వర్షానంతరం శాంతించిన ఆకాశం
చిరుగాలుల చల్లని వ్రేళ్ళతో
దాడికి తడిసి చెల్లాచెదురైన
లేత రెమ్మల ముంగురులను
అలవోకగా స్పర్శిస్తుంది

సంగ్రామము సంఘర్షణ
సంక్షోభము వలదు మాకు
సంతోషము సంరక్షణ
సహజీవన మవసరము
కష్టాలకు అంతమెప్పుడో
జన నష్టాలకు అంతమెప్పుడో

దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.

అనురాగాల అందమైన జగతిలో
మమతల దీపం అమ్మ
మెరిసే నక్షత్ర వినీలాకసంలో
పున్నమి జాబిలి అమ్మ