!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

కోవెల సంపత్కుమారాచార్య (26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010): శ్రీ కోవెల జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో ‘తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము’ అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ – లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం కవితా కావ్యాలు; విశ్వనాథ కవిత్వ విమర్శ, కన్యాశుల్క నాటక విమర్శ, వచన పద్య లక్షణంపై చేరాతో చర్చ, అనేక తదితర సాహిత్య వ్యాసాలు – తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో పరిపుష్టం చేసిన పండితుడు, కవి, విమర్శకుడు, నిగర్వి, స్నేహశీలి, ఒక మామంచి మనిషీయన. సంపత్కుమారాచార్య సాహితీప్రస్థానంపై సమగ్ర పరిచయాత్మక ప్రత్యేక వ్యాసం ‘విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార‘ సహితంగా ఈ స్మారక సంచికలో మీకోసం…

[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]

వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.

సంపత్కుమార కన్యాశుల్కం నాటకాన్ని రకరకాల కోణాలనుంచి పరిశీలించి తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు. ఆ వ్యాసాలపై వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానంగా రాసిన ఈ వ్యాసానికి, నిజంగా తగిన గుర్తింపు రాలేదు.

ప్రాంగణాన పెద్ద ముగ్గు. ప్రహరీ గోడ బయట వీధిలో మరో ముగ్గు. గేట్ తీసుకుని బయటకు తొంగి చూస్తే ఇంటింటికీ ముగ్గులు. తెల్లగా నక్షత్రధూళి దారంతా పరుచుకున్నట్టు తోచేది.

సుమారు 1991 ప్రాంతంలో లండన్ నుండి తిరిగొస్తూ హైద్రాబాదు ఎయిర్‌పోర్టులో ఇండియా టుడే తెలుగు పత్రిక కొన్నాను. అప్పుడే తెలుగు వెర్షన్ కొత్తగా మార్కెట్లో ప్రవేశ పెట్టారు. సాధారణంగా వార్తా కథనాలే ఉండే పత్రికలో ఒక కథ! ఆ కథ పేరు ‘రెక్కలు’.

ఇప్పటి కుర్రకారుకి మన భారత దేశాన్నుంచి అమెరికా రావటమంటే నల్లేరు మీద బండి నడకే కావచ్చు. కానీ అప్పట్లో అదొక అద్భుతమైన సాహసయాత్రే!

“క్రైం బ్రాంచ్ ఛీఫ్ మనకు బాగా తెలిసినవాడే కదా. విషయం చెప్పి, 48 -72 గంటల వ్యవధి అడుగు. ఆటాప్సీ ఈ హాస్పిటల్లోనే చెయ్యనీ. ఇచ్చిన గడువు లోపల నేను హంతకుడెవరో చెప్పలేకపోతే, ఆ తర్వాత కథ వాళ్ళిష్టమైనట్లు నడిపించవచ్చు.”

“ఛ, మీతో మహా విసుగ్గా ఉంది. ఎందుకిలా నస పెడుతున్నారు నా చావేదో నన్ను చావనివ్వక! సరే, ఓపని చేద్దాం. మీరు దూకేయండి, ఆపై నేనేమైనా మీకనవసరం కదా. నేను దూకేస్తా అప్పుడు.”

వ్యాన్‌ని సేఠ్‌జీకి అప్పగించేసి ఎక్కడైనా కూర్చుని ఒంటరిగా తాగితే బాగుంటుందని అనిపించింది. టైం ఇంకా మూడే అయింది.

ఏదయితేనేం పేరప్పగారు బ్రతికున్నంత కాలమూ ఆస్తి సంపాదించాడేమో కానీ ఎవరి ప్రేమా సంపాదించలేదు; కనీసం కన్నవాళ్ళ కన్నీళ్ళు కూడా దక్కించుకోలేక పోయాడు. రెండ్రోజులు పోయాక మా ఆవిణ్ణీ వెళ్ళి పలకరించి రమ్మన్మని చెప్పాను.

మనం ఏదైనా కాల్పనిక సాహిత్యాన్ని, అంటే కధ, కవిత వంటిదాన్ని చదివేటప్పుడు, ఎలా చదువుతున్నాము, ఎలా స్ఫురణకు తెచ్చుకుంటున్నాము, అర్ధం చేసుకుని ఆస్వాదిస్తున్నాము?

మేము నలుగురు ఆడపిల్లలలో దేవక్క పెద్దది. మా నాయనకు మాత్రం ఆమె ఎప్పటికీ ‘సన్నక్క’నే. నేను చిన్నప్పుడెప్పుడూ అనుకునేదాన్ని. ఆమె మా అందరికన్నా పెద్దది కదా, దేవక్కను ఈయన ‘సన్నక్క’ అంటాడెందుకని.

ఇక ఆమె కూర్చున్న వైఖరి – రావణ నిర్మూలనానికి, అంటే అధర్మ నిధనానికి సన్నద్ధుడైన శ్రీరాముని పూనిక రూపం దాల్చినట్లు – లోనే ఆమె నిశ్చయమూ, ఆమె నిశ్చలతా, తన భర్త యెడ ఆమెకు గల అనంత విశ్వాసమూ అన్నీ ద్యోతకమౌతున్నాయి.