గడినుడి – 74

క్రితం సంచికలోని గడినుడి-73కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. సుభద్ర వేదుల
  2. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  5. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  6. శిష్ట్లా అనిత
  7. భమిడిపాటి సూర్యలక్ష్మి
  8. కోట శ్రీనివాసరావు
  9. రంగావఝలశారద
  10. కన్య బయన
  11. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  12. శ్రీరాం నడిమింటి
  13. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  14. బండారు పద్మ
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-73 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. దేశబంధు మనసు.. రంజింపజేసేదే (2)
  2. నిషేధింపబడిన దామరాజు పుండరీకక్షుని నాటకం (7)
  3. గాంధీగారికి ఓ పక్క బలం స్మృతిలోన మెదులుతుంది (2)
  4. ‘గడ్డము పెంచి పచ్చి తురకం బలె వేషము మార్చె’ నని జాషువా కీర్తించిన వ్యక్తి (3)
  5. 9 నిలువు తోడి నిరుపేదల ఊరా (3)
  6. ‘బాపు దీవెనలు’ గన్న రైతు నాయకులు (2)
  7. ఊరులో భీమం పేరులో రాజసం ఉన్న నారాయణుని ఇంటిపేరే.. సైన్యం (2)
  8. ‘_ _ నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు’ (2)
  9. రంప తిరుగుబాటులో రాలిన పండు (2)
  10. ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అంకితం అందుకున్న ముఖ్యమంత్రి. ఇంటిపేరు వారి ఊరు కాదు కనుక వదిలేద్దాం (5)
  11. శివగంగ సాక్షిగా మొదటి ఆత్మాహుతి దాడి జరిపిన వీర వనిత (3)
  12. బంగళూరు నుండి కొల్హాపుర్ వెళ్ళాలా.. కిత్తూరు తగులుతుంది (5)
  13. మల్కన్ గిరి గాంధి క్లుప్తంగా అనాలనా (2)
  14. ఈ దివ్యధాత్రికి మూడుసార్లు జై కొట్టేయండి (9)
  15. _ _ పృధ్వీసింగ్ ఆజాద్, ది లెజండరీ క్రూసెడర్ (2)
  16. నిర్భాగ్య భారతాన్ని తిరగవ్రాసిన రచయిత (4)
  17. అరవిందుల కృతి 18 నిలువు చేరిస్తే జ్యొతీరావ్ సతి (3)
  18. సత్తెనపల్లి ఉద్యమ నేత! ఇంకా వివరాలు కావాలా? (4)
  19. అమరులైన వారిలో బహుశా అతి చిన్నవాడు ఈ ఒడిశా రౌతు బిడ్డ (2)
  20. ఒమల్లురు పంచాయత్ ప్రెసిడెంట్ గా 47 ఏళ్ళు … చాలదకో!? (2)
  21. కృష్ణా పత్రిక స్థాపించిన వారి ఇంటి పేరు. (2)
  22. ‘…. సర్వోత్తముడాతడు ఆంధ్రుల పాలిటి దేవుడు’ జిళోకా (2)
  23. షడ్జవర్జితమైనా భగవద్గీత సాక్షిగా ఆయన అమరగాయకుడే అని ఘంటాపథంగా చెప్పవచ్చు (3)
  24. సినిమా సూరిగాడు కాదు ఈయన గదర్ చెంచయ్య (3)
  25. భీముడు! తిరగబడ్డ వీరిబిడ్డ (2)
  26. గుండు గుండె పంతులుగారు (7)
  27. సర్దార్! వల్లభాయ్ కాదు లచ్చన్న (2)

నిలువు

  1. ఇందులో రహస్యమేమీ లేదు స్వదేశ్ నౌకాయానము ద్వారా బ్రిటిష్ వారిని తిప్పలు పెట్టిన వకీలు (4)
  2. ఈ కథ వ్రాసినది ఠాగోరా? ఏదో తిరికాసు ఉందే (2)
  3. రంపా తిరుగుబాటులో అల్లూరి సైదోడు వేముల వీరయ్య తండ్రి (3)
  4. బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన బాలల గుంపే ఈ వానర _ _ (2)
  5. తాను క్రిందకు ఒరిగి పోయినా చివర ఊపిరితో జెండాను నిలబెట్టిన తిరుపూరు చిన్నవాడు (4)
  6. పింగళి వారు మన జాతికి అందించినది (3)
  7. దుగ్గిరాల తలకెత్తుకున్న పేచీ 11 తోడిది – చీరాల గాంధి గారు అర్జునుడైతే ఇతను గోపాల కృష్ణుడే (3)
  8. ఒకటి తగ్గినా ‘ఢంకా’ వాయించిన సత్యనారాయణ ఇంటిపేరు (3)
  9. బాగా ఉప్పు దొరికిందిక్కడ (2)
  10. విభజింపబడిన బెంగాల్ అయినా ఈ ఫరీద్‌పూర్ చంద్రదాస్ నిండైన యోధుడు (2)
  11. హరిజన సేవలో తరించిన గొట్టుముక్కల (3)
  12. లక్ష్మి, దుర్గ, బైజా, సావిత్రి, సరస్వతి, యేసూ ఎవరైనా గౌరవింపదగిన స్త్రీలే (2)
  13. ఇంటి పేరు కొవ్వలి అంత కన్నా ఏం కావాలి? (5)
  14. ఆజాద్ హింద్ ఫౌజ్ లేడి కెప్టెన్ (2)
  15. ఐక్యరాజ్యసమితి తోలి మహిళా అధ్యక్షురాలు భారతదేశపు తొలి ప్రధానమంత్రికి ఏమౌతారు (2)
  16. ‘సచ్చిదాత్మ కిరణ జ్ఞాన గమ్య’ నైవేద్యమొసగిన కనకమ్మగారి జోడు కవయిత్రి ఎటుతిరిగి ద్రోణంరాజు వీరమతి (5)
  17. వినోదం లేకుంటే ఈ ఆచార్యుడు గట్టిగా పలికే బాబావే (3)
  18. బాబాసాహెబ్ నడిపిన పత్రిక తరువాత ప్రబుద్ధభారత్‌గా మారింది (3)
  19. కశ్మీర్లో కాంతా సైన్యాన్ని నడిపించిన వజీరు పొడిగా (2)
  20. ఈ నారాయణ రెడ్డి మొదటి ఎన్నికలలో నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణా యోధుడు (2)
  21. చివరి గవర్నర్ జనరల్‌జీ (3)
  22. పాండురంగ ఫల్ దేశాయ్ కుమారుడు (2)
  23. ఓహో అని జగమే ఊగిన కాకోరి కుట్రలో సూత్రధారి (3)
  24. భారత దేశాన్ని కనుగొన్న కాకా (2)
  25. ఝార్ఖండ్ బిర్సా (2)
  26. ఆంధ్ర సర్వస్వము కర్త (4)
  27. ‘బిషబృక్ష’ వ్రాసిన ఆనంద చంద్రుని కొన (3)
  28. ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా జైలులోనే, మోది నమస్కరించిన కృష్ణభారతి పుట్టింది కూడా అక్కడే (3)
  29. కన్యను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చే రకం ఈ పల్నాటి వీరుడు (4)
  30. అల్లువారి మనుమడు వాపోయిన పాత్ర (3)
  31. సిక్కువీరసింహాల నామసారూప్యం (2)
  32. విదేశమున దేశపతాకను తొలిసారిగా పైకెత్తిన మేడమ్ (2)