రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

భూమీ! నీకో సందేశం!

రచన: చంద్ర శేఖర్ ప్రతాప
ఫిబ్రవరి 2025

చంకన నెలపాపనెత్తుకుని
గతించిన వత్సరాన్ని తారాధూళిలో కలిపేస్తూ;
నక్షత్రాల సాలుల్లో కొత్త స్వప్నాలను విత్తుతూ;
దీర్ఘవలయాకార కక్ష్యలో
నిరంతరంగా, నిబద్ధంగా;
వయ్యారపు నడకల్లో హొయలు పోయే
ఓ నీలమణి కాంతా!
విశ్వ సంకలనంలో
నీదే గర్వించదగిన కథ!

నీ పరిణామం
సృష్టికర్త ముఖం మీద
పొడసూపే
తండ్రి మురిపెం లాంటి
కించిత్ గర్వరేఖ!

ఓ అజ్ఞాత కవి వెలువరించిన
అసంఖ్యాక నిర్జీవ ఖగోళ పంక్తులలో
ఉటంకించదగ్గ ఉదాత్తమైన సజీవ కవితా పంక్తివి నీవు !
సాధన చేసి వెలయించిన
అనేకానేక గందర గోళాల గోలలో
అనూహ్యంగా మొలకెత్తిన శ్రావ్యమైన ఆదిభూపాల రాగం నీవు!
పేరుకుపోతున్న రాళ్ళూరప్పల
రోదసీ చెదారం మధ్యన మెరిసే
మణిపూసవి నీవు!
మృణ్మయ విశ్వంలో పుట్టిన ప్రాణస్పందన నీవు!

అదిగో అక్కడ ఆ మూల!
సుదూర కాంతి వత్సరాలకవతల
విసుగే లేని గేలక్సీలు
పురానృత్యవిన్యాసకళను అలవాటుకొద్ది ప్రదర్శిస్తూవున్నాయి!
విశ్వ కేంద్రకం వెలువరించే మార్మిక సంస్పందనలు
ఆ నృత్య విభావరికి సంగీతం సమకూరుస్తున్నాయి
ఖగోళ గర్భంలోంచి
ఓ నక్షత్రం పురుడు పోసుకుని వెలుగు తరంగమై ఎగసింది!

పుట్టిన పాపకు అలంకారంగా
చేద్దామనేమో; మురిసిపోతూ
కిరణమాలికలల్లే పనిలో పడింది, కాలం!

నీ ఎడమ చెవిలో;
‘ఈ విశ్వంలో ముగింపు అనేది లేదని,
ఉన్నది ఆరంభం మాత్రమేనని!
ప్రతీ అస్తిత్వం కొత్త ప్రయాణమే అని!
మాటలు రాని సృష్టికర్తకు
తనేంటో తెలుసుకోవడానికి
నీ కడుపులో పుట్టడం వినా
మరో మార్గం లేదని!’
కాంతా! నీకో రహస్యం చెప్పనా?
గుట్టు రట్టు చేయనా!

ఈ వత్సరారంభ ఘడియలలో
నీకో సందేశం ఇస్తున్నాడు కాలపురుషుడు!
దాన్నిలా డీకోడ్ చేసి చదువుకో…

ఎప్పట్లానే పరిణమించు!
నిండుగా శ్వాసిస్తూ ఉండు!
నా నమ్మకాన్ని వమ్ము చేయని
నీ స్వరూపాన్నలాగే నిలుపుకో!
విశ్వానికంతటికీ భూమీ!
నీ ఉనికే ఒకగొప్ప ఉదాహృత గీతం!

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నిశీధిసంద్రం
  • భూమీ! నీకో సందేశం!
  • అనుకోని అతిథి

ఇటువంటివే…

  1. జ్ఞాపకం
  2. గుర్తుపట్టగలవు
  3. శరీరంబుట్ట
  4. చింత
  5. కాల పరీక్ష

ఫిబ్రవరి 2025 సంచికలో ...

  • అక్కమహాదేవి వచనాలు – 2
  • అడవితో జత
  • అస్తిత్వవాద సాహిత్యం: 2అ. దొస్తోయెవ్‍స్కీ
  • ఇక్కడే ఉన్నందుకు
  • ఇద్దరు కళాకారులు
  • ఎందుకిలా?
  • ఎవరెస్ట్ బేస్ కాంప్ 4
  • కాల పరీక్ష
  • కుడి ఎడమైతే పొరపాటు ఉందా?
  • కొండల్లో తను, మీరు, నేనూనూ
  • ఖాళీ గది
  • గులకరాయి కింద సీతాకోక చిలుక
  • చింత
  • నిరంతర అన్వేషణే మార్పు
  • నువ్వు వచ్చేవనే సంబరం
  • పని₹మని₹షి
  • ఫిబ్రవరి 2025
  • బంకు బాబు మిత్రుడు…
  • భూమీ! నీకో సందేశం!
  • యూట్యూబ్‍లో ఈమాట: జనవరి 2025
  • రెండు కవితలు
  • సంపాదకునికి ఉత్తరం
  • స్వల్ప విరామంలో…
  • హిందుత్వతో సనాతన ధర్మ ఘర్షణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కాల పరీక్ష
నువ్వు వచ్చేవనే సంబరం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.