విశ్వనాథగారితో వేదాంత చర్చ

సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది. ఆయన తన అనుభవాలు కూడా కొన్ని పంచుకున్నారు. ఈమాట పాఠకులకు ఆసక్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రచురిస్తున్నాం. ఈ ఆడియోతో పాటు, చేతిరాతతో ఉన్న ఆ చర్చాభాగాల పీడీయెఫ్ కూడా. ఆర్. వసుంధరాదేవిగారు పంపిన ఈ ఆడియో, చర్చాపాఠం మనతో పంచుకుంటున్న విన్నకోట రవిశంకర్ గారికి కృతజ్ఞతలు.

[బాగా పాత రికార్డింగ్ కావడంతో మేము వీలైనంతగా శుభ్రం చేసినా అక్కడక్కడా ఆడియో అంత స్పష్టంగా లేదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. -సం.]