లో సువాసనలు
అక్షరాలౌతాయి.

లోతులేకపోవటం క్రమక్రమంగా అలవాటైపోతుంది. తడిసీ తడవని పాదాలతో నడక సాగిపోతుంది. నాలుగో పరిమాణం దాకా సాగిన ఒకప్పటి ఆలోచన రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది. […]