పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.
శీర్షికలు శీర్షికలు
అతను కాదు ఆమె కాదు
ఎగసిన మోహార్ణవం జీవనవనాన్ని దహించబోగా
నిజాయితీ కన్నీళ్ళు కొన్నీ
టీచర్స్ హైలాండ్ క్రీమ్ బొట్లు కొన్నీ
కలిసిపోయి రంగులు వెలిసిపోయి
కలిసి తెలుసుకుని మరీ తెలిసి కలుసుకొని
ఓ సారి నది
పంటకాలువ ఇంటికొచ్చింది
పొలం గట్లమీద
కాలువ చిరునవ్వుతో సాగిపోతుంటే
నది మౌనంగా అనుసరిస్తోంది
వెళ్తూ వెళ్తూ కాలువ
వేల పాయలుగా చీలిపోయింది
సాహిత్యంలోగాని యితర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.
1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి.
రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము రాళ్ళనీ గుండ చేసి ఈజిప్టులోని పురాతన రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి.
వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు.
క్రితం సంచికలోని గడినుడి-56కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-56 సమాధానాలు.
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
మరణ వార్తలని వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు చుట్టూ చిక్కని నల్ల బార్డరు వేయడం ఆనవాయితీ. అదెప్పుడు? లోకం కాస్తో కూస్తో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధసమయాల్లో, ప్రకృతి భీభత్సాల్లో, అల్లర్లలో మనిషి చావుకి ఒక గౌరవం ఉండదు. హోదాలుండవు. దహన సంస్కారాలు ఉండవు. కనీసం వారిని లెక్కపెట్టి అధికార గణాంకాల్లో ఆ మాత్రం ఉనికిని కూడా వారికి మిగలనివ్వరు. ఇలా అసందర్భంగా, అన్యాయంగా, అమానుషంగా, అర్థరహితంగా చనిపోయినవాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి సాహిత్యమే కాస్తన్నా మర్యాదనిస్తుంది. తెల్లబట్టలో చుట్టి తాళ్ళు కట్టిన ఆ ‘శరీరా’ల వెనుక మనుషులని, జీవితాలని గుర్తు చేసుకుంటుంది.
ముస్లిమ్ పేషంట్ కొనవూపిరితో ఉంటే కల్మా చదివిన హిందూ డాక్టర్; ఆక్సిజన్ సప్లయర్ ముస్లిమ్ కనుక అత్యవసరమున్నా సిలిండర్ తీసుకువెళ్ళమన్న హిందూ కుటుంబం; మీల్స్ అందించబోతున్న వాలంటరీ అబ్బాయిని ఏ కులస్థులు వండిన వంట ఇది అని అడిగిన హోమ్ ఐసోలేషన్‍లో ఒంటరిగా ఉన్న పెద్దమనిషి; తనామనా బేధం లేకుండా కులమతాలకతీతంగా రోజుకి వందలాది దహన సంస్కారాలు చేస్తూ, కనీస గౌరవాన్ని చనిపోయినవారికందిస్తున్న యువత, కరోనా రోగ లక్షణాలు కనిపించగానే గదిలో పెట్టి తాళం వేసి మర్నాడు ప్రాణం పోయేవరకూ ఒక పెద్దాయనకి కనీసం తాగడానికి పచ్చిమంచినీళ్ళు కూడా ఇవ్వని కుటుంబ సభ్యులు; వైరస్ వచ్చి ఊపిరాడని వాళ్ళు, వైరస్ అంటుకుంటుందేమోన్న భయాందోళనలతో ఊపిరి తీసుకుంటున్న వాళ్ళు; ‘డబ్బు లేకపోతే బతికే హక్కు లేదా?’ అని రగిలిపోయే గుండెలు, ‘ఇంత డబ్బుండీ, అంత ఖర్చు పెట్టీ మనిషిని దక్కించుకోలేకపోయామే’ అని కుమిలిపోయే మనసులు; ఎలా అయినా బతికి తీరాలన్న మొండిపట్టు; అందరూ పోయి మనమే ఎందుకు మిగిలున్నామనే సర్వయివల్ గిల్ట్… ఈ గండం గట్టెక్కగానే మర్చిపోయే సంగతులు కావివి. #sabYaadRakhaJaayega (అన్నీ గుర్తుపెట్టుకుంటాం) అన్నది ఒక పొలిటికల్ స్లోగన్ మాత్రమే కాదు. బతికి బట్టకట్టిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అది. ఆ బాధ్యతని మోయాల్సినవాళ్ళల్లో ప్రప్రథమంగా ఉండాల్సింది కవులు, రచయితలు, కళాకారులూ. చిన్న వెలుగుని కూడా చూడనలేంతగా కళ్ళు చీకటికి అలవాటు పడిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరవమని గుర్తు చేసి, గుండె రాయి అయిపోయి శోకమంతా గొంతులో అటకాయించినప్పుడు కరిగించి కన్నీరుగా మార్చి, కన్నీటి ఉప్పెనలో కొట్టుకుపోతున్న జీవానికి ఆసరా ఇవ్వగలిగినవారిలో సాహిత్యకారులు ఒకరు! – పూర్ణిమ తమ్మిరెడ్డి.
ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్ళి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు!
ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్‌క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్‌నూ, థ్రిల్‌నూ పొందుపరచడంలో ఆన్ రాడ్‌క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.
నాకు మాత్రం ఆ నదిలో కొట్టుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. నాని ఉబ్బిపోయిన శవాలు. కుక్కలు పీక్కొని తిన్న శవాలు. ఆనవాలు పట్టలేని శవాలు. గంగా! పాప వినాశినీ! మా ధర్మచరితకు పవిత్రసాక్షివి! శివుని జటాజూటంలో కొలువైన ఉగ్రతేజానివి! ఎందుకు రహస్యాలు నీలోనే దాచుకోవడానికి నిరాకరించావు?
మరియమ్మ ఒడిలో వాడు ఆడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి. మరియమ్మ వాడినే కలవరిస్తా పోయింది. నన్ను కదా ఆమె మొదట పెంచింది. ఏదడిగినా ఇచ్చాను ఆయమ్మైనా కూడా. అయినా వాడినే ఇష్టపడింది, వాడు అమ్మా అనేవాడనా? చివరికి లక్ష్మి కూడా వాడిని నవ్వుతున్న కళ్ళతో చూసేది. ఆ చూపుల్లో ఇష్టం. అది నా జీవితంలోకి కదా వచ్చింది? నావైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు?
నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకు ముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.
అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టు ఉండేది ఈ తాగుడు తంతు. కాని, శరీరాన్ని మోసం చెయ్యడం వీలయ్యేది కాదు.
హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.
సూర్యోదయం మొదట్లో పొడవుగా సాగిన నీడ మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వేళకి చిన్నదవుతూ, మళ్ళీ పొడవుగా సాగుతుందన్న విషయం మనకు తెలుసు. కనుక నీడ పొడవును బట్టి, అది మధ్యాహ్నమైతే, ఇంకా సూర్యాస్తమయానికి 7 గడియల పొద్దు ఉందనీ, అదే ఉదయపు నీడ అయితే, సూర్యోదయం అయి 7 గడియల పొద్దు అయిందనీ తెలుసుకోవచ్చు.
త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.
అప్పుడు నీ గర్భాన్ని
నా పసికాళ్ళతో తట్టినప్పుడు
నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో
తెలీదు కానీ
ఇప్పుడు నీ జ్ఞాపకాలు
నా గుండెల్ని తడుతుంటే
కన్నీటి మేఘాన్నవుతున్నాను.