1891లో కోనసీమలో శుద్ధశ్రోత్రియ వైదిక బ్రాహ్మణ పుటక పుట్టి, 1961లో చనిపోయే లోపల చిన్నా పెద్దా నిడివిగల 65 తెలుగుకథలు రాసిన శాస్త్రిగారిని తెలుగు ప్రపంచపు దిగ్దంతులు చాలామంది గొప్ప స్రష్టగానూ, గొప్ప వ్యక్తిగానూ గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తిగారు ఈయన్ని ‘కథక చక్రవర్తి’ అన్నారు. పోరంకి దక్షిణామూర్తిగారు ‘జాతి రచయిత’ అని చాటగా, వాకాటి పాండురంగారావుగారు ‘తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయిత’ అన్నారు. ‘కనక్ ప్రవాసి’గారు ఈయన రచనలమీద పి.హెచ్‌డి.,పరిశోధన గ్రంథం ప్రచురించి వాటికి ‘అకాడమీ’లో స్థానాన్ని ఇచ్చారు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: కొచ్చెర్లకోట బాపారావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: