మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ, న్యూయార్క్ సిటీ. క్రిస్మస్ సీజన్ 2019.
ఆ సాయంత్రమంతా ఆపుకోలేని ఉత్కంఠ. ఆ పార్టీ హాల్లో అతడున్నాడు. నేనున్నా. నేను ఎవరెవరితోనో మీద మీద పడిపోయి మాట్లాడుతున్నా. షాంపేన్ గ్లాస్ తాకించి ఛీర్స్ చెపుతున్నా, కౌగిలిస్తున్నా. కనిపించకపోయినా అతడి నవ్వులు నాకు పార్టీలో వినిపిస్తూనే ఉన్నయ్యి. అతడి చుట్టూ మారే ఆడగొంతులు. అందరితో అతడి మర్యాద నిండిన పలకరింపులు. నవ్వులు, నవ్వులు. ఐపోయింది, పార్టీ ఐపోయింది, గుంపు చెదిరిపోతూంది. ఇంకో రెండు నిమిషాలు గడిస్తే, తలుపు తోసుకుని బైటపడితే చాలు, విముక్తి. ఆశ్చర్యంగా ఇద్దరం ఒకేసారి బరువు తలుపు హేండిల్‌పై మోపిన చెయ్యి, స్తంభించిన నా ఊపిరి, బైట అతడు నాకు తొడిగే కోట్, సవరించే కాలర్, మర్యాదగా తీసి పట్టుకున్న కేబ్ డోర్, తలుపులో పడకుండా సర్దే స్కర్ట్. నా చెయ్యేనా అతడిని కేబ్ లోకి లాగింది, నేనేనా కేబ్ డ్రైవర్‌కి నా హోటల్ అడ్రస్ చెప్పింది, అతనా?
O! It’s a haze!
మన్హాటన్ యెల్లో కేబ్ బంపీ రైడ్‌లో, నిసి షామల్ ఒక్కసారి తల విదిలించి మైకం లోంచి ప్రస్తుతంలో పడింది. అతడి కోట్ లేపెల్ ఇంకా నిసి చేతిలో. ఆమె వెనుకగా కేబ్ సీట్ మీద అతని బలమైన చెయ్యి. అతడి సందిటలో, ఇద్దరి అస్తవ్యస్తపు కోట్ల మడుపుల్లో నిసి.
షాంపేన్ గిడీనెస్ తగ్గుతూంది. అతడి నవ్వు ముఖం కనిపిస్తోంది.
“షామల్! ఎక్కడికి? వేర్ ఆర్ ఉయ్ గోయింగ్? ఎక్కడికని చెప్పను కాబ్ డ్రైవర్‌కి?” అన్నాడతను ఆమె ముఖం ముందు చెయ్యాడిస్తూ, నవ్వుతూ.
“కాన్రాయ్! నే ఉన్న హోటెల్, హిల్టన్-మిడ్ టౌన్, ఐ థింక్!” అంది నిసి షామల్.
“యూ షూర్!? నేను ఉంది తాజ్ ఆన్ సిక్స్టీ ఫస్ట్ స్ట్రీట్. అక్కడికి వెడదాం. కొంచెంసేపు లౌంజ్‌లో మాట్లాడుకున్నాక, మీ హోటల్లో దింపి వస్తా” అన్నాడు పీటర్ కాన్రాయ్. నిసి సమాధానం కోసం ఆగకుండానే కేబ్ డ్రైవర్‌కు, ద పియెర్ అని చెప్పాడు.
“దట్స్ నైస్, పరాఠా, మేంగో లస్సీతో సేదతీరొచ్చు. కాని, ఈ టైమ్‌లో సర్వ్ చేస్తారో లేదో? నేను షాంపేన్, వైన్ మానెయ్యాలి పార్టీలలో. ఆ కేటర్డ్ ఫుడ్‌లో ఏం ఆలర్జెన్స్ ఉంటయ్యో అని భయపడి సాంతం పార్టీలలో తినటం మానేసి తాగటం ఒక్కటే చేస్తే, ఐ యామ్ గెటింగ్ లైట్ హెడెడ్. కాన్రాయ్, నాకు కాస్త ఫుడ్ పెట్టించు. పదిహేను, ఇరవై ఏళ్ళైందా మనం కలిసి? యూ వాంట్ టు రెమినిస్? రీహాష్!”
“నాట్ ఎక్జాక్ట్లీ! లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. నువ్వు నన్ను గుర్తు పట్టదలచలేదేమో అనుకున్నాను. ఐ యామ్ ఫ్లాటర్డ్!”
“ఈ షాన్ కానరీ స్టైల్ గడ్డం. ఇది నాకు తెలిసినప్పటికి లేదుగా?” అతని గడ్డం మీద తన చేతితో రాస్తూ అంది నిసి. “జస్ట్ ఇనఫ్ రఫ్‌నెస్. ఇట్ సూట్స్ యూ. ఐతే, నేను గుర్తించటానికి నీ వాయిస్ చాలు. పార్టీలో వినగానే నువ్వక్కడ ఉన్నట్టు నాకు తెలిసింది. ఐనా గెస్ట్ లిస్ట్‌లో డాక్టర్ల కన్నా మీ పేరు ప్రముఖంగా ప్రచురించారు గదా. ఏదో ఒక ఆంకాలజీ సొసైటీకి పెద్ద డొనేషన్ ఇచ్చి ఉండాలి మీ ఫర్మ్.”
“మరి, నన్ను పలకరించనే లేదే. నిజానికి, పార్టీకి నేను సైన్ అప్ చేసింది మీరొస్తున్నట్టు ఆర్గనైజర్స్ కన్ఫర్మ్ చేశాకే. మిమ్మల్ని ఫ్లారిడాలో వెతుక్కుంటూ రానక్కర్లేకుండా, న్యూయార్క్‌లో కలవటం మనకిద్దరికీ సుఖం! కాదూ!”
“సీరియస్లీ! ఇన్నేళ్ళ తర్వాత నా కోసం ఎందుకు తమరు వెదకటం? ఐ లెఫ్ట్ నో లూజ్ ఎండ్స్ ఇన్ బిజినెస్ బిహైండ్!” నిసి. మళ్ళీ-
“పీటర్ కాన్రాయ్! దిస్ కైండ్ ఆఫ్ కేబ్ రైడ్ ఈజ్ అన్యూజుయల్ ఫర్ అజ్! మనకు మామూలు అలవాటు, తమరు కంపెనీ కారు డ్రైవ్ చెయ్యటం, నేను పక్క ఫ్రంట్ సీట్లో కూర్చుని మీరు తీసుకెళ్ళిన చోటకల్లా వెళటం కాదూ! మనం ఎప్పుడూ ఒకరి పక్కన ఒకరం ఇలా కారు బేక్ సీట్లో ఆనుకుని కూర్చోటం చెయ్యలేదు. హౌ డేర్ యూ పీటర్!” అంది నిసి నవ్వుతూ, అతడి స్కార్ఫ్ మెలిపెడుతూ. అంటం అన్నదే కాని, అతడికి దూరం జరగటానికి ఇంతకూడా ప్రయత్నం చెయ్యలేదు. హి ఈజ్ హేండ్సమ్ బియాండ్ బిలీఫ్. ఈజ్ హి ఫర్ రియల్! బేక్ ఇన్ హర్ లైఫ్! కలకాదు కదా!
“ఐ విల్ బి హేపీ టు బి యువర్ షోఫర్ ఎగెయిన్! న్యూయార్క్ తాజ్‌లో ఇంకో పది రోజులన్నా ఉంటాను. కెన్ ఐ టేక్ యూ ఎరౌండ్?”
“హౌ నైస్! అలా ఐతే, ఐ విల్ హావ్ యువర్ స్కెడ్యూల్ రెడీడ్ ఫర్ యూ! ఇప్పటికి హిల్టన్‌లో దింపేసి వెళ్ళండి. రేపటి నుంచీ ఐ యామ్ ఆల్ యువర్స్! మేనేజ్ మీ ఆజ్ బిఫోర్!”
“వండర్ఫుల్! మే ఐ కిస్ యూ నౌ? ఇట్స్ మై క్రిస్మస్ విష్! ఐ స్వేర్ ఆన్ సేంటా. నో ఆలర్జెన్స్! ఫుడ్ అసలేం అంటుకోలేదు. యు ఆర్ టోటల్లీ సేఫ్” అన్నాడు పీటర్ కాన్రాయ్.
హిల్టన్ ముందు కేబ్ ఆగిందాకా, అతడి కౌగిలి నిసి షామల్ వీడనే లేదు. చెంపల నిమురులకు, మెడపై, చెవిపై, పెదవులపై అప్పుడప్పుడూ ముద్దులకూ ఇద్దరిలో ఎవరూ అభ్యంతరపెట్టనూ లేదు. వెల్! వాళ్ళ మధ్య ఇప్పుడు ఏ రిలేషన్షిప్ కాంట్రాక్ట్స్ ఏమీ లేవు. వారు స్వతంత్రులు.
ప్రతి క్రిస్మస్ సీజన్లో, బిగ్ ఆపిల్‌లో ఎన్నో పొలిటికల్ ఇవెంట్స్, కల్చరల్ ఇవెంట్స్, సైంటిఫిక్ ఇవెంట్స్. సిటీ టూర్ రైడ్స్, సైడ్‌వాక్ మార్కెట్స్, ఫేర్స్. గ్రాండ్ సెంట్రల్లో, పెన్ స్టేషన్లో, సబ్వేలలో, మన్హాటన్ స్ట్రీట్లు, ఎవెన్యూలలో డబుల్ డెకర్లలో ఎక్కడ చూడూ మనుషులు. మనుషులు. టూరిస్టులు. టూరిస్టులు. అంతటా ఉత్సాహం. పేవ్మెంట్ల మీద షూ టకటకలు. ట్రాఫిక్ పోలీస్ విజిల్స్. క్రాస్ వాక్స్‌లో ఆగీ, సాగే జన సందోహం. ప్రతి స్ట్రీట్ కార్నర్లో గొడుగుల కింద హాట్ డాగ్స్, హలాల్ ఫుడ్ వెండర్స్‌కి కొదవలేదు. ప్రత్యేకంగా, హిల్టన్ పక్క సందులో హలాల్ వెండర్ ముందు, వారి ఫుడ్ రుచి మరిగి లైన్లలో జనం పడే పడిగాపుల గురించి న్యూస్ పేపర్స్ ద్వారా అందరికీ తెలుసు. సిటీలో ఎంపైర్ స్టేట్ బిల్టింగ్, రేడియోసిటీ మ్యూజిక్ హాల్, మేడిసన్ స్క్వేర్ గార్డెన్ లాగా వారూ కల్చర్‌లో ఒక భాగమైపోయారు.
ఆ వారంలో వల్డ్ ఆంకాలజీ ఫ్యూచర్ అప్రోచెస్ మీటింగ్ పలుదేశాల ఆహూతులతో, టైమ్ స్క్వేర్ మారియట్ మార్క్వీ కాన్ఫరెన్స్ సెంటర్లో కోలాహలంగా జరుగుతూంది. అది కాక, ఆ సాయంత్రం అదనంగా న్యూయార్క్-అమెరికన్ నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ బిల్డింగ్‌లో రేడియేషన్ థెరపీలో ప్రప్రథములలో ఒకడైన డా. న్యూమన్ 100వ జన్మదినోత్సవం పార్టీ కొద్దిమంది ఇన్నర్ సర్కిల్ స్నేహితులతో ఒక కోజీ కాన్ఫరెన్స్ హాల్లో కులాసాగా గడిచింది. న్యూమన్, ఇంక కొన్నేళ్ళలో రేడియోథెరపీ ఎక్స్టింక్ట్ ఐపోతుందున్న తన నమ్మకానికి చిహ్నంగా తనకిచ్చే పార్టీని సరదాగా మ్యూజియమ్ లోని డైనసార్స్కి దగ్గర్లో చెయ్యమని అడిగాడు. ఆ రోజు పార్టీలో చాలామంది సిటీలోను, ఇంకా బయటి రాష్ట్రాలలోనూ, విదేశాల్లోనూ తమ సాంకేతిక, శాస్త్రీయ విజ్ఞానం వారి మెడికల్ ప్రాక్టిస్ ద్వారా, టీచింగ్ ద్వారా అందుకొని, ఇతరులకు అందజేసినవారే. భద్రిసేన్, న్యూయార్క్‌లో మేజర్ సెంటర్స్‌లో ఛెయిర్మన్గా పనిచేసి, ఓ నాలుగేళ్ళు వియన్నాలో ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీకి, కేన్సర్ సెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా స్టాండర్డ్స్ నిలపటానికి ఎడ్వైజర్‌గా ఉండి వచ్చాడు. ఆ ఏజెన్సీకి 2005లో నోబెల్ రికగ్నిషన్ లభించింది. చిట్టి, బెత్ ఇస్రయెల్కు ఛైర్మన్. దత్తా, ఇండియాలో కేన్సర్ సెంటర్లకు ఎడ్వైసర్. షలోమ్ పిట్స్‌బర్గ్‌లో కొన్నేళ్ళుండి, ఇప్పుడు మాంటిఫ్యూరీకి ఛైర్మన్. షెన్ యూనివర్సిటీ రాఛెస్టర్లో ఛెయిర్. మెక్కార్మిక్ ఇంకా మెమోరియల్ బ్రెస్ట్ సర్వీస్ విడవలేదు. ఆంకాలజీలో ఛార్లీ, నెమ్ హుస్సేన్‌తో పనిచేసిన ఎందరో దరిమిలా, సరికొత్త టైటిల్స్‌తో, దేశంలో మేజర్ ఆంకాలజీ సెంటర్స్ అధిపతులుగా ఉన్నారు.
అలా సుదీర్ఘ కాలం వైద్యరంగంలో గడిపే వారందరితో పాటు, అర్ధంతరంగా కేన్సర్ ఫీల్డ్ వదిలేసిపోయిన తనకు ఆ స్పెషల్ పార్టీకి ఇన్విటేషన్ రావటమే నిసిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఆర్గనైజ్ చేసిన డాక్టర్ ఫార్కాకి, మరి కొందరు పెద్దలకు, చిన్నలకు, పార్టీ ఛీఫ్ ఆనరీ డాక్టర్ న్యూమన్కు కూడా నిసి షామల్ అంటే గుండెలో సాఫ్ట్ స్పాట్ ఉందని తెలుసు. చూస్తానికి జాన్ న్యూమన్, బక్కపలచగా, అచ్చంగా ఏక్టర్ ఏలెక్ గిన్నిస్ లాగా ఉండేవాడు. ఆయన ఇంగ్లిష్ ఏక్సెంట్లో, లార్డ్ టెనిసన్ పొయట్రీ, షేక్స్పియర్ సానెట్లు వినిపించి వివరిస్తే గదా అతడి రెసిడెంట్లకు అందులోని ఇంగ్లిష్నెస్ తెలిసింది! న్యూమన్ దగ్గర ఆమె ట్రెయిన్ అవుతున్న కాలంలో, ఆ పెద్దాయన ఆమెను ఛార్ట్ రౌండ్స్ లోను, ఫ్లోర్ రౌండ్స్ లోనూ, అందరి ముందూ ‘హనీ ఛైల్డ్’ అని పిలిచేవాడు. కొన్నేళ్ళ కితం, అతడి రిటైర్మెంట్ గౌరవ సభలో, డాక్టర్ నిసి షామల్ ఒక స్పీకర్. ఒక పాత ఎపిక్ సినిమా లోంచి డైలాగ్ వాడుతూ, ఆయనను ‘డోంట్ గో ఓల్డ్ క్రోకొడయిల్! డోంట్ లీవ్! స్టే!’ అనగలిగిన ఆమె ఆప్యాయత – ఎందరో పాత జెనరేషన్ డాక్టర్లను ఆనందపరిచింది. అందుకే వారి పట్టుదల మీద ఆమె పార్టీకి రావలసివచ్చింది.
ఏ రోజుకారోజు పోతాడేమో అనిపిస్తూ, బక్కపలచగా ఊగిసలాడుతూ వార్డుల్లో తిరిగిన న్యూమన్ నూరేళ్ళు ఉన్నాడు. నిసి పుణ్యమా అని ‘ఓల్డ్ క్రోకొడయిల్’గా అతడికి పేరు మెడికల్ చరిత్రలో నిలిచిపోయింది.
ద పియెర్ హోటల్, సిక్స్టీ ఫస్ట్ స్ట్రీట్, కార్నర్ ఆఫ్ ఫిఫ్త్ ఎవెన్యూ.
నిసిని హిల్టన్ ముందు దింపేసి, ఓ ఆరేడు స్ట్రీట్ల అవతలున్న హోటెల్ పియెర్-తాజ్ ముందు కేబ్ దిగిన పీటర్ కాన్రాయ్ మనసులో బహు ఉత్సుకుడై ఉన్నాడు.
ఎందుకు షామల్ ఇన్నేళ్ళ ఎడబాటు తరవాత కూడా తనను ఎనర్జయిజ్ చేస్తుంది! ఏమిటి ఆమె మేగ్నెటిక్ పవర్. ఆ లీనియర్ ఏక్సెలరేటర్స్ నుండి ఆమెకు గాని కొన్ని మేజికల్ పవర్స్ సంక్రమించాయా? షి ఈజ్ స్టిల్ సో ప్రిట్టీ. సో టుగెదర్.
అతడి మనసు ముందస్తుగా ఎన్నో సంవత్సరాల క్రితం వాషింగ్టన్ డి.సి. క్రీగర్ మ్యూజియంలో, డోసెంట్‌గా నిసికి, తను ఆ భవనం అంతా తిప్పి చూపిన సమ్మర్ డే లోకి వెళ్ళింది. ఆ రోజు అతడు మరిచే ప్రసక్తే లేదు. పీటర్‌కు ఆ మేజికల్ అనుభవం కళ్ళముందు మళ్ళీ హాయిగా పరుచుకుంది. ఆమె అక్కడి ఆర్ట్ వర్క్ తదేకంగా చూసింది. ఎవరూ వారితో అప్పుడు లేనందున, ఆ అపరిచిత ఇండియన్ స్త్రీని వివరంగా చూడగలిగిన అవకాశం అతడికొచ్చింది. షి వజ్ వెరీ ఓపెన్ అండ్ క్లియర్ ఎబౌట్ హర్ ఐడియా ఆఫ్ లవ్! హర్ హీరోస్! హర్ ఫేవరెట్ రైటర్స్, హర్ ఫేవరెట్ ఆర్ట్!
ఆమె అతడిని ఆ చిన్నమిలనంలో మెస్మరైజ్ చేసింది.
తన తర్వాతి ప్రొఫెషనల్ కెరియర్‌కు కీలక బీజం ఆమెతో గడిపిన ఆ సమయం అని మరొక నరమానవుడికి తెలియకపోయినా, పీటర్‌కు తెలుసుగదా. అతడే కదా, ఆమెను గురించి సమాచారం సేకరించి, నిసి ఉండే ఊరు, ఆమె ఆంకాలజీ ప్రాక్టీస్ వివరాలు తెలుసుకుని, తన తండ్రి బిగ్ పీటర్‌తో, వాళ్ళ ఆర్కిటెక్చరల్ ఫర్మ్‌లో ఒక కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ ఓపెన్ చేయించిందీ, ఆమెకు అతి దగ్గరగా పని చేసే అవకాశం కల్పించుకుందీ! ఆ విషయం తనకు తప్ప, బిగ్ పీటర్‌కి కొంచెం కూడా తెలియదే! నిసి కసలే తెలియదు.
అన్యమనస్కంగా డోర్మెన్కీ పోర్టర్లకూ తల ఊపుతూ లాబీలో, ఇండియన్ ఆర్టిస్ట్ హుస్సేన్ గీసిన సితార్ పెయింటింగ్ దగ్గర ఆగాడు. నిసి హిల్టన్‌లో, నేను తాజ్‌లో ఇక్కడ వంటరిగా, ఇండియన్ పెయింటర్స్ ఆర్ట్ చూస్తూ.
అతడు తన పొడుగు కోట్‌ను తన చుట్టూ దగ్గరగా లాక్కున్నాడు. ఆ కోట్లో ఆమె పర్ఫ్యూమ్ ఇంకా ఒదిలిపెట్టకుండా. ఫ్రాంజిపానీ? మైఖేలియా చంపకా? నిసి షామల్ గతంలో కొన్ని సంవత్సరాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను అజమాయిషీ చేసింది చాలదా? షి ఈజ్ మెసింగ్ మి అప్ ఎగెయిన్! ద విచ్!
అతడు నిసికి టెక్స్ట్ పంపకుండా నిగ్రహించలేకపోయాడు.‘నిసీ! తాజ్‌లో నాతో పాటు వచ్చి ఉంటావా ప్లీజ్! న్యూయార్క్‌లో ఉన్నన్ని రోజులూ నాకు దగ్గరగా ఉండాలని… అంతకన్నా ఏం లేదు.’
వెంటనే వచ్చింది రిప్లయ్. ‘ష్యూర్! అలాగే చేద్దాం. యూ హేవ్ ఇనఫ్ స్పేస్!? రైట్? పీటర్! రేపు సాయంత్రం మోజార్ట్ మేజిక్ ఫ్లూట్, మెట్ ఓపెరా హౌస్. ఐ హావ్ టు సీట్స్! మీట్ మి నియర్ ద ఫౌంటెన్. గుడ్ నైట్!’ స్కానబుల్ టికట్ ఆ టెక్స్ట్ వెనకాలనే.
‘జీసస్! షి ఈజ్ ఇన్ ది డ్రైవర్ సీట్ ఎగెయిన్!’ అనుకున్నాడు పీటర్.
లింకన్ సెంటర్ ప్లాజా.
క్రిస్మస్ ఇల్యూమినేషన్స్తో లింకన్ సెంటర్, దాని పరిసర ప్రాంతం అంతా మెరిసిపోతున్నది. ఒక పక్క డేవిడ్ కాచ్ థియేటర్, మరోపక్క డేవిడ్ గెఫ్ఫెన్ హాల్, మధ్యలో మెట్రొపాలిటన్ ఆపెరా హౌస్, ముందు రెవ్సాన్ ఫౌంటెన్, చుట్టూ విశాలమైన టెరేస్. వీటన్నిటికీ దారితీస్తూ, మ్యూజిక్ అండ్ ఆపెరా లవర్స్‌ను ఆహ్వానిస్తూ వివిధ దేశాల భాషలలో ‘స్వాగతం’ అనే మాటలు చెక్కి ఉన్న ఎన్నో మెట్ల వరసలు. ఆ ఆవరణకు వస్తేనే, యాత్రికులకు గుండె ఉప్పొంగిపోతుంది.
నిసి, పీటర్ ఇద్దరూ వేరు దిశల నుండి నడిచి వచ్చి ఫౌంటెన్ ముందు కలుసుకుని, ఒకరి కుశలం ఒకరు తెలుసుకొని, ఒకరి నడుము చుట్టూ ఒకరు చేతులు చుట్టి, లోనికి నడిచారు. మాజిక్ ఫ్లూట్ ఆపెరా, పీటర్‌తో కలిసి మెట్లో చూడటం నిసికి చక్కని అనుభవం. ఆమెకు పీటర్ మొదటి పరిచయం, ఆర్కిటెక్ట్ ఫిలిప్ జాన్సన్ నిర్మించిన క్రీగర్ మ్యూజియమ్ లోనే కదా. అప్పుడే ఫిలిప్ జాన్సన్ గురించి కొంత చెప్పాడు తనకు. ఫిలిప్ జాన్సన్, మేక్స్ ఏబ్రమొవిట్జ్ పెద్దపాత్ర వహించి నిర్మించిన లింకన్ సెంటర్ ఆవరణలో వాళ్ళు ఇప్పుడు కలిసి తిరగటం, ఇట్స్ అన్బిలీవబ్లీ స్వీట్!
అంతకన్నా గొప్ప విషయం -గత కొన్నేళ్ళుగా పీటర్ తన తండ్రి ఆర్కిటెక్చర్ ఫర్మ్‌లో లీడ్ రోల్ తీసుకుని, సీరియస్‌గా పనిచేస్తూ, ప్రశంసనీయమైన రెసిడెన్షియల్ బిల్డింగ్లు అమెరికాలో నిర్మించటం. ఇంతవరకూ అతనితో తనుగా ప్రస్తావించకపోయినా, నిసికి అదెంతైనా ఆనందదాయకం అయ్యింది.
మేజిక్ ఫ్లూట్ ఇంకా చూడకముందే, ఆ మెట్రొపాలిటన్ ఆపెరా హౌస్, ఆ షాండెలీర్లు, రేంప్లు, అతి చక్కగా అలంకరించుకుని వచ్చిన వివిధ దేశాలవాళ్ళు. పానీయాలు, స్నేక్స్ తెచ్చుకుని చిన్న రౌండ్ టేబిల్స్ చుట్టూ నించుని, కబుర్లాడేవాళ్ళు! ఆ సందడికే వారిద్దరికీ కడుపు నిండుతూంది. మధ్య మధ్య మోగే ఇద్దరి సెల్స్! అందరి సెల్స్! షో కన్నా ముందుగానే ఆలెక్స్ నుంచి నిసికి క్రిస్మస్ గ్రీటింగ్స్! ఒక పిల్లి పియానో మీద గెంతుతూ, స్వరం పలికిస్తూంది. పీటర్‌కి ఆ గ్రీటింగ్ కార్డ్ వినిపించి, నేపుల్స్లో తన పియానో ప్రొఫెసర్ అతడని చెప్పింది. ఆలెక్స్ కూడా ఒకప్పుడు న్యూయార్కర్. జూలియార్డ్లో కొన్నాళ్ళు చదువుకున్నాడు. ఆ మ్యూజిక్ స్కూల్ లింకన్ సెంటర్లో భాగమే కదా. ఆమెకు ఒకే సమయంలో, తన స్నేహితులందరితో, పరిధి నిర్ణయించలేని ఒక సర్కిల్ ఆఫ్ లవ్ లో ఉన్న విచిత్ర భావన.
ఈ మోజార్ట్ ఆపెరా, క్రిస్మస్ సీజన్లో ముఖ్యంగా పిల్లల వినోదం కోసం కొంత కుదించి, ఇంగ్లిష్ లిబ్రెట్టోతో ప్రదర్శించబడింది. హాల్ మొత్తం సోల్డ్ ఔట్! మోజార్ట్ మ్యూజిక్‌లో ‘ఛైల్డ్ లైక్’ క్వాలిటీ, ప్యూరిటీ ఉంటుంది. అతడిది అన్ని దేశాలవాళ్ళు, అన్ని వయసులవాళ్ళు ఆనందించగలిగే సంగీతం -అని నిసికి ఆలెక్స్ తన లెసన్‌లో చెప్పిన మాటలు నిజమనిపించాయి. చాలా ఆనందించారు ఆపెరా ఇద్దరూ.
ఆ రాత్రి, తాజ్‌లో పీటర్ గదిలో ఇంటర్‌కామ్ మోగింది. అతను పైజమాలలో, బెడ్ కవర్స్ కింద ఉండి, తన లేప్‌టాప్‌లో ఏవో బిజినెస్ లెక్కలు చూసుకుంటున్నాడు.
“యా, నిసీ!”
“హేయ్ పీటర్! థింక్ యూ కెన్ స్కూట్ ఓవర్? నా బెడ్ మరీ చల్లగా ఉంది. వచ్చి వేడి చెయ్యవోయ్!”
అతడి గుండెలో భేరీలు మోగినయ్యి. ఎప్పటికీ రాదనుకున్న ఆహ్వానం, ఎలాగైతేనేం, ఏళ్ళ తరవాత వచ్చింది. బెటర్ లేట్ దేన్ నెవర్! ఏ బహుమతి ఏ సంవత్సరంలో వస్తుందో ఎలా చెప్పటం.
“ష్యూర్ మేమ్! రైట్ అవే!” అని తన స్వీట్ లోని, రెండో బెడ్రూమ్ లోకి దారితీశాడు. నిసి షామల్ “ఇండియన్ డెకొర్తో ఈ రూమ్ చాలా అందంగా ఉంది, థాంక్యూ!” అంటూ అతన్ని చేతులు చాపి స్వాగతించింది. ఏ దేశంలో ఉంటేనేం గాక, తాజ్ ఈజ్ ఫర్ రొమాన్స్ ఆఫ్టర్ ఆల్!
కార్టియే స్టోర్, ఫిఫ్త్ ఎవెన్యూ.
ముందుగా ఆమెను మేడిసన్ ఎవెన్యూ షాపింగ్ హాట్‌స్పాట్‌లో విడిచిపెట్టి, “టైమ్ స్క్వేర్ జావిట్స్లో మా బిజినెస్ క్యూబికల్స్, ఎక్జిబిట్స్ ఎలా నడుస్తున్నవో కాసేపు సూపర్వయిజ్ చెయ్యాలి. ఏవైనా వెంటనే జవాబివ్వవలసిన రిక్వెస్టులు ఉన్నయ్యేమో చూడాలి. నిసీ, కాల్ మీ వెన్ యు నీడ్ మి డెస్పరేట్లీ.” అనేసి వెళ్ళిపోయాడు పీటర్.
నిసి అక్కడి షాప్స్ డెకరేషన్స్ చూస్తూ, అక్కడో లేటెస్ట్ ప్రింట్ స్కార్ఫ్, ఇక్కడో డిజైనర్ స్వెటర్, మరోచోట కేప్, గ్లవ్స్, ఇంకోచోట ఫేన్సీ సాక్స్, మరో స్టోర్‌లో లాంజ్రే, ఎక్స్పర్ట్ సేల్స్ పీపుల్ రికమెండ్ చేసిన క్వాలిటీ బ్రాండ్స్ – ఖరీదు మోపైనా, చాలా తేలికగా తను మొయ్యగలిగినవి మాత్రమే కొంటూ, మిగతా షాపర్స్ ఆనందోత్సాహాలు చూస్తూ, నడుస్తూ, కార్టియే బిల్డింగ్ చుట్టూతా కట్టిన ఎఱ్ఱ రిబ్బన్‌ను ఎంతో ఆనందంగా చూసి లోపలకు వెళ్ళింది.
గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం దూరం వెళ్ళిందో లేదో, “కెన్ ఐ హేవ్ ఎ మినిట్ ప్లీజ్!” అని ఒక స్త్రీ గొంతు.
తనను పిలిచేదెవరు? ఆశ్చర్యంగా చూసింది. ఒక వాచ్ చేతిలో తిప్పుతూ, ఒక జ్యుయెలర్ ముందో స్త్రీ.
“మీరు నాకు సరైన సలహా ఇవ్వగలరనిపిస్తోంది. ఎస్! మీరే! ఆ తలుపులోంచి దూసుకు వచ్చి, ఆ మెరిసే, ఎగిరే, పొడవాటి జుట్టుతో ఈ ఫ్లోర్ అంతా ఒక్కసారి వెలిగించేశారు. ఈ వాచ్ మీకెలా ఉంది? కొనొచ్చా, సలహా చెప్పరూ?”
‘ఇట్స్ ద క్రేజీ సీజన్!’ అనుకుని పైకి, “ఇంతమటుకూ నన్నెవరూ మా ఇంట్లోవాళ్ళు కూడా షాపింగ్ విషయంలో సంప్రదించలేదు. నన్నేనా మీరు ఆపింది! చాలా ఆశ్చర్యం!” అంది నిసి.
“ఐ లవ్ యువర్ పీకాక్ కలర్ సిల్క్ కోట్! మీ స్పార్క్లింగ్ డైమండ్స్, మీ చక్కని ముఖం. మీ చేతినున్న ఆ రంగు రంగుల పెద్ద డయల్ వాచ్. లవ్ ఆల్ ఆఫ్ దెమ్. దట్స్ వై.”
థాంక్యూ -అంటూ నిసి, కొంచెంసేపు సేల్స్‌మన్, కొంచెంసేపు ఆ స్త్రీ మనసు గ్రహిస్తూ చాతుర్యంగా మాట్లాడి, ఏమీ సలహా ఇవ్వకుండా తప్పించుకుని ఎలివేటర్లో పై ఫ్లోర్లకు వెళ్ళిపోయింది.
రకరకాల నగలు కాసేపు చూశాక, ఆమె మనసులోని కోరిక అక్కడి జ్యుయలర్లకు బైట పెట్టింది. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకుని, కేటలాగ్లు చూసీ చూపించీ, వేరే ఫ్లోర్ నుండి ఒక జ్యుయలరీ పీస్ తెప్పించారు. తర్వాత కౌంటర్ పైన వెల్వెట్ డిస్ప్లే పేడ్ మీద ఆమె అడిగిన ఆభరణం పెట్టి చూపినప్పుడు, ఆ అపురూపమైన నాణ్యమైన పనితనాన్ని కొంచెంసేపు తదేకంగా చూసి, “ఐ యామ్ బైయింగ్ ఇట్!” అంది నిసి.
లిటిల్ ఇండియా, ఈస్ట్ 27 స్ట్రీట్, లెక్సింగ్టన్ ఎవెన్యూ.
“ఈ శనివారం లిటిల్ ఇండియాలో (కర్రీ హిల్) పొంగల్ రెస్టరాంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి కొందరం కలుస్తున్నాం, 12-1 గంటల మధ్యలో. కెన్ యూ జాయిన్ ఇన్ పీటర్!”- నిసి రిక్వెస్ట్ టెక్స్ట్.
“లవ్ టు!”
పొంగల్‌లో టేబుల్స్ జత చేసి, వరసగా కూర్చుని ఉన్నారు, స్నేహితులు వాళ్ళంతా. అప్పటికే సౌత్ ఇండియన్ థాలీలు, పళ్ళెం కన్నా పొడవున్న మసాలా దోసెలు, కొన్ని పళ్ళేలలో ఇడ్లీలు, వడలు వచ్చి ఉన్నయ్యి. ఊతప్పం, పెరుగు గారెలు, పులిహోర, సాంబారు, జీడిపప్పు ఉప్మా, యోగర్ట్ రైస్, మేంగో జ్యూస్, లస్సీ, మద్రాస్ కాఫీ, ఇండియన్ మసాలా టీ సువాసనలతో వాళ్ళ నోరూరిపోతూంది. కొందరప్పుడే రసమలైలు, కేరట్ హల్వా, గులాబ్‌జామూన్ కూడా తెప్పించేశారు. ప్రపంచంలో ఇండియన్ ఫుడ్ ఇష్టపడని వారెవరు? అందరికీ స్నేక్స్, డిసర్ట్ పేర్లు, మీఠా పాన్ దొరికే చోట్లు కంఠతా వచ్చు. ఎవరూ ఒకరి కోసం ఒకరు ఆగకుండా తినెయ్యమని ముందే చెప్పుకుని ఉంటంతో, కొంతమంది హాయిగా తినేస్తున్నారు. చేతులు, చాప్ స్టిక్స్, నైఫ్ అండ్ ఫోర్క్‌లు ఆల్ ఆర్ గుడ్! అక్కడ అన్ని నేషనాలిటీల వాళ్ళు – సుమ, శైలబాల, స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు, విజిట్ చెయ్యటానికి వచ్చిన పేరెంట్స్, వాళ్ళ పాత, సరికొత్త స్పౌసులు, లేటెస్ట్ లవ్ ఇంట్రస్ట్స్, ఇలా ఎన్నోరంగులవాళ్ళు, వయసులవాళ్ళు ఉన్నారు.
పీటర్ వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు, తను నిసి స్నేహితుడినని. అతడికి ఇలాటి సంతలు అసలుకే కొత్తకాదు. నిసి కూతురు సుమ, సారీ! మా అమ్మ, ఇంకా రాలేదు, ఎక్కడుందో, అని, అక్కడున్న వారిని కొందరిని పరిచయం చేసింది. వరసగా, అటూ ఇటూ -శైలబాల, పల్లవి, శ్రీధర్, చింగ్, కైకో, చాంగ్, టామ్, ఎసూస్, మేరియాన్ – ఇలా పేరు పేరునా.
పీటర్, సుమ కెదురుగా సీట్ అడిగి కూర్చుంటూ, “మీ మదర్ సెంట్ పాట్రిక్ కెథెడ్రల్‌లో, లేకుంటే సెంట్ థామస్ చర్చ్ లోనో కేండిల్స్ వెలిగించి వస్తానికి చాలా పొద్దున్నే వెళ్ళింది. ‘నిక్ యూ’లో మీ ఫేమిలీ నుంచి ఒక బేబీ అడ్మిట్ అయి ఉందంట కదా! ఆ బేబీ క్షేమానికై, ప్రార్థన చెయ్యటానికి పెందలాడే వెళ్ళింది.”
“ఆ! మా అమ్మ ఏదో ఒక చర్చ్‌లో, క్రిస్మస్ మాస్ వింటానికి కూడా తప్పకుండా వెడుతుంది. ఆ లైన్లు కొన్ని బ్లాక్‌ల చుట్టూ తిరిగి ఉంటాయా, ఐనా ఆనందంగా నిల్చుంటుంది. వేరే క్యూలైతే చాలా విసుక్కుంటుంది కాని చర్చ్ మ్యూజిక్, ప్రేయర్లు మా అమ్మకు చాలా ఇష్టం.”
“హిల్టన్ లొకేషన్ ఈజ్ వెరీ కన్వీనియంట్! అందుకేగా ఆంటీ, సిటీకి వచ్చినప్పుడు ఎప్పుడూ అక్కడుంటుంది.” పల్లవి.
మసాలా దోసె, నీట్‌గా కట్ చేసుకుని తింటూ, “నిసి అక్కడ లేదిప్పుడు. నాతో పాటు తాజ్‌లో ఉంది. అదీ మంచి లొకేషనేగా. ఉయ్ కెన్ జాగ్ ఇన్ సెంట్రల్ పార్క్ ఎవ్రీ డే.” పీటర్.
చాలామంది ముఖాల్లో ఆశ్చర్యం. వా…ట్! అని ఒకేసారి ఎంతమంది నుండో!
“మా నిసి అత్త! ఆమె ఎవరితో పాటూ ఉండదు. మా ఎపార్ట్‌మెంట్లలో కాని, హోటల్లో కాని మేం బతిమాలినా ఉండదు. ఆమె ఏర్పాటు ఆమే చేసుకుంటుంది.” శైల.
“మా అమ్మ! నెవర్! ఇంపాస్!” సుమ.
“మీ అమ్మ, నేను. ఉయ్ గో వే బేక్! కొన్ని సంవత్సరాలు, మేం కలిసి పనిచేశాం. ఆల్మోస్ట్ రోజూ కలిసేవాళ్ళం.”
“ఓ! మీరు డాక్టరా?”
“నో. నేను ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ని. ఉయ్ నౌ హేవ్ ఆఫీసెస్ ఇన్ విస్కాన్సిన్, న్యూయార్క్ అండ్ షికాగో. నేను మొదట్లో మీ మదర్ పనిచేసే ఆంకాలజీ ప్రాక్టీస్‌కి, బిల్లింగ్ ప్లస్ ఆఫీస్ స్టాఫ్ రిక్రూటర్, మేనేజర్‌గా పనిచేశాను. నాకు హార్వర్డ్ నుండి మాస్టర్స్, ఎమ్.బి.ఏ. రెండూ ఉన్నయ్యి. అప్పట్లో వాళ్ళ చాలా మీటింగ్స్‌లో నేనుండేవాడిని. వారి ప్రాక్టిస్ పెరుగుతూ వచ్చింది. మా ఫాదర్ వాళ్ళకు టర్న్‌కీ – సేటిలైట్ ఆంకాలజీ సెంటర్స్ మరికొన్ని కట్టాడు. తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా ఇతర డాక్టర్స్ ఆఫీసెస్, కేన్సర్ సెంటర్స్ కట్టాడు. మరి కొన్నేళ్ళకు, యువర్ మదర్ బికేమ్ ద కార్పొరేషన్ సి.యి.ఓ. అండ్ ఛీఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్. కొన్నేళ్ళ తర్వాత మీ అమ్మ ఆ ప్రాక్టిస్ నుండి విరమించినప్పుడు, నేను ఆ ఊరు వదిలేశాను. ఐ వెంట్ ఎబ్రాడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్! ఓ దేర్ షి ఈజ్! మై ఎక్స్ బాస్!”
నిసికి, తలుపు తియ్యటానికి పీటర్ లేచి వెళ్ళాడు. అతను ఆమె వింటర్ కోట్ విప్పటానికి సహాయం చేస్తుండగా; “సుమక్కా, సుమక్కా, చెక్ దిస్ ఔట్!” అంటూ తన సెల్ ఫోన్ ఆమె ముందుకు తోసింది శైలబాల. ఎక్సెలెన్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ తీసుకుంటూ పీటర్ కాన్రాయ్ ఫొటోలు.
ఇంతలోకి నిసి, పీటర్ భోజనాల బల్లల దగ్గరకు వచ్చారు. వాళ్ళు అందరూ గలభాగా ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ తలుపు తోసుకుని వచ్చే మరికొందరిని విష్ చేస్తూ, పలహారాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ, రెస్టరాంట్లో ఎంతో సందడి చేశారు. క్రిస్మస్ ముందుగానే వచ్చేసిందేమో అనిపించింది వారికి. అందరి సెల్ఫోన్లు, మెసేజులు, ఫొటోలతో నిండిపోతున్నయి. ఎవరి ఇష్టాలను బట్టి, కొందరు స్ట్రాండ్ బుక్‌షాప్‌కి వెడదామని, కొందరు హార్లమ్, మేము సోహోకి, మేమూ పిల్లలం బ్రాంక్స్ జూకి, అంటూ కొత్త గుంపులుగా మధ్య మధ్యలో చీలిపోయి వెళ్ళిపోయారు.
58 వెస్ట్ 58 స్ట్రీట్, న్యూయార్క్, సుమ అపార్ట్మెంట్.
అదే శనివారం రాత్రి; వెళ్ళగానే వాళ్ళ కోట్లు తీసుకుని జాగ్రత్త చేసి, వాళ్ళమ్మకు షాంపేన్ ఫ్లూట్ అందించింది, ఛీర్స్! అంటూ సుమ.
పీటర్, ఆమెతో “వెరీ నైస్ ప్లేస్! సెల్జర్ ఫర్ మి ప్లీజ్!” అన్నాడు. నిసి కేసి తిరిగి, “అన్ని సంవత్సరాల మీద, క్రిస్మస్ పార్టీలలో కూడా ఎప్పుడూ ఆల్కహాల్ అంటుకోగా చూడలేదు. ఇప్పుడు డాక్టర్ షామల్ బదులు, షాంపేన్ షామల్ ఐనట్టున్నారే?” అన్నాడు.
సుమకు లోపల కోపం వచ్చింది. ఇతడెవరు? మా అమ్మను విమర్శించేందుకు!
“ఇట్స్ జస్ట్ అవర్ మదర్-డాటర్ రిచ్యుయల్! షి కేంట్ హోల్డ్ లిక్కర్! మేము ఆమెను కలిసేదే చాలా తక్కువ. మీరు మా అమ్మతో కలిసి పనిచేశానన్నారు. వర్క్ ప్లేస్‌లో మా అమ్మను గురించి మాకేమైనా చెప్పగలరేమో, పీటర్!” అంది.
శైలు మరో గదిలోంచి బైటకు వచ్చి తలుపు మూస్తూ, ఆ మాటలు విని, “ఐ సెకండ్ ఇట్! పీటర్!” అంది. గది లోపల కుక్క ఉన్న తార్కాణంగా చిన్న మొరుగులు వినిపించాయి.
వాళ్ళు నలుగురూ మెత్తని సోఫాల మీద సెటిలయ్యారు.
“దేర్ వజ్ దిస్ వన్ మీటింగ్! టు బిగిన్ విత్! నాకు ఇవ్వాళ జరిగినట్టు కనిపిస్తుంది.” అన్నాడు పీటర్.
“గదిలో మధ్య ఒక కాన్ఫరెన్స్ బల్ల. చుట్టూతా కుర్చీల్లో కొన్ని హాస్పిటల్స్ డైరెక్టర్లు, బోర్డ్ మెంబర్స్, ఒకటి రెండు ప్లానింగ్ కమిటీల మెంబర్లు, ఆంకాలజీ డివిజన్ ఛీఫ్‌లు, కూర్చుని ఉన్నారు. ఐ సీ మై ఫాదర్, బిగ్ పీటర్ ఎట్ ద టేబుల్! అతడి స్టాఫ్ ఒకరిద్దరు! మేము కొందరం, అన్ఇంపార్టెంట్ ఎప్రెంటిస్లం, గోడకు పక్కన వేసి ఉన్న కుర్చీల్లో ఉన్నాం. యువర్ మదర్ వాక్స్ ఇన్! ఆమె చేతుల్లో రోల్స్ ఆఫ్ పేపర్!
షి జస్ట్ అన్రోల్స్ దెమ్, ఆన్ ద టేబుల్. ‘ఇవీ నా ప్లాన్స్, కట్టబోయే కొత్త ఆంకాలజీ సెంటర్లకు, హాస్పిటల్స్‌కూ. వేర్ ఆర్ యువర్స్? మీ ఐడియా లేమిటీ? మీ ప్లాన్ లేవీ?’ అంది.
మై ఫాదర్! మా నాన్నని చూసి ఉండాల్సింది, అప్పుడు మీరు! దేర్ ఈజ్ దిస్ లిటిల్ స్లిప్ ఆఫ్ ఎ ఉమన్! అది ఒక ప్రిలిమినరీ మీటింగ్! ఆమె ఆర్కిటెక్ట్ కాదు. ఆమె ఒక డాక్టర్! ఫ్లోర్ ప్లాన్స్ గీసుకొచ్చేసింది. అన్నిటి మీదా ఆమె సంతకాలు, తేదీలతో సహా. ఎన్ని గంటలు శ్రమపడిందో, ఎలా గీసిందో ఏమో!”
శైలబాల “దట్స్ మై ఆంట్! ఆల్ రైట్!” అంది.
సుమ సోఫాలో కాళ్ళు మడుచుకుని దిండు ఒళ్ళో పెట్టుకు కూర్చుని ఉంది. “ఎ.ఒ.ఎల్. టైమ్ వార్నర్ టవర్స్ కడుతున్నప్పుడు, మా అమ్మ ఈ అపార్ట్మెంట్లో, ఈ బాత్రూమ్ బైటి తలుపుకి నిలువెత్తు రిఫ్లెక్టింగ్ మిర్రర్ పెట్టించమని చెప్పింది. యూ కెన్ సీ ద రిజల్ట్ నౌ. ప్లీజ్ కంటిన్యూ” అంది సుమ.
“మా నాన్న, ఈ డాక్టర్‌కి మా బిల్డర్స్‌తో పాటు పనిచెయ్యాలని ఉన్నట్టుంది. మీ ప్లాన్లు అమ్మకానికా? అన్నాడు. ఆయన కన్నా మించిన వ్యాపారదక్షుడు డాక్టర్ సోబీ. ‘ఆ ప్లాన్లూ, ఆ డాక్టరూ అమ్మకానికి లేరు. మా ఆంకాలజీ ప్రాక్టీస్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. ఒరిజినల్స్ నా సేఫ్‌లో భద్రంగా ఉన్నయ్. ఈ కాపీలు కూడా, నాతోపాటే ఈ రూమ్ విడిచి పెడతాయి’ అన్నాడు.”
నిసి కూడా వారి గతం గురించిన అతని కధనం వింటూంది. బాగానే గుర్తుపెట్టుకున్నాడు పీటర్. అతని నవ్వులు ఆ మీటింగ్ మధ్య మధ్యలో ఆమె వింటూనే ఉంది. మీటింగ్ తర్వాత తను బైటికి వెడుతూ, పీటర్ని గమనించింది. అప్పుడూ నవ్వాడు, తను అతని ముందాగి తటపటాయిస్తుంటే. ‘డాక్టర్ షామల్! మనం ఇంతకుముందోసారి కలిశాం! నేను ఓ రెండు నెలల క్రితం, మీకు వాషింగ్టన్ డి.సి.లో ఒక టూరిస్ట్ ఎట్రాక్షన్ మ్యూజియం, అందులో ఆర్ట్ చూపిన గైడ్‌ని. రిమెంబర్? బిగ్ పీటర్ మా నాన్న. నాకు ఆయన కొత్త బిల్డింగ్ ప్రాజెక్ట్స్-ఇంకా చర్చల్లోనూ, ఆరంభదశల్లోనూ ఉన్నవి కొన్ని, వేరు వేరు సిటీల్లో చూపిస్తున్నాడు. వాట్ ఎ సర్ప్రైజ్ టు మీట్ యు హియర్! హోప్ ఉయ్ మీట్ ఎగెయిన్’ అని తనతో ప్రైవెట్గా చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఎదిగే ప్రొఫెషనల్స్‌గా, వాళ్ళ మధ్య ఏళ్ళ తరబడి, చాలా గ్రంథం నడిచింది. దెన్ హి డిసపియర్డ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్! ఫ్రమ్ ద కంట్రీ. వెల్! హి ఈజ్ హియర్ నౌ. తన లోపలి ఆలోచనల నుండి బయటపడి, నిసి వాళ్ళందరితో;
“గైస్! నా పాత మెడికల్ ప్రాక్టిస్ కబుర్లు, ఇప్పటి బిజీ, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ మీరేం చేసుకుంటారు. రేపో ఎల్లుండో సరదాగా కొలంబస్ సర్కిల్లో షాపింగ్ కలిసి చేద్దామా మనం?” అంది.
“నీతోనా! ఉయ్ కేంట్ ఎఫోర్డ్ ఇట్! పీటర్‌ను తీసుకు వెళ్ళు,” అన్నారు వాళ్ళిద్దరూ.
Let us go then, you and I,
When the evening is spread out against the sky
Into the billionaires’ row, Conroy!
అంది నిసి.
వారి దగ్గర సెలవు తీసుకుని నిసి, పీటర్ వెళ్ళిపోయారు.
పామ్ కోర్ట్ – ద ప్లాజా, సెంట్రల్ పార్క్ సౌత్.
ఆ ఆదివారం, ఆఫ్టర్నూన్ టీ సర్వీస్‌కి పీటర్, నిసితో పాటు సుమ, శైలను కూడా ఆహ్వానించాడు. రంగుల గ్లాస్ డోమ్ కింద ఎలిగెంట్ సీటింగ్, ఎటెంటివ్ సర్వీస్. కంటికి, జిహ్వకు తృప్తినిచ్చేట్టు సిల్వర్ ట్రేలలో పేస్ట్రీలు, కేక్, రకరకాల టీలు. చక్కని డిజైన్ల బోన్ చైనా ప్లేట్లు, కప్పులు. సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్ కట్లరీ. అతి ఆహ్లాదకరమైన చోటు. వారు నలుగురూ ఎక్సయిటెడ్గా మెనూ చదువుతూ సంప్రదింపులు చేస్తున్నారు.
పీటర్ సుమతో, “మీ డేడ్ మోస్ట్లీ వెజిటేరియన్, కాని మీ ఫామిలీలో మరెవరూ వేగన్ కాదులాగుంది. నాకు మీ డేడ్ తెలుసు! కొన్ని సాయంత్రాలు నేను నిసి ఆఫీసులోంచి బిల్లింగ్‌కి సంబంధించిన కాగితాలు చూపించి, సంతకాలు పెట్టించుకుని బైటకు వచ్చినప్పుడు, మీ ఫాదర్ వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉండేవాడు. మా బిజినెస్ మీటింగ్స్, వేరే చోట్ల మా ఆఫీసులలో బాగా ఆలస్యంగా జరిగినా, అక్కడకు వచ్చి ఆమెను తన కార్లో ఇంటికి తీసుకువెళ్ళేవాడు. నిసి ఒక్కతే స్నోలో, రాత్రులలో, కారు నడపటం ఆయనకు ఇష్టం లేదు.
యువర్ మదర్ ఈజ్ వెరీ స్పాయిల్ట్!
చాలాసార్లు, ఆమె నా కారులోంచి దిగి, మీ నాన్న డోర్ తీసి పట్టుకుంటే ఆ కారులో ఎక్కేది. నేను ఆమె ఫైల్స్, ఎటాషే వాళ్ళ కారులో పెట్టేవాడిని. ఆమెకు అలా సాగింది. మేము ఆమెను చాలా గారాం చేశాం. ఉయ్ ఆల్ పేంపర్డ్ హర్! దేవుడికే తెలియాలి ఎందుకో!”
టీ రూమ్‌లో, అందరి కోసం అమర్చిన డెలికసీలు కూడా వారు మధ్య మధ్యలో తెచ్చుకుని రుచి చూస్తున్నారు. వారి సంభాషణ ఆగుతూ, నింపాదిగా సాగుతూంది.
“ఒక సంవత్సరంలో, నిసికి తన పేషెంట్స్ పని కాక, అప్పటికి పూర్తి అవొచ్చిన కేన్సర్ సెంటర్ గోడల పెయింట్ కలర్ సెలక్షన్, ఇంటీరియర్ డెకరేటింగ్, ఫర్నీచర్ ప్లేస్మెంట్, కార్పెటింగ్, ఆర్ట్ వర్క్ ఎన్నిక, బిల్డింగ్ బైట, లోపలి సైనేజ్తో సహా బాధ్యతంతా ఆమె చేతిలో పెట్టారు. ఆమె క్రియేటివిటీ గమనించిన సోబీ, ఆమెకు ఎప్పటికప్పుడే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేవాడు. ఆమె ఒక్కో ప్రాజెక్ట్ పూర్తి చేసినప్పుడల్లా అతడికెంతో మురిపెం.
నేను లంచ్ అవర్‌లో ఆమెను కార్లో ఎక్కించుకుని, ఫర్నిచర్ షో రూమ్‌లకు తీసుకువెళ్ళేవాడిని. సెలెక్షన్ ఆమెది. బడ్జెటింగ్, డెలివరీ, మాన్యుయల్ వర్క్ రెస్పాన్సిబిలిటీ నాది. నిసి తర్వాత తర్వాత వేరే సెంటర్లలో, కొన్ని రోజులు కొన్ని గంటలు పేషెంట్ కేర్ పనిచెయ్యాల్సి వస్తే, నేను ఆమె స్కెడ్యూల్ తెలుసుకుని, నా కార్యక్రమం మార్చుకుని తనను డ్రైవ్ చేసి తీసుకెళ్ళేవాడిని. ఆమె డిక్టేషన్లు, పేపర్ వర్క్ కార్లో పూర్తిచేసేది. లేకపోతే, సాయంత్రాలు హాస్పిటల్లో ఇంకా ఆలస్యంగా పని చెయ్యాలి కదా.” పీటర్.
వింటున్న శైలు, సుమ, “ఆహ్, ఈజ్ దట్ రైట్?! దట్స్ వెరీ కైండ్! పీటర్!” అన్నారు.
కొంచెంసేపు వారిద్దరూ కూడా వర్క్‌లో కష్టసుఖాలు చెప్పారు. ఆ తర్వాత పేరిస్, లండన్ అంటూ తెలిసిన ప్రదేశాల కబుర్లాడారు. టీ సెరిమోనీ ముగిశాక నిసి, పీటర్ కలిసి వెళ్ళిపోతుంటే వారు మలుపు తిరిగేదాకా చూశారు వాళ్ళు.
“దే లుక్ సో హేండ్సమ్ టుగెదర్!” శైలబాల.
“మై మదర్! అండ్ ఏన్ ఆర్కిటెక్ట్. మన కుటుంబంలో సర్ప్రైజెస్కి కొరత లేదుకదా!” అంది సుమ.
సుమ ఎపార్ట్మెంట్ కేసి వారిద్దరూ నడుస్తున్నప్పుడు, “పీటర్ ఈజ్ క్రేజీ ఎబౌట్ హర్. అందులో సందేహం లేదు” అంది శైల.
“కాని మా అమ్మ ‘పేంపర్డ్ ఉమన్’ అంటం. మా డేడ్, తనూ ఆమెను గారాం చేశారనటం. అది సరైన అంచనా అంటావా?” అడిగింది సుమ.
“యా! ఇద్దరు ధనవంతుల కొడుకులు. ఆమెకు కారు డ్రైవరు పనిచెయ్యటానికి హాజరుగా ఉంటం ఆమెకు గొప్ప కాదూ? ఇండియాలో మనం పేద కుటుంబం వాళ్ళం కాదూ?” శైల.
“కమాన్! అమెరికాలో కథ కాలానికి, మా డేడ్కేం సంపాదనుంది? ఫేమిలీకి బిజినెస్ లాస్‌ల టాక్స్ బ్రేక్స్ తప్ప. పీటర్‌కి మాత్రం ఏముంది అప్పటికి? రెండు హార్వర్డ్ డిగ్రీలు, మోపెడు స్టూడెంట్ లోన్ తప్ప. మా అమ్మే వాళ్ళిద్దరికీ, పే చెక్. నేను విన్నది, ఆమె సంపాదన అప్పట్లో, అమెరికాలో టాప్ 1%లో ఉందని. ఆమె సంపాదన విషయం ఎవరూ మాట్లాడరేం? వీళ్ళ డైమ్ అండ్ నికెల్ డ్రైవర్ గిరీ ఎంత చేసును! మా అమ్మ రోజూ టేక్సీ తీసుకున్నా చచ్చేంత చవక. కమాన్! శైలూ!” అంది సుమ.
“ఓ, దట్స్ ట్రూ! నేనలా చూడలేదేంటీ! యూ ఆర్ రైట్! యూ ఆర్ రైట్! ఐ వాంట్ టు వాక్ మై డాగ్ ఇన్ సెంట్రల్ పార్క్! వస్తావా? పద!” అంది శైలబాల.
బ్రయంట్ పార్క్, మిడ్‌టౌన్ మన్హాటన్.
ఆ సోమవారం, పార్క్ వింటర్ విలేజ్ స్కేటింగ్ రింక్‌లో హాయిగా జారుతున్న పిల్లా పెద్దా, కేరొసెల్ గుర్రాల మీద తిరిగే పసిహృదయులూ, జగ్లింగ్ ఏరియా, పింగ్ పాంగ్, లాడ్జ్ లోని వెరైటీ ఆఫ్ ఫుడ్ వెండర్స్, బ్రెడ్ బేకరీలు, పార్క్ చుట్టూ కిక్కిరిసి ఉన్న షాప్‌లలో క్రిస్మస్ క్రౌడ్స్, శాంటా కార్నర్లో హో హో హో అంటూ పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఫొటోలు దిగుతున్న శాంటాక్లాజ్, పిల్లల కేరింతలు, ఎగిరే బెలూన్లూ బూరల మోతలూ, అన్నివినోదాలూ గమనిస్తూ, మాట్లాడుకుంటూ నడుస్తున్న నిసి, పీటర్, లంచ్ తినేందుకు పార్క్ గ్రిల్ ఆన్ ఫార్టీయత్ స్ట్రీట్ దగ్గర ఆగారు.
పార్క్‌లో ఫుడ్ వెండర్స్ కన్నా, నిసికి కొంచెం ఫుడ్ సెలక్షన్లో సేఫ్టీ, డ్రింక్స్ సెలెక్షన్లో వెరైటీ ఉంటుందని, పీటర్ అక్కడికి వెడదామన్నాడు. లొకేషన్, డెకొర్, ఆల్ఫాన్సో డైనింగ్, సీనరీకి ఎన్నికగన్న ప్లేస్! ఇన్నేళ్ళ ఎడబాటు తర్వాత వాళ్ళిప్పుడు, ఒకరి సమక్షంలో ఒకరు ఎలాగూ సెవన్త్ హెవన్లో ఉన్నా, గతంలోకి వెళ్ళవద్దని మనసులో వారు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, సాలడ్, మొదటి రౌండ్ మిక్స్డ్ డ్రింక్స్ అయ్యేసరికి అన్నిరూల్స్ అతిక్రమించారు. దారి తీసింది పీటర్ కాన్రాయ్!
“ఐ ఫాలోడ్ యూ టు యువర్ టౌన్, ఫాలింగ్ ఫర్ యువర్ లవ్ టాక్ ఆన్ ఎ మ్యూజియమ్ టెరేస్! ఐ బికేమ్ యువర్ షోఫర్! ఎ మిలియనీర్స్ సన్! బికేమ్ ఎ డ్రైవర్ ఎట్ యువర్ బెక్ అండ్ కాల్! లుక్డ్ ఆఫ్టర్ యూ, డే ఇన్ అండ్ డే ఔట్! ఏమిటి నువ్విచ్చిన బహుమతి చివరికి నాకంటే, యు ఫైర్డ్ మి! నేను ఊరు విడిచి పెట్టి, అంతేనా! దేశమే విడిచిపెట్టి పోయా.”
నిసి నవ్వింది. తెరలుతెరలుగా. ఇతరులు ఆవేశపడితే ఆమెకు కోపం రాదు సరికదా, నవ్వుతుంది. “స్టాప్ బియింగ్ డ్రమటిక్! యూ, బూరిష్ ఐరిష్ ప్రిక్!” – అనేసి.
“కమాన్! అప్పుడు మిలియనీర్ కొడుకువి. నేను ఫైర్ చేశాక, బిల్డింగ్లు కట్టి ఇప్పుడు నువ్వే పెద్ద మిలియనీర్వయ్యావు. వాట్స్ యువర్ కంప్లెంట్ నౌ? కమాన్! ఫినిష్ లంచ్! న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ మూసేస్తారు. పోదాం పద. ఐ హేవ్ మెంబర్షిప్ కార్డ్! డు యూ?”
“ఐరిష్ ప్రిక్! అదే కావలసి వచ్చిందిగా నిన్నా మొన్నా. డోంట్ మౌత్ ఆఫ్! కొత్తగా నేర్చావు వల్గారిటీ! బి కేర్‌ఫుల్! ఐ కెన్ కారీ యూ ఫ్రమ్ హియర్ టు తాజ్, ఆన్ మై షోల్డర్ అండ్ స్పాంక్ యువర్ బిహైండ్ ఆల్ ద వే.” ఉడుకుతూ పీటర్.
“యా! జాన్ వేన్! యు ఆర్ ఆల్ స్టీల్ అండ్ కాంక్రీట్ నౌ! ఆ సిస్సీ షోఫర్ పని మానేసి, ఇప్పుడు దిమ్మచెక్కల్లే ఎంత ధృడంగా ఉన్నావ్! యు షుడ్ థేంక్ మీ! గుగెన్హైమ్కి నాతో రావా? మ్యూజియమ్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ బిల్డింగ్ రీమోడెల్ చేశారు. ఇదెన్నో రీమోడెలింగ్! మొదటినించీ వాళ్ళు సేకరించిన ఆర్కిటెక్ట్‌ల ఒరిజినల్ పెన్సిల్, కలర్ స్కెచెస్, మోడెల్స్ ఎక్జిబిట్ ఉందిప్పుడు. చూస్తానికి మోమాకి నాతో రావా ఏమిటి?” నిసి.
“గో గాలివాంట్ ఆన్ యువర్ ఓన్, ఉమన్!” కోపంతో పీటర్.
“డోంట్ యూ వుమన్ మీ, యూ డిక్! వాట్స్ ద మేటర్! ఆ ఎక్జిబిషన్లోని పాత డిజైన్లలో మా కార్పొరేషన్ నుంచి మీ నాన్న కొనేసుకున్న, నా సంతకాలున్న బిల్డింగ్ స్కెచెస్ ఏమైనా పొరపాటున బైటపడతయ్యేమో అని భయమా!” అంది ఎగతాళిగా నిసి.
“దట్ డజ్ ఇట్!” అని టేబిల్ మీద తన నేప్కిన్ విసిరికొట్టి వెళ్ళిపోయాడు, పీటర్ కాన్రాయ్.
ఆ పోట్లాట అంతా మర్చిపోయి, ఆ సాయంత్రం నిసితో కొలంబస్ సర్కిల్‌కి వెళ్ళాడు పీటర్. షాపింగ్ సెంటర్లో నిసి కొనుగోళ్ళు అన్నీ శ్రద్ధగా చూసి, తన అభిప్రాయం చెప్పి నచ్చినవన్నీ కొనిపించి, ప్రతి చోటా ఆ బేగ్స్ తాజ్ హోటల్లో తన స్వీట్‌కి డెలివరీ చేసే ఏర్పాటు వాళ్ళతో చేశాడు. అంతా అయ్యాక కులాసాగా వాళ్ళు ‘డిన్నర్ అండ్ జాజ్’ కోసం, ఆ బిల్డింగ్ లోనే ఉన్న డిజీస్ క్లబ్‌కు వెళ్ళారు.
సంవత్సరాల స్నేహం. ఎండా వానా, చలీ మంచూలో కలిసి పయనించారు. మారే సీజన్స్ కలిసి అనుభవించారు. ఒకరి స్వభావం మరొకరికి బాగా తెలుసు. వారికి ఒకరితో ఒకరు కఠినపు మాటలు విసురుకున్నదే గుర్తుండదు. పాత ఉద్యోగాల రెస్ట్రిక్షన్స్ లేవు! ఆకస్మికంగా ఇప్పుడు కొత్తరకం చెర్లాటం మొదలయింది. కుంజమంటపుకుటీ క్రోడమధ్యంబున నాఖుతోచెర్లాడునడవిపిల్లి. బహుశా ఆ రాత్రి వారి కౌగిళ్ళు మరింత ఫైర్ వర్క్స్‌తో, మరింత ఎక్స్‌ప్లోజివ్‌గా ఉన్నయ్యేమో!
క్రిస్మస్ ఈవ్. రాక్ఫెల్లర్ సెంటర్.
రంగురంగులుగా వెలిగిపోతున్న డెబ్బై ఏడు అడుగుల క్రిస్మస్ ట్రీ, ఏంజెల్స్, ప్లాజా స్కేటింగ్ రింక్, అన్నిదేశాల జెండాల డిస్ప్లే, చుట్ట్టూ కమర్షియల్ బిల్డింగ్స్ లైటింగ్‌తో ధగధగలాడిపోయే మిడ్‌టౌన్ మన్హాటన్ ఫిఫ్త్, సిక్త్ ఎవెన్యూలూ 40, 50, 60 స్ట్రీట్స్, సిటీవాసులతో, టూరిస్టులతో కిక్కిరిసిపోయి ఉన్నయ్యి. పీటర్, నిసి ఇద్దరూ ఇంత జనం ఎప్పుడూ చూడలేదనుకున్నారు. ఇంతమంది ఓరియంటల్స్ని నేనెప్పుడూ చూడలేదంది నిసి. అసలు వాళ్ళు నడవటం కన్నా, వారిని జనం ఒక గుంపుగా తోసుకుని పోతున్నట్టనిపించింది. నువ్వున్నావు నాకు పెద్ద కోటలాగా, బిల్డర్! లేకపోతే పిప్పి ఐపోదునేమో, అంది నిసి.
“మై గాడ్! సేక్స్ ఫిఫ్త్ డెకరేషన్స్, లైట్స్ షో ఈజ్ స్పెక్టాక్యులర్! ఎన్నో సంవత్సరాలలో దిస్ ఈజ్ ద బెస్ట్! క్రిస్మస్ ట్రీ దగ్గర కన్నా రద్దీ ఇక్కడ ఈ కార్నర్లో చాలా ఎక్కువ. జనాలు సెల్‌ఫోన్ విడియోలు తీస్తూ కదలటమే మర్చిపోయారు. వి బెటర్ గెట్ ఔట్ ఆఫ్ హియర్!” అన్నాడు నిసిని పక్క స్ట్రీట్ లోకి మళ్ళిస్తూ పీటర్.
“హోటల్ పెనిన్స్యులా డెకరేషన్స్ ఆర్ గార్జియస్! నెవర్ సా సచ్ క్రౌడ్స్ ఎనీ ఇయర్! ఇదే ఆఖరి క్రిస్మస్! ఎండ్ ఆఫ్ ద ఎర్త్ లాగా వచ్చిపడ్డారేమిటి! షామల్! ఇంతమంది చైనీస్‌ని నేనూ ఎప్పుడూ చూడలేదు. బర్గ్డార్ఫ్ గుడ్మన్ విండో డెకరేషన్స్ ఆర్ ఫాంటాస్టిక్!” అక్కడక్కడా, నిసిని వారిస్తూ, పక్క సందుల్లోకి దారి మళ్ళిస్తూ. ఆ రద్దీలో వారికి ఒకరి మాటలు ఒకరికి వినబడ్డమే లేదు. ఐనా హుషారుగా ఎటు కాస్త ఖాళీ దొరికితే అటు తిరుగుతున్నారు.
“సెంట్ పాట్రిక్ కెథడ్రెల్లో కార్డినల్ డోలన్ మిడ్నైట్ మాస్ వినేదాకా ఉంటామా? ఈ లోపలే స్వర్గానికి వెడతామా? ప్రేయర్స్ తప్పక వినాలన్నావు. ఈ క్రౌడ్‌ని అసలు ఎవరు కంట్రోల్ చెయ్యగలరు! ఇట్ ఈజ్ ఇన్ డేంజరస్ ప్రపోర్షన్స్!” పీటర్.
“ముందు క్రిస్మస్ ఈవ్ డిన్నర్ కానీ. తర్వాత, కార్లైల్ హోటెల్లో సంగీతం ఉండి ఉంటుంది. ఒకటో రెండో డాన్స్‌లు చెయ్యాలి. ఐ వాంట్ టు కిస్ యూ అండర్ ద మిసిల్ టో. ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ పీటర్! ఇన్ ద స్ట్రీట్స్! టునైట్!” నిసి.
“ష్యూర్ థింగ్! స్టెప్ ఆన్ మై టోస్! ఆల్వేస్! అన్నిటికన్నా నీకిష్టమైన కార్యక్రమం -ఈ చుట్టుపక్కల లక్జరీ హోటెల్ లాబీలు, బిజినెస్ సెంటర్ ఏట్రియమ్లలో జింగిల్ బెల్స్ వినటం, క్రిస్మస్ రీత్స్, రిబ్బన్స్, స్నో ఫ్లేక్స్, కేండీ కేన్స్, క్రిస్మస్ ట్రీస్ చూస్తం, క్రిస్మస్ కేరొలింగ్ వినటం. అవి చెయ్యొద్దూ.” పీటర్.
“ప్లాజా, వాల్డార్ఫ్ ఏస్టోరియా, ఫోర్ సీజన్స్, పార్కర్, పెనిన్సులా, ఓ! లెట్ అజ్ సీ! బ్లాక్‌రాక్ లాబీ, ట్రంప్ టవర్, గ్రామర్సీ పార్క్ హోటెల్, ఓ! లెటజ్ సీ. నట్ క్రాకర్ స్టాట్యూస్ ఎట్ సెంట్. రీజిస్. లెటజ్ గో క్రేజీ విత్ దీజ్ లైట్స్, డెకరేషన్స్ అండ్ హేపీనెస్. ఓ! హౌ ఐ విష్ ఇట్ స్నోస్ టునైట్!” నిసి.
వాళ్ళు చెట్టాపట్టాలు వేసుకుని, ఆ ఫెస్టివ్ నైట్‌లో కోరిన కోరికలెన్నోతీర్చుకుంటూ, ఎప్పుడో తెల్లవారుజాముకి, తాజ్‌కి వెనక్కి వెళ్ళారు.
క్రిస్మస్ డే. ద పియెర్ హోటల్.
ఆ హోటల్‌కి రమ్మని సుమ, శైల ఇద్దరికీ పీటర్ నుండి ఇన్విటేషన్. “మెర్రీ క్రిస్మస్! లేడీస్! కమ్ హేవ్ లంచ్ విత్ అజ్. నిసి రేపు వెళ్ళిపోతున్నది. రేపు నేనామెను ఎయిర్‌పోర్ట్‌కు డ్రైవ్ చెయ్యబోతున్నా.”
సుమ, శైల చక్కగా ఇద్దరూ హాజరయ్యారు. ఫ్రెష్ ఫ్రూట్, మేంగో లస్సీ, పరాఠా చక్కగా సేవించి, పీటర్‌తో “మీ మూలాన మా అమ్మను ఇన్నిసార్లు చూశాం,” అని సుమ అంటే, “నిజమే, అండ్ హౌమెనీ నైస్ ట్రీట్స్! మళ్ళీ తొందరలో రావాల”ని శైలబాల అనేసి, హగ్గులూ, ముద్దులూ ఇచ్చి, వాళ్ళు వెళ్ళిపోయారు.
అరమరికల్లేని ఆ క్లోజ్ కజిన్స్ ఇద్దరూ తాజ్ హోటల్ బైటకు నడిచారు.
“సుమక్కా! పీటర్ కెరియర్ మధ్యలో విడిచి విదేశ యాత్రలకెందుకు వెళ్ళినట్టూ? యూ థింక్! హి హేడ్ సడెన్ ఎక్జిస్టెన్షియల్ క్రైసిస్ లైక్ లేరీ డేరెల్?”
“లేరీ, హూ?”
“లేరీ డేరెల్, ఇన్ రేజర్స్ ఎడ్జ్ నావెల్. జీవితం పర్పస్ ఏంటో తెలుసుకోవాలని, ఇండియా పోయి, ట్రివాంకోర్లో శ్రీ గణేశ్ మహర్షిని చూస్తాడూ…”
“ఓ! దట్ కాన్సుమేట్ ఇడియట్! ఇండియాలో పొద్దున్నే ఏదో చెట్టుకింద పోయి కూర్చుని, సూర్యోదయం చూసి, ఎన్‌లైటన్‌మెంట్ వచ్చిందని కోతలు కోస్తాడు. ఆ లేరీ! ఆ ట్రావెల్ ట్రాష్! లేరీ డేరెల్! దట్ గుడ్ ఫర్ నథింగ్ బమ్! సోమర్సెట్ మామ్, ఆ జంకీని 1944లో హీరోగా ప్రపంచానికి అమ్మేశాడు! ఓ దట్ లోఫర్! దట్ పేరసైట్!” అంది సుమ.
“హూఁ. పీటర్ కట్టిన బిల్డింగ్‌ల బొమ్మలు చూశాంగా. దట్స్ వెరీ క్రెడిబుల్, లాస్టింగ్ వర్క్. అతడు సీరియస్‌గా ఆర్కిటెక్చర్ స్టడీ చేసి ఉంటాడు విదేశాల్లో. హి ఈజ్ నాట్ ఎ రిఫ్-రేఫ్ బేక్-పేక్ ట్రావెలర్, వాంటింగ్ టు సెల్ ఎన్లైటెన్మెంట్ ఆర్ ఎనీ అదర్ ట్రావెల్ జంక్! యా! లేరీ డార్రెల్ ది, సూడో క్వెస్ట్! సూడో హీరోయిజమ్! ఐ ఎగ్రీ.” అని మళ్ళీ “పీటర్ ఈజ్ మోర్ లైక్ హవర్డ్ రోర్క్, యూ థింక్?” అడిగింది శైలబాల.
“హవర్డ్ హూ?”
“హవర్డ్ రోర్క్ ఫ్రమ్ ఫౌంటెన్హెడ్ నావెల్. 1943 హీరో సుమక్కా. లిటరేచర్తో ఏ మాత్రం పరిచయం ఉన్నా ఈ హీరోలు తెలిసి ఉండాలే.” పొంగి వచ్చే నవ్వు ఆపుకుంటూ శైలబాల.
“ఆర్ యూ డిస్సింగ్ మీ, యూ మియర్ ఛైల్డ్! మేంగో లస్సీ తాగావనుకున్నా. జస్ట్ హౌ మెనీ బెల్లీనీ డిడ్ యూ డ్రింక్! శైలూ? ఆర్ యూ స్టక్ ఆన్ పీటర్ ఆర్ వాట్!? గో హోమ్ అండ్ వాక్ యువర్ డాగ్! శైలూ, గో.”
ఇద్దరూ మనసారా నవ్వేసి, క్రిస్మస్ విషెస్ మళ్ళీ చెప్పుకుని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు.
డే ఆఫ్టర్ క్రిస్మస్. కెనెడీ ఎయిర్ పోర్ట్.
“షామల్! నీకు దణ్ణం పెడతా. నువ్వొచ్చి నాతోపాటు నివసించవూ. నీకు ఎంతకాలం వీలైతే అంతకాలం, ఎంత త్వరగా వీలైతే అంత! రావూ!” అన్నాడు పీటర్ కాన్రాయ్ నిసిని కౌగిలిస్తూ, ఫస్ట్‌క్లాస్ లౌంజ్‌లో.
“తప్పకుండా. పీటర్! మై అపాసెల్!” అతని గరుకు గడ్డం రాస్తూ అంది నిసి. “వుడ్స్లో ఫిలిప్ జాన్సన్ కట్టినలాటి గ్లాస్ హౌస్, అందులో ఒక క్రిస్టల్ పియానో గ్రాండ్ అమర్చుతావుగా!”
“యూ ఆర్ ఎ డెవిల్ షామల్! ఇట్స్ ఎ డీల్! మెర్రీ క్రిస్మస్! అండ్ ఎ హేపీ న్యూ ఇయర్!” అన్నాడు పీటర్ కాన్రాయ్ నవ్వుతూ. అతడి బ్లూ-గ్రీన్ కనుపాపల లాగానే, అతని కోట్ లేపెల్ మీద నిసి చక్కగా పిన్ చేసిన కార్టియే రవ్వల నీలాల పచ్చల పేంథర్, మిలమిలలాడింది.
(నిసి షామల్ 2019 డైరీల నుండి)