రామభక్తులకు నిజానికిన్ని రామాయణాలు వున్నవనే సంగతికాని, వాల్మీకికి ముందు అనేకమైన రామకథల్ని అనేక చోట్ల, అసంఖ్యాక రీతుల్లో గానం చేసేవారని, వాల్మీకి రామకథలను ఏకత్రం చేసిన ఆదికవిగానే కాక, ఆది ఎడిటర్‌గా కూడా పాత్రఃస్మరణీయుడని, మారుతున్న సమాజానికి అవసరమైన రీతిలో రామాయణం ఎప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వచ్చిందనీ తెలియదు. భక్తికి విశ్వాసంతోనే గాని, జ్ఞానంతో పనిలేదు. జ్ఞానయోగం కంటె భక్తియోగం గొప్పది.
Category Archive: వ్యాసాలు
వసుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో శుక్తిమతీనది, కోలాహలపర్వతాల సంబంధాన్ని, సంగమాన్ని ప్రకృతిపరంగాను, వ్యక్తిపరం గాను శ్లేషమూలకంగా అత్యద్భుతంగా వర్ణించడంలో రామరాజభూషణుఁడు చూపిన వైదుష్యం, కౌశల్యం, కవిత్వపాటవం సాహిత్యవిమర్శకులు తరచుగా విశ్లేషించునవే. శుక్తిమతీ కోలాహలుల పుత్త్రికయైన గిరికయొక్క చెలికత్తె మంజువాణి గిరికాదేవి జన్మప్రకారాన్ని నర్మసచివునికి వివరించే సందర్భంలో ఈవర్ణన చేయబడింది.
ఎలియట్ ఎక్కడనుండి ఎవరినుండి దేనిని గ్రహించినా యథాతథంగా గ్రహించడు కదా. అంతేకాదు, తిరిగి యివ్వకుండా ఏదీ తీసుకోడు. ఈ ఉపనిషత్తులోని ‘దత్త దామ్యత దయధ్వమ్’ వరుస మార్చి, ‘దత్త దయధ్వమ్ దామ్యత’ చేశాడు. అంతే కాదు. ఆ ఉపదేశాలకు తన స్వీయభాష్యం కూడా చెప్పాడు, కవితారూపంలో.
సావిత్రి కథను ఇంగ్లిష్‌లో చెప్పిన మొదటి కవయిత్రి ఈమే. తొరూ దత్ రచనలో సావిత్రి కథ ప్రణయభావనలతో అందమైన కావ్యమైంది. అరవింద ఘోష్ ఈ కథకు తాత్వికరూపమిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మోడర్న్ క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు.
కొన్నిటిలో పేజీకి ఒకటి, కొన్నిటిలో పేజీకి మూడూ నాలుగు కూడా. అన్నీ శృంగార భంగిమలే. కూచున్న, పడుకున్న, నిలబడ్డ, ఎత్తుకున్న, సోలిన, వాలిన, పేలిన కామకేళి విన్యాసాలే ఆ బొమ్మలు. వాత్సాయనుడు కూడా కనిపెట్టలేని సూత్రాలు అన్నిటిని మోహన్‌గారి పెన్సిల్ పని పట్టింది. వాటిని చూడటానికి ముందస్తుగా నాకు సిగ్గేసింది.
ఒక విధంగా ఆలోచిస్తే భౌతిక శాస్త్రం యొక్క గమ్యం వాస్తవం యొక్క నిజ స్వరూపం కనుక్కోవడమే. ఈ వాస్తవాన్నే మనం వేదాంత తత్త్వంలో బ్రహ్మము, బ్రహ్మ స్వరూపము అని అంటాం. మన ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ బ్రహ్మము గురించి చేసిన అన్వేషణ అనే చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల గమ్యమూ ఒక్కటే; వారు ఎంచుకున్న మార్గాలు వేర్వేరు, వారి పరిభాషలు వేర్వేరు. వేదాంత తత్త్వంలో అన్వేషణ కేవలం తర్కం, మీమాంసల ద్వారా జరుగుతుంది.
ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయం ఉన్న గురజాడ అప్పారావు తన కన్యాశుల్కంలో బయటకి ఈ పేకాటని వర్ణిస్తున్నట్టు కనిపించినా, దీనిని ఆసరాగా చేసుకుని పోలీసులకీ కొన్ని వర్గాలకీ మధ్య నడిచే అనుబంధాలని కథాగమనానికి, అందులో కొన్ని కీలకమైన మలుపులకీ చాలా చక్కగా వాడుకున్నారు.
ఇక్కడ గమనించవలసింది ఏమంటే, డెత్ బై వాటర్‌ను ఎలియట్ తన మిత్రుడి మరణంతో కలిగిన శోకంలో, తన వివాహవైఫల్యంలో మొదలుపెట్టాడు. ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ వద్దనలేదు. ఏమిటి దీని అర్థం పరమార్థం? కవి లేకుండా, కవి కష్టసుఖాలు, కవి అనుభూతి లేకుండా, కవిత్వం లేదు.
రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న భక్తిసంగీతమునకు కాణాచి. తఱువాతి కాలములోని త్యాగరాజువలె రామదాసు కూడ తన సర్వస్వాన్ని ఆ శ్రీరామునికే అర్పించాడు. ఆ రాములవారిని స్మరించాడు, నిందించాడు, స్తుతించాడు. రామదాసు ఎన్ని కీర్తనలను వ్రాసినాడో మనకు తెలియదు. సుమారు 250 – 300 అని అంచనా. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము కొన్ని రామదాసు కీర్తనలలోని ఛందస్సును అందరికి తెలియబరచడమే.
ఇంద్ర ప్రసాద్ కవితాసంపుటి నుంచి అతనంటాడు కదా అనే కవితలో ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని చదవగానే ఝల్లుమన్నాయి నా తలపులు. అది చిన్నాచితకా మాట కాదు. దుస్తుల కాపట్యాన్ని నిరసిస్తూ, భౌతిక సౌఖ్యానికి, మానసిక వికాసానికీ నగ్నత్వాన్ని కోరుకోవడం, తద్వారా ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి సంబంధించిన నిన్న మొన్నటి భావాన్ని అధిగమించిన మాట.
ఇది చదివినప్పుడు మరో పడవప్రణయం గుర్తొస్తుంది. పరాశరమహర్షిని తన పడవ ఎక్కించుకొన్నది మత్స్యగంధి. నది దాటిస్తుండగా, పరాశరుడు ఆ కన్యను కోరాడు, ఆ చిన్న యిరుకు పడవలోనే, అప్పటికప్పుడే జరిగిపోవలె అన్నాడు. ఆ కన్నెపిల్ల సందేహిస్తుంటే, ‘నీ కన్యాత్వంబు దూషితంబుగాదోడకు’ అని ఆశ్వాసించాడు.
ఉపనిషత్తుల వల్ల ప్రభావితుడైనది ష్రోడింగర్ ఒక్కడే కాదు. అలనాటి భౌతిక శాస్త్రవేత్తలు ఎందరో ఈ కోవకి చెందినవారు ఉన్నారు. నీల్స్ బోర్, హైజెన్‌బర్గ్, ఆపెన్‌హైమర్ మొదలైనవారు ఉన్నారు. ఆమాటకొస్తే హైజెన్‌బర్గ్ ప్రవచించిన అనిర్ధారిత సూత్రం చెప్పేది కూడా ఇదే.
ఈ ట్రిబొనాచ్చి సంఖ్యలను మొట్టమొదట అగ్రనోమోఫ్ అను శాస్త్రజ్ఞుడు 1914లో ప్రస్తావించెను. కాని అంతకుముందే ఏనుగుల జనసంఖ్యను వివరించుటకై ఛాల్స్ డార్విన్ తన కొడుకైన జార్జ్ హోవర్డ్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతమును గ్రహించెను. ఇది ఒక మేధోప్రహేళిక.
కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు.
నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది. ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు అనే ప్రశ్నకు గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము కలుగుతుంది.
జీవితాలు వ్యర్ధంగా గడిచిపోతున్నాయి, త్వరపడండి, సార్థకం చేసుకోండి, అన్న హెచ్చరిక. ‘ఎ గేమ్ అఫ్ కోర్స్’ ప్రారంభదృశ్యం లోని సంపన్నస్త్రీ అయినా, ముగింపుదృశ్యం లోని లిల్ అయినా జీవితాల ముగింపు ఒకటే. క్లియోపాత్ర లాగానో ఒఫీలియా లాగానో కథ విషాదాంతమే – మరణమో, సదృశమైన జడజీవనమో. కాని జీవితచదరంగం యిద్దరికీ సామాన్యమే.
నడీన్ గోర్డిమర్ కంటే చాలా ముందే దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్ల జాతుల గురించి వ్యాసాలను, అక్కడి స్త్రీల జీవితాల గురించి ఒక నవలనూ రచించిన 19వ శతాబ్ది రచయిత్రి ఆలివ్ ష్రైనర్ ఎక్కువమంది పరిశోధకులకు కూడా అపరిచితురాలే. ఈ రచయిత్రి మన గాంధీజీని కలుసుకుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించిందనీ చదివినపుడు కలిగే ఉత్సాహం వేరు.
ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి.
ఇవన్నీ ఎప్పుడో ఉన్న కవులకి కాని ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి వర్తించే చట్రాలు కావని అనిపించొచ్చు కాని, నిజం కాదు. పందొమ్మిదో శతాబ్దంలో కొత్త రకం పాఠకులు వచ్చారు, మరికొన్ని కొత్త మూసలు తయారుచేశారు. ఈ కొత్త పాఠకులకి దారి చూపించి, తెలుగు సాహిత్య చరిత్రలో పెనుమార్పులకు కారకుడైన విశిష్టవ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఈయన ప్రభావం బహుశః అద్వితీయం.
సాహిత్యం సమాజంలో మార్పులకు దోహదం చెయ్యాలి అని ఆశించడం, ఆ సాహిత్యంలోనూ భాష, వాస్తవికతల పరంగా మౌలికమైన మార్పులు ఆశించడం, తీసుకురావడం – ఆ ప్రక్రియలో ఆధునిక సాహిత్యానికి గురజాడ మూల పురుషుడవడం వివినమూర్తిని బాగా ఆకట్టుకున్న విషయం, వాటికన్నా ఎక్కువగా మూర్తిని ఆకర్షించింది గురజాడలోని వివేచన.