నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్ళి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది.
శీర్షికలు శీర్షికలు
“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.
అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్ళి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది. అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే.
గచ్చు మీద తన నీడనే చూస్తూ
గుమ్మం దగ్గర నిలిచున్న తలుపు
అడుగులతో నడిచొచ్చిన జ్ఞాపికలను దాచుకుని
మూసిన గాజు తలుపుల అరమరలతో
మూగ సాక్షిగా నిలిచిన గది
కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!
కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.
ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-
నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.
స్వీయచరిత్ర చదివించాలి, చదివించే జీవశక్తి దానికి ఉండాలి. డైరీని ఎత్తి ముద్రించిన చందంగా ఉంటే, పత్రికల్లో వచ్చే ప్రకటనలకుండే విలువే దానికి. అలా చదివించాలంటే, ఆ ‘స్వీయం’ మరుగునపడి ‘చరిత్ర’ బయటకు పొంగాలి, పెరుగును చిలికితే వెన్న చందంగా.
జేరిన కొత్తలో జగదీష్ సింగ్ కేసి చూసి, ఓ అస్సాం కుర్రాడు, మనీష్ అనే అతను సింగ్ ఎత్తు ఎంతో అడిగి పేంట్ కేసి చూపిస్తూ, ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ,’ అన్నాడని బాగా ప్రచారం అయింది ఆ రోజుల్లో. మనీష్ అలా అన్నందుకు సింగ్ నొచ్చుకున్నా తర్వాత స్పోర్టివ్‌గా తీసుకుని మర్చిపోయాడని చెప్పుకున్నారు.
సమాజములో స్త్రీ స్థానాన్ని గురించి ఇప్పుడు కూడ వాదాలు, వివాదాలు తగ్గకుండా ఉన్నాయి. కాని నియంతలైన రాజులు, సుల్తానులు పరిపాలించే కాలములో రాణీవాసాన్ని ఒక్క చిరునవ్వుతో తిరస్కరించి తన ఇష్టాయిష్టాలకు మాత్రమే విలువ నిచ్చిన యువతి ఒకామె జీవించి ఉన్నదనడము నిజముగా గర్వ కారణమే.
క్రితం సంచికలోని గడినుడి 21కి గడువు తేదీలోగా నలుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన నలుగురు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. జంధ్యాల ఉమాదేవి, 3. గిరిజ వారణాసి, 4. ప్రతిభ. వారికి మా అభినందనలు. గడి నుడి – 21 సమాధానాలు, వివరణ
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
కళా సృజన అడవినుండి రాజాస్థానాలకు వెళ్ళిననాటినుండీ బహుశా దానికి వాణిజ్య విలువ ఏర్పడింది. రాజులు, జమీందారులూ పోయాక అది చాలా వరకూ పడిపోయింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య యుగంలో, మానిటరీ బెనిఫిట్ స్థానంలో జనాదరణ వచ్చి కూర్చుందని చెప్పవచ్చు. దానికి మూలసాధనం ప్రచారసాధనాలయ్యాయి. అవి టెక్నాలజీతో మరింత ఎక్కువై, ఇంటర్నెట్ వచ్చాక బ్లాగుల్లో ఇన్‌స్టంట్ ప్రతిస్పందన నుంచి, ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అత్యంత వేగంగా ఎక్కువమంది జనాలకి ప్రచారం కావడం వరకూ వచ్చింది. ఇదొక అద్భుత మాయా ప్రపంచం! అయితే, కళని వాణిజ్యంగా కాక, తమ జీవితాన్వేషణగా, ఒక ఆంతరంగిక తపస్సుగా చేసుకున్న కళాకారులూ కనిపిస్తారు. వాళ్ళకు శ్రోతలు కొట్టే చప్పట్లు కాని, పాఠకులు పెట్టే లైకులు కానీ పట్టవు. విలా కేథర్ కథలో, ఒక సాయంపొద్దును చూస్తూ మైమరచిపోయిన శిల్పి అలాంటి వాడు. బాలసుధాకర్ కవితలో, రాతి కాలాన్ని నిర్దయగా ఛీకొట్టే పాటగాడు అలాంటి వాడే. ఏదో పిలుపునందుకుని మోస్తున్నవన్నీ పక్కనపెట్టి ఒక ప్రయాణానికి బయలుదేరిన కవి, జీవితానందం ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది, అంటున్న కుంచె కవీ కూడా ఆ బాపతువాళ్ళే! వీళ్ళలో కొంతమందికి అప్పుడప్పుడూ ప్రపంచం ముళ్ళకిరీటం పెడుతూ ఉంటుంది. ఎంతోమందికి పిచ్చివాళ్ళని బిరుదిచ్చి దూరంగా జరిగిపోతుంది–అది వాళ్ళ అదృష్టం, ప్రపంచం దురదృష్టం!
ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు.
తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది. కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.
గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా?
ఎప్పటిదో పొడి జ్ఞాపకం ఒకటి
చినుకు తడి తగిలి
గుప్పున అలుముకుంది
ఒక నిశ్శబ్దపు గాలికెరటం తాకి
ఒళ్ళంతా సన్నని వణుకు
ఉరుములూ మెరుపులూ లేని ఒలిపిరి
ఒకటే ధారగా…
ఈపాటికే అతనొచ్చేసి
ఆ నది ఒడ్డున తోచిందేదో
రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు
లేదూ
చదివేందుకూ రాసేందుకూ ఏముందని
కలాన్నీ కాలాన్నీ ఆ నదిలోకే విసిరేశాడో