రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పెదిమలు, తలుపులు

రచన: హెచ్చార్కె
జులై 2015

ఒక ఇల్లు దొరికే వరకు ఇంటిలోపలి మనిషి దొరికే వరకు.

బయటి నుంచి కాకుండా లోపల్నించి కాలుస్తున్న ఎండ
కంఠాన్ని చుట్టి మస్తిష్కానికి పడగ యెత్తుతున్న దాహం.

మనం కలుస్తామంటావు, అందాక
మంత్రవాక్యం మరిచిపోవద్దంటావు.

ఒక్కో అక్షరం పేలి కోటి అణువులై గాలిలో ఎగురుతున్నావు
వాక్యం సంగతి సరే, నిర్మించగలనా మనదైన ఓ అక్షరాన్నైనా?

ఇక్కడ ఎవరూ లేరని కదూ అన్నాను, ఎందుకు లేరూ? ఉన్నారు
అదిగో ఆ టీ కొట్టు దగ్గర ఒకాయన వంగి కాలు గోక్కుంటున్నాడు
ఆటో లోంచి డ్రైవరు అప్పుడప్పుడు నా వైపు కూడా చూస్తున్నాడు
ఆసుపత్రి చెత్త కుప్ప పక్కన శునకం దిక్కులు చూస్తూనే వుంది.

ఇల్లు దొరకదు మనుషులు దొరకరు.
ఇక్కడ నుంచోడానికి గట్టి కారణం దొరకదు.

డెజావూ?!

ఎప్పుడో చూశాను ఇవే గోడల్ని, ఇదే, ఈ ఆకలి గొన్న శునకాన్ని
నన్ను గిరాకీ అనే ఒక సర్వనామంతో సంభావించే చోదక నేత్రాల్ని
తేనీటి ప్లాస్టిక్ కప్పుల గుట్ట పక్కన గోక బడుతున్న చరణ కండరాన్ని
ఎప్పుడో చూశాను ఈ గోడల్ని సరిగ్గా ఇవే గొడవల్ని, ఇది మామూలే.

నేనుంటాను. ఎదురు చూస్తుంటాను ఇలాగే. ఎవరిదో ఒక ఇంటి
వసారాలోంచి, నన్ను కాసేపు నిలబడనిచ్చిన ఇంకో ఇంటి చూరు
కింది చిరుగు నీడ లోంచి చూస్తుంటాను; నువ్వు వస్తావు ప్రేమగా
పెదాలు విచ్చినట్లు తలుపులు తెరుస్తావు, ఒక చల్లని నీడ లోనికి

నువ్వు ఎవరో తెలియదు, తెలుసు అనుకున్నాను, తెలుసనుకుని
ముద్దు పెట్టుకోబోయాను, నీ కన్నులలో దిగ్భ్రాంతి, పరాయి పదం
ఎక్కడో ఏదో కలుక్కుమన్న చప్పుడు ఇల్లు లేదింట్లో ఎవరూ లేరు

వున్నట్టుండి వున్నానొక పేరు లేని వూరిలో, ఆగిపోయిన దారిలో.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వూళ్ళో యిల్లు
  • నీటి ఊహ
  • ఇంకొంచెం అసంబద్ధం
  • ఒక పుస్తకం
  • సొంతం

ఇటువంటివే…

  1. రెక్కిటికీ
  2. అవ్యయ: నీ ఖాళీ ఇల్లు
  3. జారిపోయిన కాలం
  4. ఆకు రాలు కాలం
  5. ఏండ్రాయిడ్ మనిషి

జులై 2015 సంచికలో ...

  • ఈమాట జులై 2015 సంచికకు స్వాగతం!
  • ఎడారి అంచున
  • ఒంటరితనం
  • కషాయం
  • గుప్పెట్లో తూనీగ
  • జారిపోయిన కాలం
  • టీచింగ్ మూమెంట్స్
  • తోపులో పిల్లలు
  • దీక్షిత దుహిత
  • నల్ల బెలూన్
  • నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు
  • పుల్లెల శ్రీరామచంద్రుడు
  • పెదిమలు, తలుపులు
  • ప్రధాన సంఖ్యలలో కవలలు
  • బాలల కథల పోటీ – 2015
  • మొట్టమొదటి సారాకాపు
  • రెక్కిటికీ
  • వేడికోలు
  • సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
  • సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.
  • స్టార్‌బక్స్ కథలు: ఘోస్ట్ సైకిల్
  • స్వరార్చనం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తోపులో పిల్లలు
వేడికోలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.