పొడవాటి కాలేజీ కారిడార్లలో
ఈ పాటతో మొదలైన పరిచయాలు, పదిలపడ్ద ఇష్టాలు
చీకటి ఒంటరి వేళల్లో ఈ పాటనెక్కి
చేసిన పాలపుంతల ప్రయాణాలు
ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు
నిషిగంధ
నిషిగంధ రచనలు
దారి అలవాటైనదే అయినా
తరచూ తూలిపోతుంటాను…
పిల్లతెమ్మెరై బుజ్జగించడమొక్కటేనా
అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టి
మలుపు వరకూ తోడొస్తావు కూడాను.
వేడికోలు చూపుల్ని ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే, గుండె పట్టేసి.. దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!