అవ్యయ: నీ ఖాళీ ఇల్లు

నీ ఖాళీ ఇల్లు. తమ్ముడు కొవ్వొత్తి దీపంతో
పుస్తకం తెరిచి పట్టుకొని వెతుకుతున్నాడు,
ఏదో చీపురు పట్టుకొని ఎవరు ఇంటి ముందు
రోడ్డుమీద పొగమంచు ఊడ్చివేశారా అని.
(ఎలెక్ట్రి కంపెనీ రెండుసార్లూ చివాట్లు పెట్టిన తరువాత!)

తమ్ముడుకి మా రోడ్డు పొడుగు, వెడల్పు అన్నీ తెలుసు
అలాగే పొగమంచు పొడుగు, వెడల్పు–చీకటి ఆకారం కూడా
ఇప్పుడే తనకి నడవటం వచ్చింది, అయినా బాగానే నడుస్తాడు,
వెలుతురులో కలిసి పూలలా కనిపించే ఆ చీపురుపై వ్యామోహం.

తరువాత నీ వెనుకనే ఉండి చేతులు జోడించి నమస్కారం
శూన్యంలోకి చూస్తూ, సున్నం పులిమిన గోడమీద బల్లి,
కాఠజోడి నది వడ్డున కూచొని ఊహించుకున్నాను, నీ
కంఠస్వరం ఎగురుతూ వస్తుందని; దాని దారంతో గుచ్చబడి తారలన్నీ.

కాని, నేను స్వయంగా చూశాను నీ ఆ ఇంటి వెలుగు
అవును, నా నిర్జీవ కఠిన వేదన కల్పనే కావచ్చు;
ఎప్పుడో ఒకవేళ మెరుస్తూ చంచలానురాగంతో మలయమారుతం వస్తే,
మెడపట్టిగెంటినట్టు వెనక్కి తిరిగిపోతుంది;
గాలిసవ్వడి నా నిద్రని భంగపరచదు.