ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఉండడనుకుంటాను.

ఈ మాట ప్రారంభమైనప్పటినుంచీ, ఇప్పటి వరకూ సంపాదకత్వ బాధ్యతలు (సంపాదక బాధలు అనడం ఉచితమేమో!) నిర్వహిస్తున్నవారందరూ సైంటిస్టులు, ఇంజనీర్లూ. పీర్ రివ్యూ అన్న పదం ఇంత ఘర్షణకి మూలకారణం అవుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు.

ఒకసారి, బహదిన్‌ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్‌ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్‌ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు.

సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు కొనదల్చుకున్నా దొరకదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి, వీలైనంత వివరంగా.

విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం. ఇవి అందమైన నినాదాలు. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవడం అనే కోరిక అద్భుతమైన కోరిక.

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.

సాధారణ పాఠకుడికి పుస్తక పరిచయం కనీసం మార్గదర్శకం అవుతుంది. పుస్తకాలమీద ఎంత మమకారం ఉన్న పాఠకులైనా, ( వీళ్ళని ప్రస్తుతానికి ” అసాధారణ పాఠకులు” అని అందాం!) ప్రచురించబడ్డ అన్ని పుస్తకాలూ చదవలేరు.

పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు.

సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ?

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.