అడ్డం
- వెన్నెలవహేలనము (2)
సమాధానం: హేల - దుర్యోధనుని వంశం వారు కారు ఈ గొర్రెలకాపరులు (3)
సమాధానం: కురుబ - తమలపాకులో నర్తించేది (3)
సమాధానం: లకుమ - తాళం (2)
సమాధానం: బీగం - జాతీయగీతంలో వంకాయ (2)
సమాధానం: వంగ - రాలిన గింజలేరుకుంటున్న పనికిమాలినవాడు (2)
సమాధానం: లేకి - ఇప్పుడు (3)
సమాధానం: ప్రస్తుతం - గురువు లేచి కొడితే పక్షులు పారిపోతాయి (3)
సమాధానం: గులేరు - లాలనమందు శ్రేష్టమైనది (3)
సమాధానం: లలామ - పొందదగినది యోగ్యం (2)
సమాధానం: ప్రాప్యం - లబలబా ఏడుస్తున్న పిల్లను చూడండి (2)
సమాధానం: బాల - పక్కాగా వండబడినది (2)
సమాధానం: పక్వం - మెలి తిరిగిన ప్రోలు (2)
సమాధానం: పురి - అంగి తొడిగిన కొండముచ్చు (3)
సమాధానం: గండంగి - గౌరవము (3)
సమాధానం: మన్నన - ఖాతాలో ఒక అంశం (2)
సమాధానం: పద్దు - చివర రాక్షసుడు అయితేనేమి? (2)
సమాధానం: నేమి - హరి చివరకు తానీషాకు ఇచ్చిన ధనరూపం దీర్ఘమే! (3)
సమాధానం: మొహరీ - నిక్షేపంగా విసురటం (3)
సమాధానం: విక్షేపం - వృషభం (2)
సమాధానం: గిత్త - చిన్నబోయిన
బంగారంసన్నవాన గుడ్డులో దాగింది (2)
సమాధానం: సొన - తోలు పాత్ర మూతికి వేసే బిరడా (2)
సమాధానం: గట్ట - తినదగినది (2)
సమాధానం: ఖాద్యం - ఉడికించే దానిలో వేసి అదమరు (3)
సమాధానం: కుక్కరు - ఎటు చూసినా తాగిన వారు ఇలానే వస్తుంటారు (3)
సమాధానం: తూలుతూ - సాక్ష్యం (3)
సమాధానం: రుజువు - జాము (2)
సమాధానం: యామం - ఉదయమగుదాక తపించు (2)
సమాధానం: వేగు - చిన్న మందు ఉండ (2)
సమాధానం: మాత్ర - జలాంబిక (3)
సమాధానం: కూపము - తొమ్మిది మంది (3)
సమాధానం: తొమ్మండ్రు - విలయ తాండవం చేస్తున్న సినీ నటి (2)
సమాధానం: లయ
నిలువు
- హారం కంటే భిన్నమైనది (2)
సమాధానం: లవం - మస్తుంగ ధైర్యమున్నోడు (2)
సమాధానం: రుస్తుం - మల్లయుద్ధం (2)
సమాధానం: కుస్తీ - సీమయాసలో బలహీనము (2)
సమాధానం: బీకి - అశక్తమైన వర్గం (3)
సమాధానం: బడుగు - ఉర్విలో తెక్కులకాడు (2)
సమాధానం: గర్వి - ఇంటి నిర్మాణానికి ఇది ఉండాలంటారు (2)
సమాధానం: వాస్తు - నాకి భుజించేది (2)
సమాధానం: లేహ్యం - ప్రథమాష్టసిద్ధి (3)
సమాధానం: అణిమ - లోనికి వెళ్ళడం (3)
సమాధానం: ప్రవేశం - నూలిపోగు (3)
సమాధానం: తంతువు - నిండుసభ (4)
సమాధానం: పేరోలగం - తిక్క వాగుడు (4)
సమాధానం: ప్రేలాపన - బియ్యము (2)
సమాధానం: ప్రాలు - వెర్రి (2)
సమాధానం: రిమ్మ - పూత వేయడం తపస్సు కాదు (3)
సమాధానం: తాపడం - పురాణ కాలపు పవిత్రారణ్యం (3)
సమాధానం: నైమిశ - ముక్కుతో మాట్లాడబడేది (2)
సమాధానం: నంగి - శూరుడు (4)
సమాధానం: మొనగాడు - మోసం చేయడానికి పెట్టే తిరుమణి (4)
సమాధానం: పంగనామం - ఇది లేనిదే 39 అడ్డం లేదు (2)
సమాధానం: సేద్యం - చేరువై కూడితే సిద్ధించేది (3)
సమాధానం: చేకూరు - ఆయువు పాడైన పృష్ఠము (3)
సమాధానం: పాయువు - తప్పించుకు పారిపోవడానికి ఎగురు (3)
సమాధానం: కుప్పించు - అమ్ములపొది (3)
సమాధానం: తూణీరం - తలపైకాక మరో వెంట్రుక (2)
సమాధానం: రోమం - ఒక చెట్టు (2)
సమాధానం: జువ్వి - అత్త కొడుకే (2)
సమాధానం: బావే - జాతరకు పోవుట (2)
సమాధానం: యాత్ర - మెరుపు (2)
సమాధానం: శంప - ఈ ఊరిలో ఖచ్చితంగా అమ్మం (2)
సమాధానం: ఖమ్మం - దురద (2)
సమాధానం: గుల